హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’తో అలరించడానికి రెడీ అవుతున్నారు. డెబ్యుటెంట్ వెంకటేష్ నిమ్మలపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటివలే రిలీజైన టీజర్‌కు కూడా హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్‌గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ సింగిల్ బహుశ బహుశ సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ రోజు మేకర్స్ సెకండ్ సింగిల్ హమ్మయ్య సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని ఫుట్ ట్యాపింగ్ మెలోడీ గా కంపోజ్ చేశారు.
లియోన్ జేమ్స్. రామ్ మిర్యాల, లియోన్ తమ ఎనర్జీటిక్ వొకల్స్ తో మెస్మరైజ్ చేశారు. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శ్రీ హర్ష ఈమాని లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ లో నారా రోహిత్ డ్యాన్స్ మూమెంట్స్ అలరించాయి. ఓవరాల్‌గా, హమ్మయ్య సాంగ్ ఇన్స్టంట్ హిట్ అయ్యింది.
ఇక ఈ చిత్రంలో నారా రోహిత్ తో పాటుగా వృత్తి వాఘని, శ్రీ దేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్, కమెడియన్ సత్య, అజయ్, VTV గణేష్, అభినవ్ గోమతం, విశ్వంత్, రూపా లక్ష్మి, సునైనా, రఘు బాబు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ ఎం వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, రాజేష్ పెంటకోట ఆర్ట్ డైరెక్టర్. సందీప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























