ఉస్తాద్ రామ్ పోతినేని నెక్స్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా తో రానున్నాడు.ఈసినిమా కోసం రామ్ అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఓ పాట కూడా తనే రాశాడు. ఆ సాంగ్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది. కేవలం ఆ ఒక్క సాంగ్ తోనే సినిమా కు హైప్ రాగా నిన్న వచ్చిన టీజర్ అయితే సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనే టాక్ తెప్పించింది.టీజర్ ను ఎక్స్ లెంట్ గా కట్ చేయడం తో యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది.కేవలం సింగిల్ లాంగ్వేజ్ లో వచ్చిన టీజర్ 24 గంటల్లో 12 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్ లో రిఫ్రెషింగ్ విజువల్స్ కి తోడు రామ్ – భాగ్య శ్రీ కెమిస్ట్రీ , బీజీఎమ్ ,డైలాగ్స్ హైలైట్ అయ్యాయి. ముఖ్యంగా టీజర్ లో లాస్ట్ డైలాగ్ అదుర్స్ అనిపించింది. ఓవరాల్ గా టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచడం లో మేకర్స్ సూపర్ సక్సెస్ అయ్యారు.ఇక రామ్ ఈసినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈసినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. హీరో ఫ్యాన్ బయోపిక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర ఒక స్టార్ హీరో పాత్రలో నటిస్తుండగా, అతని అభిమానిగా సాగర్ పాత్రలో రామ్ పోతినేని కనిపించనున్నాడు.భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ ద్వయం వివేక్–మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.నవంబర్ 28న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























