యంగ్ హీరో నిఖిల్ ,డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.ఎప్పుడో ఈసినిమా షూటింగ్ పూర్తి కాగా ఇప్పుడు రీలీజ్ కు రెడీ అవుతుంది.ఇక ఈసినిమా టీజర్ రానుంది.రేపు సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ కానుంది.లవ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో కాంతారా ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది.తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా.మరో బ్యూటీ దివ్యాంశ కౌశిక్ ఇందులో కీలక పాత్రలో నటించగా హర్ష చెముడు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ సింగర్ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతాన్ని సన్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు.ఎస్విసిసి బ్యానర్ పై సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా ఈదీపావళికి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఇక నిఖిల్ ప్రస్తుతం మరో రెండు సినిమాలతో బిజీ గా వున్నాడు. అందులో స్వయంభు ఒకటి.భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ఇందులో సంయుక్త మీనన్ ,నాబా నటేష్ కథానాయికలు నటిస్తుండగా కొత్త దర్శకుడు భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్నాడు.ఈసినిమాతో పాటు ప్రస్తుతం నిఖిల్ ది ఇండియన్ హౌస్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.రామ్ వంశీ కృష్ణ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈరెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదలకానున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























