దేశ వ్యాప్తం గా అభిమానులున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్ర సీమ లో హీరోగా ప్రవేశించి నేటితో 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. K.రాఘవేంద్ర రావు దర్శకత్వం లో గంగోత్రి మూవీ ద్వారా అల్లు అర్జున్ హీరోగా పరిచయమయ్యారు. గంగోత్రి మూవీ 2003 సంవత్సరం మార్చి 28 వ తేదీ రిలీజయి మ్యూజికల్ హిట్ అయింది. అల్లు అర్జున్ నటించిన ఆర్య, బన్నీ, దేశముదురు, పరుగు, జులాయి, రేసుగుర్రం , ఇద్దరమ్మాయిలతో, S/O సత్యమూర్తి, సరైనోడు, దువ్వాడ జగన్నాథం సినిమాలు ఘనవిజయం సాధించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే అల్లు అర్జున్ సినిమాలకు దక్షిణాది లోనే కాదు డబ్బింగ్ మూవీస్ ద్వారా ఉత్తరాది లో కూడా క్రేజ్ ఏర్పడింది. అల్లు అర్జున్ నటించిన జులాయి, రేసుగుర్రం, సరైనోడు,దువ్వాడ జగన్నాథం సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ త్వరలోనే ప్రారంభం కానుంది. సుకుమార్ దర్శకత్వం లో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పలు
చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు.
[totalpoll id=”17942″]
[youtube_video videoid=Y_sUze-_TZI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: