
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 3

పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ - అల్లు అర్జున్
ఆరోజు చాలా నెర్వస్ అయ్యాను, కానీ..

అది చూసి ఆడియన్స్ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. టీజర్ రిలీజ్

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో టీజర్ రానుంది

సరిపోదా శనివారం బుకింగ్స్ ఓపెన్

ఫ్యామిలీతో కలిసి కాలినడకన తిరుమలకు నాని

ఆయ్ వల్ల నాకు ఎక్కువ ఎక్స్‌పోజర్ వచ్చింది

షూటింగ్ లో రవితేజకు గాయం

తంగలాన్.. సెకండ్ వీక్‌లో పెరిగిన స్క్రీనింగ్స్

మట్కా షూటింగ్ అప్డేట్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో, స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఈ మేరకు ఆయన తన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వరదల సమయంలో సహాయ చర్యలకు మద్దతుగా తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్ కి విరాళంగా ప్రకటించిన రూ.15 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.
పవన్ కళ్యాణ్ బాబాయికి థాంక్స్ - అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'పుష్ప 2 : ది రూల్'. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పై భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదల కావడం జరిగింది.
ఆరోజు చాలా నెర్వస్ అయ్యాను, కానీ..
పుష్ప-2 ది రూల్ ఇప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రమిది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూడబోతున్నారు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, ఆయన క్లాస్ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలవబోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా 12 వేలకు పైగా స్క్రీన్స్‌ల్లో విడుదల కాబోతోంది.

ఆల్ టైం టాప్ 2లో నానా హైరానా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుండి రెండు రోజుల క్రితం వచ్చిన మూడో పాట నానా హైరానా మ్యూజిక్ యాప్స్ ను ఓ ఊపు ఊపేస్తుంది.ఇక ఈసాంగ్ అటు యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ లో వ్యూస్ ను రాబట్టుకుంటుంది.తెలుగు తోపాటు తమిళ ,హిందీ భాషల్లో ఈసాంగ్ రిలీజ్ అవ్వగా తెలుగులో ఇప్పటివరకు 28మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.24గంటల్లో అయితే 23.44 మిలియన్ల వ్యూస్ తో టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ పొందిన లిరికల్ వీడియో గా సెకండ్ ప్లేస్ ను దక్కించుకుంది.27.19మిలియన్ల వ్యూస్ తో సౌత్ లోనే టాప్ లో కొనసాగుతుంది అల్లు అర్జున్ పుష్ప 2 కిస్సిక్ సాంగ్.ఈ లిస్ట్ లో నాలుగో స్థానం లో వుంది నానా హైరైనా.

అది చూసి ఆడియన్స్ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి గుణ 369తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించడం గమనార్హం.

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.. టీజర్ రిలీజ్
'కార్తికేయ 2' చిత్రంతో నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోన్న ఈ మూవీకి వైవిధ్యమైన సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.

సుందరకాండ నుంచి హమ్మయ్య సాంగ్ రిలీజ్
హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ 'సుందరకాండ'తో అలరించడానికి రెడీ అవుతున్నారు. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది.

విశ్వం నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ రిలీజ్
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'విశ్వం' దసరా కానుకగా అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినియా టీజర్, ట్రైలర్. సాంగ్స్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని మరింతగా పెంచాయి.

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో టీజర్ రానుంది
యంగ్ హీరో నిఖిల్ ,డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.ఎప్పుడో ఈసినిమా షూటింగ్ పూర్తి కాగా ఇప్పుడు రీలీజ్ కు రెడీ అవుతుంది.ఇక ఈసినిమా టీజర్ రానుంది.రేపు సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ కానుంది.లవ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో కాంతారా ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది.తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా.మరో బ్యూటీ దివ్యాంశ కౌశిక్ ఇందులో కీలక పాత్రలో నటించగా హర్ష చెముడు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

మత్తు వదలరా 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
మత్తు వదలరాకు సీక్వెల్ గా వచ్చిన మత్తు వదలరా 2 రీసెంట్ గా థియేటర్లోకి వచ్చి సూపర్ హిట్ అనిపించుకుంది.దాదాపు 30కోట్లకు పైగా వసూళ్లను సాధించి బయ్యర్స్ మంచి లాభాలను తీసుకొచ్చింది. ఇక ఈసినిమా ఓటిటిలోకి రానుంది.ఈరోజు రాత్రి 12గంటలనుండి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ ,తమిళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ నెట్ ఫ్లిక్స్ తన అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో ఈ శుక్రవారం రానుందని తెలియజేసింది.

ప్రభాస్‌పై అర్షద్ వార్సి కామెంట్స్‌పై నాగ్ అశ్విన్ రియాక్షన్ ఇదే
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి చేసిన వివాదాస్పద కామెంట్స్‌పై కల్కి 2898 AD డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. ప్రభాస్ హీరోగా, ఆయన దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఈ చిత్రం ఓటీటీ లోకి కూడా వచ్చేసింది.

