శాండల్ వుడ్ సెన్సేషనల్ స్టార్ ఉపేంద్ర సతీమణి ప్రియాంక ఉపేంద్ర కూడా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఉపేంద్ర తనయ దేవకి మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా శాండల్ వుడ్ కు ఎంటర్ అయ్యారు. రియల్ లైఫ్ లో తల్లీ తనయలు ప్రియాంక ఉపేంద్ర, ఐశ్వర్య ఉపేంద్ర రీల్ లైఫ్ లో కూడా తల్లీ తనయలు గా నటిస్తున్నారు. లోహిత్ దర్శకత్వంలో ప్రియాంక ఉపేంద్ర హీరోయిన్ గా దేవకి మూవీ
రూపొందుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఐశ్వర్య ఉపేంద్ర తన వర్క్ సిన్సియర్ గా చేస్తుందని, తన పాత్రను అర్ధం చేసుకుని నటిస్తుందని, ఆమె నటనా విధానం తండ్రి ఉపేంద్ర మాదిరిగా ఉందని, ఐశ్వర్యతండ్రికి తగ్గ తనయ అని డైరెక్టర్ లోహిత్ ప్రశంసించారు. దేవకి మూవీ మేజర్ షూటింగ్ పార్ట్ నైట్ టైమ్ లో జరిగేదని, ఒకొకరోజు ఉదయం 4గంటల వరకు జరిగేదని ఏ రకమైన కంప్లైంట్ లేకుండా ఐశ్వర్య ఆసక్తి తో షూటింగ్ లో పాల్గొనేదని దర్శకుడు తెలిపారు. కోల్ కత్తా బ్యాక్ గ్రౌండ్ లో తల్లీ తనయల మధ్య జరిగే కథ అని, RJ ఆడిషన్స్ కు రేడియో స్టేషన్ కు వెళ్ళిన తల్లీ తనయలలో తనయ మిస్సవుతుందని తరువాత జరిగే కథ ఈ మూవీ స్టోరీ అని దర్శకుడు తెలిపారు.
[youtube_video videoid=Lu1ro-TPZVI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: