ఫైనల్లీ ఆర్ఆర్ఆర్ సినిమా హీరోయిన్స్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ ఉదయం సినిమాకు సంబంధించిన వివరాలను తొలిసారిగా వెల్లడిస్తూ నిర్వహించిన మీడియా సమావేశంలో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తోందని.. తారక్ సరసన డేజీ అడ్గారియన్స్ కనిపించనుందని తెలిపారు. అంతేకాదు ఈ సినిమాలో అజయ్ దేవగన్ చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని దర్శకుడు రాజమౌళి వెల్లడించారు.
కాగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా ఈసినిమాను పలు లాంగ్వేజస్ లో విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం తో పాటు పలు ఇండియన్ లాంగ్వేజస్ లో రిలీజ్ చేయనున్నారు.
[youtube_video videoid=WahpR5yMmb8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: