
ట్యాగ్ · 320 కథనాలు · పేజీ 12


పూరి సేతుపతి కొత్త షెడ్యూల్ స్టార్ట్

ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ రెస్పాన్స్ అదిరింది

రామ్ చరణ్, ఉపాసనలపై ప్రధాని మోదీ ప్రశంసలు

బాహుబలి: ది ఎపిక్.. బజ్ పెంచిన సెంథిల్ ట్వీట్

అఖండ 2 కోసం బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన తమన్

కే-ర్యాంప్ ట్రైలర్ రిలీజ్

ఘనంగా ప్రారంభమైన దిల్ రాజు-విజయ్ దేవరకొండ చిత్రం

రవితేజ RT76 ఫారిన్ షెడ్యూల్ ప్రారంభం


ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ డేట్ రివీల్

ఫంకీ టీజర్ రిలీజ్

కాంతార చాప్టర్ 1.. 11 డేస్ కలెక్షన్స్
రిషబ్ శెట్టి నటించి డైరెక్ట్ చేసిన కాంతార చాప్టర్ 1 దేశ వ్యాప్తంగా సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతుంది.నిన్నటితో ఈసినిమా 650 కోట్ల క్లబ్ లో చేరి ఈఏడాది సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. 11 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 655కోట్ల వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ ప్రకటించారు.మరో 150 కోట్ల వసూళ్లను రాబడితే ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించనుంది.మరి ఫుల్ రన్ లో కాంతార చాప్టర్ 1 ఆ మార్క్ అందుకుంటుందో చూడాలి.

పూరి సేతుపతి కొత్త షెడ్యూల్ స్టార్ట్
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా మూవీ పూరి -సేతుపతి (వర్కింగ్ టైటిల్). ఈ సినిమాను జెబి మోషన్ పిక్చర్స్ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. గత నెలలోనే ఈసినిమా టైటిల్ రిలీజ్ అవ్వాల్సివుండగా వాయిదా వేశారు.

ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ రెస్పాన్స్ అదిరింది
ఉస్తాద్ రామ్ పోతినేని నెక్స్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా తో రానున్నాడు.ఈసినిమా కోసం రామ్ అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఓ పాట కూడా తనే రాశాడు. ఆ సాంగ్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది. కేవలం ఆ ఒక్క సాంగ్ తోనే సినిమా కు హైప్ రాగా నిన్న వచ్చిన టీజర్ అయితే సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనే టాక్ తెప్పించింది.టీజర్ ను ఎక్స్ లెంట్ గా కట్ చేయడం తో యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది.కేవలం సింగిల్ లాంగ్వేజ్ లో వచ్చిన టీజర్ 24 గంటల్లో 12 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.

హిందీలో ప్రభంజనం సృష్టిస్తోన్న కాంతార చాప్టర్ 1
స్వీయదర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'కాంతార చాప్టర్ 1' హిందీ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. విడుదలైన రెండో వారాంతంలో ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించి, భారీ వసూళ్లను సాధించింది. ఇక ఈ కలెక్షన్లతో, 'కాంతార చాప్టర్ 1' హిందీ ప్రేక్షకులు కూడా కథకు, రిషబ్ శెట్టి నటనకు ఎంతగా కనెక్ట్ అయ్యారో స్పష్టమవుతోంది.

రామ్ చరణ్, ఉపాసనలపై ప్రధాని మోదీ ప్రశంసలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, స్పోర్ట్స్ ఎంటర్ప్రెన్యూర్ అనిల్ కామినేనిలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇటీవల వారు విలువిద్య (Archery) క్రీడను ప్రోత్సహించడానికి చేస్తున్న కృషిని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. అంతకుముందు వీరు ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి గారు హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్ (సీపీ) వీసీ సజ్జనార్ ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ గారిని అభినందించడానికి చిరంజీవి గారు ఆయన కార్యాలయానికి స్వయంగా వెళ్లారు. ఈ సందర్భంగా చిరు… సజ్జనార్ గారికి పుష్పగుచ్ఛం అందజేసి, నూతన బాధ్యతల్లో పూర్తి విజయం సాధించాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

బాహుబలి: ది ఎపిక్.. బజ్ పెంచిన సెంథిల్ ట్వీట్
భారతీయ సినీ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిన 'బాహుబలి' ప్రపంచాన్ని మరోసారి తెరపైకి తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నుండి రాబోతున్న ప్రత్యేక ప్రాజెక్ట్ "బాహుబలి: ది ఎపిక్" గురించి తాజాగా కీలక అప్డేట్ విడుదలైంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన కె.కె. సెంథిల్ కుమార్ గారు సోషల్ మీడియా వేదికగా ఈ ప్రాజెక్ట్ ఫైనల్ కలర్ గ్రేడింగ్ పూర్తయినట్టు ప్రకటించారు.

ఓవర్సీస్లో దూసుకుపోతున్న కాంతారా చాప్టర్ 1
ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ “కాంతార: ఎ లెజెండ్ చాప్టర్-1” ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భారతదేశంలో అద్భుతమైన స్పందన అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు విదేశాల్లో కూడా రికార్డులు బద్దలు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం నార్త్ అమెరికాలో $4 మిలియన్ (రూ. 33 కోట్లకు పైగా) గ్రాస్ కలెక్షన్ సాధించి దూసుకుపోతోంది.

సంబరాల ఏటిగట్టు నుంచి ‘అసుర ఆగమన’ గ్లింప్స్ వస్తోంది
మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సంబరాల ఏటిగట్టు' (SYG). దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, చిత్ర యూనిట్ ఒక సాలిడ్ అప్డేట్ను అందించింది.

అఖండ 2 కోసం బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన తమన్
'గాడ్ ఆఫ్ ది మాసెస్' నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను డైనమిక్ అండ్ పవర్ ఫుల్ ఫోర్త్ కొలాబరేషన్ లో మోస్ట్ అవైటెడ్ హై-ఆక్టేన్ సీక్వెల్ 'అఖండ 2: తాండవం' పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది.14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు.

కే-ర్యాంప్ ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, కథానాయిక యుక్తి తరేజా జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'కే-ర్యాంప్' (K-Ramp). ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేయగా, ప్రేక్షకుల్లో ముఖ్యంగా యువతలో భారీ స్పందన లభిస్తోంది. జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో పాటు, యాక్షన్, రొమాన్స్, కామెడీ కలగలిపిన విభిన్నమైన కథాంశంతో రూపొందినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

AA22xA6 మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అట్లీ
'పుష్ప 2'తో ఆల్ టైమ్ హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా అట్లీ ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించనుందని ఆయన ప్రకటించారు.

ఘనంగా ప్రారంభమైన దిల్ రాజు-విజయ్ దేవరకొండ చిత్రం
'కింగ్ డమ్' సినిమా తర్వాత టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా కొత్త చిత్రం షురూ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై 59వ ప్రాజెక్టుగా రూపొందుతోన్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా, మేకర్స్ ఈ చిత్రానికి 'రౌడీ జనార్ధన' అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.

రవితేజ RT76 ఫారిన్ షెడ్యూల్ ప్రారంభం
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో హోల్సమ్ ఎంటర్టైనర్ #RT76 చేస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను బిగ్ కాన్వాస్‌పై స్టైలిష్‌గా రూపొందిస్తున్నారు. టీమ్ ప్రస్తుతం కీలక ఫారిన్ షెడ్యూల్‌కి షిఫ్ట్ అయ్యింది. గత కొన్ని రోజులుగా స్పెయిన్‌లోని వాలెన్షియా, సమీప దీవుల్లో లొకేషన్ రెక్కీ పనులు పూర్తి చేశారు.

మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు. సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ నెలలో ఫైనల్ షెడ్యూల్ జరగనుంది.ఇక దసరా పండుగ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ ప్రోమోకి అద్భుతమైన స్పందన వచ్చింది.

కాంతార చాప్టర్ 1 సక్సెస్.. ముంబై సిద్ధి వినాయక ఆలయంలో రిషబ్ శెట్టి ప్రత్యేక పూజలు
కన్నడ చిత్రసీమ నుండి వచ్చి, తన అద్భుతమైన ప్రతిభతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించిన హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన 'కాంతార చాప్టర్ 1' ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ డేట్ రివీల్
ఉస్తాద్ రామ్ పోతినేని నెక్స్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా తో రానున్నాడు.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.రీసెంట్ గా రెండు పాటలు రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ గా టీజర్ ను వదలనున్నారు.75 సెకండ్ల నిడివితో ఈ నెల 12న ఈ టీజర్ విడుదలకానుంది. టీజర్ వచ్చాక సినిమాపై హైప్ డబుల్ కానుంది.

ఫంకీ టీజర్ రిలీజ్
యంగ్ హీరో విశ్వక్ సేన్ ,జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఫంకీ. సినిమా ఇండస్ట్రీ పై సెటైరికల్ మూవీగా తెరకెక్కుతుంది. ఇక ఈరోజు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ టీజర్ హిలేరియస్ గా ఉంది. అనుదీప్ మార్క్ కామెడీ టీజర్ లో హైలైట్ అయ్యింది.ఇందులోని వన్ లైనర్స్ అనుదీప్ గత చిత్రాలు జాతిరత్నాలు , ప్రిన్స్ సినిమాలను గుర్తు చేశాయి.

డ్యూడ్‌లో హీరో, హీరోయిన్ మధ్య సీన్స్ మామూలుగా ఉండవు - మైత్రి రవిశంకర్
'లవ్ టుడే, డ్రాగన్' సినిమాలతో రెండు వరుస సూపర్ హిట్లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్'తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.

డ్యూడ్‌తో ప్రదీప్ అందరినీ ఎంటర్టైన్ చేస్తాడు - శరత్ కుమార్
'లవ్ టుడే, డ్రాగన్' సినిమాలతో రెండు వరుస సూపర్ హిట్లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్'తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.