సరిపోదా శనివారం బుకింగ్స్ ఓపెన్
బ్యాక్ టు బ్యాక్ హిట్ల తరువాత హ్యాట్రిక్ కొట్టడానికి సరిపోదా శనివారంతో వస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని.మరో 5రోజుల్లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం నాని అన్నీ తానై సినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నాడు.ఇక ఈసినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.దాదాపు అన్ని ఏరియాల్లో బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి.అటు నార్త్ అమెరికా లో అడ్వాన్స్ సేల్స్ 150k దాటాయి.

కమిటీ కుర్రోళ్ళు.. మూడో వారంలో మరింత పెరిగిన కలెక్షన్స్
డిఫరెంట్ కంటెంట్ చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందని తెలుగు ప్రేక్షకులు మరోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆడియెన్స్, విమర్శకులతో పాటు సినీ సెలబ్రిటీ నుంచి అభినందనలు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. ఇప్పటికే సినిమా అన్నీ ఏరియాస్‌లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం రూ.15.6 కోట్ల కలెక్షన్స్‌ను సాధించటం విశేషం.

ఫ్యామిలీతో కలిసి కాలినడకన తిరుమలకు నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'సరిపోదా శనివారం' సినిమా ఈనెల 29న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన శ్రీవారి ఆశీస్సులు కోరుతూ తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ మేరకు హీరో నాని కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఆయన వెంట సతీమణి అంజన, తనయుడు అర్జున్ మరియు సరిపోదా శనివారం సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక అరుళ్ మోహన్ ఉన్నారు.

ఆయ్ వల్ల నాకు ఎక్కువ ఎక్స్‌పోజర్ వచ్చింది
సంగీత దర్శకుడిగా అన్ని జోనర్ సినిమాలు చేయాలని వుంది. చిన్నప్పటి నుంచి కమర్షియల్ సినిమాలు చూస్తూ పెరిగాను. కమర్షియల్ సినిమాలకు సంగీతం అందించాలనేది నా కోరిక. సంగీతాన్ని ట్రెండీగా.. కమర్షియల్‌గా చేయడానికి ప్రయత్నిస్తాను. ఇటీవల విడుదలైన 'ఆయ్' సినిమా నాకు సంగీత దర్శకుడిగా మంచి పేరును తీసుకొచ్చింది' అన్నారు సంగీత దర్శకుడు అజయ్ అరసాడ. నార్నె నితిన్, నయన్ సారిక జంటగా నటించగా అంజి కే. మణిపుత్ర దర్శకత్వంలో ఆయ్ తెరకెక్కింది.

శివకార్తికేయన్ అమరన్.. తెలుగు రైట్స్ ప్రముఖ సంస్థ చేతికి
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. కాగా ఈ చిత్రం నిజ జీవితం ఆధారంగా తెరక్కుతుండటం విశేషం. శివ అరూర్ మరియు రాహుల్ సింగ్ రాసిన 'ఇండియాస్ మోస్ట్' అనే పుస్తకంలోని 'మేజర్ వరదరాజన్' చాప్టర్ ను బేస్ చేసుకుని రూపొందించబడుతోంది.

షూటింగ్ లో రవితేజకు గాయం
మాస్ మహారాజా రవితేజకు ఆర్ టి 75 షూటింగ్ లో గాయమైంది.తన కుడి చేతికి ఇంతకుముందే గాయం ఉండగా అలానే షూటింగ్ లో పాల్గొనడంతో ఆ గాయం కాస్త తీవ్రమైంది.దాంతో నిన్న యశోద హాస్పిటల్ లో గాయానికి విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది.సర్జరీ పూర్తి కావడంతో 6 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.దాంతో రవితేజ మరో 42రోజుల వరకు షూటింగ్ కి బ్రేక్ ఇవ్వనున్నాడు.

తంగలాన్.. సెకండ్ వీక్‌లో పెరిగిన స్క్రీనింగ్స్
ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన పెద్ద సినిమాలలో 'తంగలాన్' ఒకటి. భారీ నిర్మాణ విలువలు, చియాన్ విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. దర్శకుడు పా రంజిత్ మరోసారి తన వెండితెర మాయాజాలం చేశాడు. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అన్ని సెంటర్స్ నుంచి సక్సెస్‌ఫుల్ టాక్‌తో పాటు మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

మట్కా షూటింగ్ అప్డేట్
మెగా హీరో వరుణ్ తేజ్,పలాస ఫేమ్ కరుణ కుమార్ కాంబోలో వస్తున్న చిత్రం మట్కా.1980 బ్యాక్ డ్రాప్ తో వస్తుంది.ఇందులో వరుణ్ డాన్ పాత్రలో కనిపించనున్నాడు.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కాకినాడ లో జరుగుతుంది.ఈసందర్భంగా మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈషెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.వరుణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.

కన్నప్ప.. కృష్ణాష్టమి సందర్భంగా అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక అప్డేట్ ఇస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు. సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేస్తున్నారు.