అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నార్త్ బ్యూటీ షాలిని పాండే. తాను ఎన్ని సినిమాలు చేసిన తెలుగు ప్రేక్షకులకు అర్జున్ రెడ్డి ప్రేమించిన అమ్మాయి ప్రీతి గానే గుర్తుండి పోతుంది. నిజానికి ఒక సినిమా సూపర్ డూపర్ కాదు బ్లాక్ బస్టర్ హిట్ కొడితే ఈ సినిమాలో ఉన్న హీరో, హీరోయిన్ ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోతారు. అలాగే ఈ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ, ఫ్రెండ్ గా నటించిన రాహుల్ రామకృష్ణ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, షాలినిపాండే ఓవర్ నైట్ లో టాక్ ఆప్ ద టౌన్ అయిపోయారు. అయితే అందరికంటే ఎక్కువగా విజయ్ దేవరకొండకు స్టార్ క్రేజ్ వచ్చింది. ఎన్నో ఆఫర్లు క్యూ కట్టాయి. ఆ తరువాత వచ్చిన గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలు కూడా హిట్టవ్వడంతో మనోడి రేంజే మారిపోయింది. ఇదంతా ఒక స్టోరీ…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే అర్జున్ రెడ్డి సినిమా తరువాత షాలిని పాండేకు కూడా అవకాశాలు వచ్చినట్టే వచ్చాయి కానీపెద్ద పెద్ద సినిమాలు మాత్రం రాలేదని చెప్పొచ్చు. కానీ ఈ అమ్మడికి అదృష్టం కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగులో నటించిన మూడు సినిమాలు మంచి ఘన విజయమే సాధించి హ్యాట్రిక్కే కొట్టింది. అర్జున్ రెడ్డి సినిమా తరువాత సావిత్రమ్మ బయోపిక్ మహానటి సినిమాలో నటించింది. ఆసినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. ఇక ఇటీవల కె.వి గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 118 సినిమా హీరోయిన్ గా నటించింది. ఈసినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. పటాస్ తరువాత చాలా గ్యాప్ తరువాత కళ్యాణ్ రామ్ కు అందిన హిట్ ఇది. అలా సైలెంట్ గా వరుసగా మూడు హిట్లు కొట్టి హ్యాట్రిక్ అందుకుంది. అదే ఈ హ్యాట్రిక్ కనుక ఓ పెద్ద హీరోయిన్ కొడితే అప్పుడు పరిస్థితి వేరే ఉండేదనుకోండి. పెద్ద పెద్ద డైరెక్టర్స్ క్యూ కట్టేవాళ్లు. కానీ మన దర్శకులకు షాలిని మాత్రం పెద్దగా కనిపించడం లేదనే అనిపిస్తోంది. ఏది ఏమైనా షాలినికి అదృష్టం బాగానే ఉందని చెప్పొచ్చు. అందుకే ఐరెన్ లెగ్ అనే ముద్ర మాత్రం వేసుకోకుండా వరుసగా హిట్లు కొట్టేసింది.
ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, హిందీల్లో కూడా బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్యే బాలీవుడ్ ఆఫర్ కూడా అందుకుంది ఈ బ్యూటీ. ఇందులో సీనియర్ బాలీవుడ్ యాక్టర్ పరేష్ రావల్ తనయుడు అదిత్య రావల్ హీరోగా పరిచయం అవుతున్నాడు. మరి బాలీవుడ్ లో షాలిని పాండే కు ఈ లక్ ఇలానే ఉండాలని.. అక్కడ కూడా సక్సెస్ కొట్టాలని కోరుకుందాం..
[youtube_video videoid=ivWH4LzH5eM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: