
ట్యాగ్ · 320 కథనాలు · పేజీ 7


ఆంధ్ర కింగ్ తాలూకా షూట్ కంప్లీట్

క్లైమాక్స్ షూట్ లో మన శంకరవరప్రసాద్ గారు

అఖండ 2తో పోటీ పడనున్న బైకర్

ఛాంపియన్ టీజర్ రిలీజ్

మాస్ జాతర ప్రీమియర్స్ కలెక్షన్స్

శంబాల ట్రైలర్ రిలీజ్

వైభవంగా అల్లు శిరీష్ నిశ్చితార్థం

అఖండ 2 బీజీఎమ్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

A సర్టిఫికెట్ తో రానున్న జటాధర

12 ఎ రైల్వే కాలనీ ఫస్ట్ సింగిల్ అదిరింది

గ్రాండ్ గా నారా రోహిత్ వివాహం

బాహుబలి: ది ఎపిక్ రివ్యూ

బైకర్ గ్లింప్స్ రానుంది

ప్రేమంటే టీజర్ రిలీజ్
స్ట్రాంగ్ కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తున్న ప్రియదర్శి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే తో రాబోతున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్ గారికి ట్రిబ్యుట్ గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను ఈ రోజు లాంచ్ చేశారు.

ఆంధ్ర కింగ్ తాలూకా షూట్ కంప్లీట్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ 'ఆంధ్ర కింగ్ తాలూకా. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. కేవలం సాంగ్స్ తోనే ఈసినిమా సూపర్ హైప్ తెచ్చుకుంటుంది. రీసెంట్ గా విడుదలైన మూడో పాట ఏకంగా కేవలం 3రోజుల్లోనే 20మిళియన్లకుపైగా వ్యూస్ ను రాబట్టుకొని చార్ట్ బస్టర్ అనిపించుకుంది.

క్లైమాక్స్ షూట్ లో మన శంకరవరప్రసాద్ గారు
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. వెంకటేష్ ఇటీవలే ఈ సెట్ లో జాయిన్ అయ్యారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.

అఖండ 2తో పోటీ పడనున్న బైకర్
చార్మింగ్ స్టార్ శర్వానంద్ నెక్స్ట్ బైకర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు తో వస్తున్న ఈసినిమాలో శర్వా మోటార్‌సైకిల్ రేసర్‌గా కనిపించనున్నాడు. ఇక ఈసినిమా నుండి ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ ను ఈరోజు రిలీజ్ చేశారు.ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమాపై అంచనాలు పెంచేసింది.

పెద్ది నుండి జాన్వీ పోస్టర్లు రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా పెద్ది చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్నాయి.ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ , వర్కింగ్ స్టిల్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈరోజు, మేకర్స్ రెండు డిఫరెంట్ పోస్టర్ల ద్వారా అచ్చియ్యమ్మగా జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

చిన్ని గుండెలో పాటకు సెన్సేషనల్ రెస్పాన్స్
కేవలం సాంగ్స్ తోనే సినిమా చూడాలనే హైప్ క్రియేట్ అవుతుంది ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి.ఉస్తాద్ రామ్ పోతినేని - మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ డైరెక్టర్ మహేష్ బాబు పి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈరోజు తో షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.ఈసినిమా నుండి రీసెంట్ గా వచ్చిన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యి ఆల్బమ్ పై అంచనాలు పెంచగా నిన్న విడుదలైన మూడో సాంగ్ ఆ రెండు పాటలకు మించి రీచ్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఛాంపియన్ టీజర్ రిలీజ్
ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు, యంగ్ హీరో రోషన్ నెక్స్ట్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండగా జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మాస్ జాతర ప్రీమియర్స్ కలెక్షన్స్
మాస్ మహా రాజా రవితేజ నటించిన 75 వ సినిమా మాస్ జాతర ఈరోజు విడుదలకాగా నిన్న సాయంత్రం నుండే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్స్ పడ్డాయి.కేవలం ప్రీమియర్స్ తోనే ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇక ఈసినిమా కు డీసెంట్ టాక్ వస్తుండడం తో మొదటి రోజు హౌస్ ఫుల్ బోర్డుల తో రన్ అవుతుంది.బుక్ మై షోలో ఇప్పటివరకు లక్షకుపైగా టికెట్లు తెగాయి.మొదటి రోజు ఈసినిమా సాలిడ్ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.

శంబాల ట్రైలర్ రిలీజ్
హీరో ఆది సాయి కుమార్ నటించిన మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ .షూటింగ్ పూర్తి చేసుకున్న విడుదలకు సిద్దమవుతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రం ట్రైలర్‌ను ఆవిష్కరించి, బృందానికి తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్రైలర్‌ను చూస్తే ఆడియెన్స్‌కి ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించబోతోన్నట్టుగా కనిపిస్తోంది.

