కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 5

Kiara Advani’s First Look Poster from Toxic Released
ఫస్ట్ లుక్

టాక్సిక్ నుండి కియారా పోస్టర్ రిలీజ్

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్ నుండి ఒక క్రేజీ అప్‌డేట్ వెలువడింది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె 'నదియా' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Mahender Reddyవాట్సాప్
Shooting Progresses in Delhi for Peddi
షూటింగ్ అప్‌డేట్

ఢిల్లీ లో పెద్ది షూటింగ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెద్ది షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ఆయనపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో రామ్ చరణ్ 'రా' అండ్ 'రస్టిక్' మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Eesha Will Live Up to Everyone’s Expectations Say Bunny Vaas and Vamsi Nandipati
సాంగ్

ఈషా అందరి అంచనాలను అందుకుంటుంది - బన్నీవాస్‌, వంశీ నందిపాటి

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా 'ఈషా' పేరుతో ఓహారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల రాజు వెడ్స్‌ రాంబాయి చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన అఖిల్‌రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ…

Mahender Reddyవాట్సాప్
shambhala trailer released
ట్రైలర్ & టీజర్

శంబలా ట్రైలర్ రిలీజ్

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మాతలుగా వెర్సటైల్ యాక్టర్ ఆది సాయి కుమార్ హీరోగా రానున్న చిత్రం ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అంచనాల్ని మరింతగా పెంచేందుకు శంబాల మిస్టిక్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని చేత ఆదివారం నాడు విడుదల చేయించారు.

Mahender Reddyవాట్సాప్
Shooting Begins for Maa Vande
షూటింగ్ అప్‌డేట్

మా వందే షూటింగ్ షురూ

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా బయోపిక్ రానున్న విషయం తెలిసిందే. మోదీ జన్మదినం సందర్భంగా ఈసినిమాను మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఈరోజు పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలు పెట్టారు.మా వందే అనే టైటిల్ తో ఈ బయోపిక్ తెరకెక్కుతుండగా మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ఇందులో మోదీ పాత్రలో నటిస్తున్నాడు.ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనుంది. క్రాంతి కుమార్ డైరెక్ట్ చేస్తుండగా ఈసినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
సంక్రాంతి సినిమాలు … రోజుకో రిలీజ్
సినిమా వార్తలు

సంక్రాంతి సినిమాలు … రోజుకో రిలీజ్

సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌ కి ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీస్ అన్ని థియేటర్లలకు కదిలే పండుగ ఇది.అందుకే ఈ సీజన్ లో ఎక్కువ సినిమాలు రిలీజవుతుంటాయి. గత సంక్రాతికి సంక్రాంతి వస్తున్నాం వచ్చి కలెక్టన్ల వర్షం కురిపించింది.ఇక ఈ సంక్రాంతికి మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరుకు సిద్ధమైంది. అగ్ర హీరోల నుండి యంగ్ స్టార్ల వరకు ప్రతిరోజూ ఒక పెద్ద సినిమా విడుదలకు ప్లాన్ చేస్తుండటంతో, థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొననుంది. జనవరి 12నుండి 15వరకు రోజుకో సినిమా లెక్కన బరిలోకి దిగనున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Vrusshabha Telugu Trailer Released
ట్రైలర్ & టీజర్

వృషభ తెలుగు ట్రైలర్ రిలీజ్

మలయాళ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన అత్యంత ప్రతిష్టాత్మక పీరియాడిక్ డ్రామా 'వృషభ'. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుండగా,విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.గతాన్ని,వర్తమానాన్ని ముడిపెడుతూ సాగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందిందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.

Mahender Reddyవాట్సాప్
Nari Nari Naduma Murari Teaser Date Locked
ట్రైలర్ & టీజర్

నారీ నారీ నడుమ మురారి టీజర్ డేట్ ఫిక్స్

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం నారీ నారీ నడుమ మురారి.సామజవరగమన వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమాపై అంచనాలు పెంచేలా మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేశారు. అందులో భాగంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈనెల 22న ఈ టీజర్ విడుదలకానుంది.ఈ సందర్బంగా మేకర్స్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi’s Stills from Mana Shankara Vara Prasad Garu Create Massive Buzz
సినిమా వార్తలు

మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి స్టిల్స్

హైలీ యాంటిసిపేటెడ్ సంక్రాంతి ఎంటర్‌టైనర్ మన శంకరవర ప్రసాద్ గారు చిత్రానికి సంబంధించి మేకర్స్ విడుదల రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ స్టిల్స్‌ సోషల్ మీడియాలో, అభిమాన వర్గాల్లోనూ మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్
OTT Release Date Announced for Andhra King Taluka
ఓటీటీ

ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీ రిలీజ్ డేట్ రివీల్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ హార్ట్ టచింగ్ డ్రామా ఆంధ్రా కింగ్ తాలూకా ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది.గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ అనే మౌత్ టాక్ తెచ్చుకున్నా అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది.దాంతో ఈసినిమా యావరేజ్ గా మిగిలిపోయింది.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar Enters the 500 Crore Club
సినిమా వార్తలు

500 కోట్ల క్లబ్ లో ధురంధుర్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ కేవలం 13 రోజుల్లోనే దేశ వ్యాప్తంగా 500 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది.దాంతో ఈఏడాది ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా రికార్డు సృష్టించింది.నిన్న ఒక్క రోజే ఈసినిమా 23.70 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
Sampoornesh Babu as Biryani in The Paradise
సినిమా వార్తలు

ది ప్యారడైజ్ లో బిర్యానీ గా సంపూర్ణేష్ బాబు

దసరా తరువాత నేచురల్ స్టార్ నాని- దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్' నుండి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు కామెడీ పాత్రలతో, పేరడీలతో ప్రేక్షకులను నవ్వించిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, ఈ సినిమాలో తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఒక పవర్‌ఫుల్ మాస్ రోల్‌లో కనిపించబోతున్నారు. దీనికి సంబంధించి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు పోషిస్తున్న పాత్ర పేరు 'బిర్యానీ'.

Mahender Reddyవాట్సాప్
అఖండ 2 కి బ్రహ్మరథం పడుతున్న ఫ్యామిలీ ఆడియన్స్
సినిమా వార్తలు

అఖండ 2 కి బ్రహ్మరథం పడుతున్న ఫ్యామిలీ ఆడియన్స్

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ 2: తాండవం కేవలం మాస్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా , కుటుంబ ప్రేక్షకులను కూడా బలంగా ఆకర్షిస్తోంది.బోయపాటి శ్రీను సినిమాలలో మాస్ ఎలివేషన్స్‌తో పాటు, బలమైన కుటుంబ బంధాలు, విలువలు, మరియు ఎమోషన్స్‌ తప్పక ఉంటాయి. అఖండ 2 లో కూడా ఈ అంశాలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. రిపీట్ లో ఈసినిమాను చూస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Dhurandhar 11 days collections
బాక్సాఫీస్

400 కోట్ల క్లబ్ లో దురంధుర్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నటించిన దురంధర్ దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మౌత్ టాక్ కారణంగా రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది.వారాంతాల్లోనే కాకుండా వర్కింగ్ డేస్ లోకూడా ఊహించని వసూళ్లను రాబట్టుకుంటూ హవా కొనసాగిస్తోంది. నిన్న ఈసినిమా దేశవ్యాప్తంగా నికర వసూళ్లు రూ 31.80 కోట్లు సాధించింది.మొదటి రోజు కంటే 11 వరోజు ఎక్కువ రాబట్టడం విశేషం.అంతేకాదు సెకండ్ మండే హైయెస్ట్ గ్రాసర్ గా ఆల్ టైం రికార్డు సృష్టించింది. దాంతో 11 రోజుల్లో సినిమా 396 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఈరోజుతో 400కోట్ల క్లబ్ లో చేరనుంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 550 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది…

Mahender Reddyవాట్సాప్
Annagaru Vostaru Set for Christmas Release
సినిమా వార్తలు

క్రిస్మస్ బరిలో అన్నగారు వస్తారు

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన అన్నగారు వస్తారుసినిమా విడుదల విషయంలో ఎదురైన అడ్డంకులు తొలగిపోయాట. దాంతో ఈ చిత్రం కొత్త విడుదల తేదీని ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను డిసెంబర్ 25 న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.నిజానికి ఈ సినిమా డిసెంబర్ 5నే విడుదల కావాల్సి ఉన్నా అనివార్యకారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. ఆ తర్వాత డిసెంబర్ 12కు ప్లాన్ చేసినా విడుదల కుదరలేదు.

Mahender Reddyవాట్సాప్
Sujeeth Receives an Expensive Gift from Pawan Kalyan
సినిమా వార్తలు

సుజీత్ కి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ దర్శకుడు సుజీత్ కి విలువైన కారును బహుమతిగా ఇచ్చి సప్రయిజ్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో రీసెంట్ గా వచ్చిన ఓజీ 300కోట్ల పైన్ వసూళ్లను రాబట్టుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. స్వయంగా సుజీత్, పవన్ కి వీరాభిమాని కావడంతో సినిమా అనౌన్స్ మెంట్ దగ్గరినుండే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆతరువాత సినిమా సాంగ్స్ ,ప్రమోషనల్ కంటెంట్ తో నెక్స్ట్ లెవెల్ హైప్ సొంతం చేసుకుంది. ఇక రిలీజ్ తరువాత అంచనాలను అందుకొని బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపి పవన్ కు కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

Mahender Reddyవాట్సాప్
sree vishnus next titled as vishnu vinyasam
సినిమా వార్తలు

శ్రీ విష్ణు కొత్త సినిమా టైటిల్ రివీల్

ఈ ఏడాది సమ్మర్ లో సింగిల్ తో వచ్చి ఎంటర్‌టైన్‌ చేసిన ప్రామిసింగ్ హీరో శ్రీ విష్ణు నెక్స్ట్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈహీరో , కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో యూనిక్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా సుమంత్ నాయుడు జి నిర్మిస్తారు. హేమ & షాలిని ఈ చిత్రాన్ని సమర్పిస్తారు, సాయి కృష్ణ బొబ్బా, రామాచారి ఎం సహ నిర్మాతలు. ఈ రోజు సినిమా టీం ఒక యానిమేషన్ వీడియో ద్వారా సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Funky to Release Ahead of Schedule
షూటింగ్ అప్‌డేట్

కొంచెం ముందుగానే రిలీజ్ కానున్న ఫంకీ

యంగ్ హీరో విశ్వక్ సేన్ - డైరెక్టర్ అనుదీప్ కెవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫంకీ.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి. రీసెంట్ గా టీజర్ కూడా రిలీజ్ చేశారు. అనుదీప్ మార్క్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాలో విశ్వక్ సేన్ డైరెక్టర్ గా నటించగా హీరోయిన్ కయదు లోహర్ నిర్మాత రోల్ లో కనిపించనుంది.

Mahender Reddyవాట్సాప్
Akhanda 2 Thaandavam Telugu Movie Review
రివ్యూ

రివ్యూ: అఖండ 2: తాండవం

మొత్తానికి అఖండ సనాతన ధర్మం, పౌరాణిక నేపథ్యాన్ని కలిగి ఉండి, మాస్, యాక్షన్, డివైన్ ఎలిమెంట్స్‌తో గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందిస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్‌గా, ఈ చిత్రం హార్డ్‌కోర్ బాలకృష్ణ అభిమానులకు "పైసా వసూల్ మాస్ ఎంటర్‌టైనర్" అని, యాక్షన్ డోస్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. బాలకృష్ణ ఫాన్స్‌కి, యాక్షన్ సన్నివేశాలను ఇష్టపడే వారికి మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు 'అఖండ-2' నచ్చుతుంది. ఇక సెకండ్ హాఫ్ నార్త్ ఇండియా జనాలకు కనెక్ట్ అయితే మాత్రం… 'అఖండ'ని మించి ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకోవడం పక్కా.

Srikanth Mవాట్సాప్
Ustaad Bhagat Singh First Song Promo Drops Tomorrow
సాంగ్

ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సాంగ్ ప్రోమో రేపే

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'.సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఇక ఈసినిమానుండి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని మొదటి పాట ప్రోమో డిసెంబర్ 9న సాయంత్రం 6:30 గంటలకు విడుదల కానుంది.ప్రోమో లో ఫుల్ సాంగ్ రిలీజ్ డేట్ చెప్పనున్నారురాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్

షేర్