అడివి శేష్ కు మాత్రమే అది మినహాయింపు..!

2019 Latest Telugu Film News, Adivi Sesh Evaru Movie, Adivi Sesh Reason Behind Evaru Movie selection, Adivi Sesh Upcoming Movie updates, Evaru movie latest news, Evaru Unique Story, Telugu Film Updates, Telugu Filmnagar, The Story Behind Adivi Sesh Unique Story Selection, Tollywood Cinema News, unique story by Adivi Sesh
The story behind Adivi Sesh unique story selection

వైవిధ్య కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న కొత్త సినిమా ఎవరు. ఈ క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో రెజీనా, నవీన్ చంద్ర, మురళి శర్మ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగష్ట్ 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటుడిగానే కాదు అటు రచయితగా కూడా తన టాలెంట్ ను చూపిస్తూ దూసుకుపోతున్నాడు. సాధారణంగా డైరెక్టర్లకు హీరో లు తమ డైరెక్షన్ లో వేలు పెడితే చాలా మందికి నచ్చదు. వాళ్ళ క్రియేటివిటీ కి అడ్డొస్తే చాలా మందికి నచ్చదు. కొంత మంది హీరో లు మాత్రం డైరెక్టర్లు ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్ళిపోతారనుకోండి అది వేరే విషయం. అయితే అడివి శేష్ కు మాత్రం వీటికి మినహాయింపు అంటున్నారు అతనితో పని చేసిన డైరెక్టర్లు. ఎందుకంటే ఈ యంగ్ హీరో కి స్క్రిప్ట్ పై మంచి పట్టు ఉండటమే కాకుండా టెక్నికల్ గా కూడా బాగానే పట్టు ఉండటం తో.. తన ఇన్‌వాల్వ్‌మెంట్‌ వున్నా పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే.. దర్శకుడు కావాలనే వచ్చిన శేష్‌కి క్రియేటివిటీ చాలా ఎక్కువ.

క్షణం, గూఢచారి సినిమాల విజయాలే దీనికి నిదర్శనం. ఈ సినిమాల్లో శేష్‌ ఇన్‌వాల్వ్‌మెంట్‌ చాలా వుంది. ఈ సంగతి నిర్మాతలకి కూడా బాగా తెలుసు కనుక అతడికి ఫుల్‌ క్రియేటివ్‌ ఫ్రీడమ్‌ ఇచ్చేస్తున్నారు. అంతే కాదు వీలయినంతగా ఇన్‌వాల్వ్‌ కావాలని దర్శకులు కోరుకుంటున్నారట. అంతేకాదు ఆ నమ్మకంతోనే ఈ కథలోని ట్విస్ట్ ను మార్చినా డైరెక్టర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటా. ఈ కథ ఊహించలేని ట్విస్ట్‌ ఒకటి ఇచ్చాడట. మరి ఆ ట్విస్ట్ ఏంటో అది సినిమా చూస్తేనే కానీ తెలియదు.

కాగా వీటితో పాటు అడివి శేష్ చేతిలో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో గత ఏడాది తనకు మంచి సక్సెస్ ఇచ్చిన ‘గూఢచారి’ సీక్వెల్ కాగా తో మరొకటి మహేష్ బాబు, సోనీ సంస్థల సంయుక్తంగా నిర్మించనున్న మేజర్. అంతే కాదు ఇప్పటికే ‘గూఢచారి’ లో సీక్రెట్ ఏజెంట్ గా చేసాడు. ఇంక ఎవరులో కూడా పోలీస్ పాత్రలో నటించాడు. ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ పాత్రలో నటిస్తున్నాడు. ‘గూఢచారి’ సీక్వెల్ లో కూడా దాదాపు ఏ పోలీసో.. ఏజెంట్ పాత్రనో వుండే అవకాశం వుంది. మరి ఇది యాదృశ్చికమో? ఏమో ? తెలియదు కానీ శేష్ కు వరుసగా పోలీస్ పాత్రలే చేస్తుండటం గమనార్హం. మరి చూద్దాం ఎవరు సినిమాతో అడివి శేష్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో.

[subscribe]

[youtube_video videoid=EmaVLDlzu5M]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 2 =