రివ్యూ : మాస్ జాతర
మాస్ జాతర అనేది రవితేజ అభిమానులకు ఆయన ఎనర్జీతో కూడిన యాక్షన్, ఫైట్స్ మరియు పాటలతో కూడిన మాస్ ట్రీట్.ఇందులో రవితేజ నటన ,యాక్షన్ సీక్వెన్స్ , విజువల్స్ హైలైట్ అయ్యాయి. కొత్తదనాన్ని ఆశించకుండా కేవలం మాస్ యాక్షన్ కోరుకునేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

వైభవంగా అల్లు శిరీష్ నిశ్చితార్థం
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు ,యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.ఈ క్రమంలో శిరీష్ , నయనిక రెడ్డితో కలిసి వైవాహిక జీవితాన్ని ప్రారంభించడానికి మొదటి అడుగుగా నిశ్చితార్థం వేడుకను ఘనంగా జరుపుకున్నారు.శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈవేడుకలో శిరీష్, నయనిక ఉంగరాలు మార్చుకున్నారు.ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు,కొద్దిమంది బంధువులు ఈ కార్యక్రమనికి హాజరయ్యారు.

అఖండ 2 బీజీఎమ్ కోసం సర్వేపల్లి సిస్టర్స్
గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ డ్రామా 'అఖండ 2: తాండవం'. బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్ గా .రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలై 'అఖండ 2: తాండవం' ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా వచ్చిన బ్లాస్టింగ్ రోర్ గ్లింప్స్ పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

A సర్టిఫికెట్ తో రానున్న జటాధర
నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.

ఆంధ్ర కింగ్ తాలూకా థర్డ్ సింగిల్ రిలీజ్
ఉస్తాద్ రామ్ పోతినేని - మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ డైరెక్టర్ మహేష్ బాబు పి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది.ఇప్పటివరకు ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈరోజు థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఈసాంగ్ కూడా అదిరిపోయింది.చిన్ని గుండెలో అంటూ వచ్చిన ఈసాంగ్ పొయెటిక్ గా ఉండి ఆకట్టుకుంది. సాంగ్ చిత్రీకరణ కూడా బాగుంది.ఈ సాంగ్ కోసం దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టారు. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించగా మెర్విన్ సోలమన్ ,సత్య యామిని పాడారు.

12 ఎ రైల్వే కాలనీ ఫస్ట్ సింగిల్ అదిరింది
బచ్చల మల్లి తరువాత అల్లరి నరేష్ 12 ఎ రైల్వే కాలనీ అనే హారర్ థ్రిల్లర్ తో రానున్నాడు.పొలిమేర, పొలిమేర 2 ఫేమ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్, ఈసినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా ఈ చిత్రాన్నిప్రఖ్యాత నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.నవంబర్ 21న 12ఏ రైల్వే కాలనీ థియేటర్లలోకి రానుంది.

గ్రాండ్ గా నారా రోహిత్ వివాహం
నారా వారి కుటుంబంలో పెళ్లి సందడి అంగరంగ వైభవంగా జరిగింది.టాలీవుడ్ హీరో నారా రోహిత్, నటి శిరీష లేళ్ల (సిరి) వివాహం గురువారం రాత్రి 10:35 గంటలకు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.

బాహుబలి: ది ఎపిక్ రివ్యూ
పదేళ్ల క్రితం భారతీయ సినిమా చరిత్రను తిరగరాసిన బాహుబలి: ది బిగినింగ్ ఆ తరువాత రెండేళ్ల క్రితం వచ్చిన బాహుబలి: ది కన్‌క్లూజన్ చిత్రాలను కలిపి, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇప్పుడు 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఈ రెండు భాగాలను ఒకేసారి,ఒకే టికెట్‌పై చూసే అవకాశం ప్రేక్షకుడికి దక్కింది. ఈరోజే ఈసినిమా విడుదలైంది.మరి ఈ ఎపిక్ ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో రివ్యూలో తెలుసుకుందాం.

స్ట్రీమింగ్ లోకి కొత్త లోక
ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్టు చివర్లో థియేటర్లలోకి వచ్చిన మలయాళ సినిమా లోక: చాప్టర్ 1 -చంద్ర ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.2 కోట్ల ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన ఈసినిమా ఫుల్ రన్ లో 300కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ రోజు నుంచి జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.

ఓటీటీలోకి వచ్చేసిన కాంతార చాప్టర్ 1
ఈనెల 2న దసరా రోజు భారీ అంచనాల మధ్య విడుదలై నిన్నటి వరకు 800కోట్లకు పైగా వసూళ్ళతో ఈఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది రిషబ్ శెట్టి నటించి డైరెక్ట్ చేసిన కాంతార: చాప్టర్ 1.ఇంకా థియేటర్లలో సాలిడ్ వసూళ్లను రాబడుతున్న ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది.ఈరోజు నుండి ఈసినిమాను అమెజాన్ ప్రైమ్, దక్షిణాది భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.నవంబర్ లో హిందీలో కూడా స్ట్రీమింగ్ లోకి రానుంది.

బైకర్ గ్లింప్స్ రానుంది
చార్మింగ్ స్టార్ శర్వా తన అప్ కమింగ్ మూవీ బైకర్ లో మోటార్‌సైకిల్ రేసర్‌గా ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.ఈచిత్రం పూర్తయ్యే దశకు చేరుకుంది. ఫస్ట్ లుక్, టైటిల్ తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది.