‘కార్తికేయ 2’ చిత్రంతో నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోన్న ఈ మూవీకి వైవిధ్యమైన సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన స్వామి రారా, కేశవ చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’తో హ్యాట్రిక్ హిట్ కొట్టటానికి సంసిద్ధమయ్యారు. అలాగే రెండు సూపర్ హిట్స్ తర్వాత ఈ హిట్ కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి.
కాగా కన్నడ సినీ ఇండస్ట్రీలో మంచి పాపులర్ హీరోయిన్‌గా అందరినీ అలరిస్తోన్న రుక్మిణి వసంత్ ఈ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. అలాగే మరో బ్యూటీ డాల్ దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ప్రముఖ కమెడియన్ హర్ష చెముడు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.
ఇదిలావుంటే, కొన్నిరోజులక్రితం ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా అది మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంది. అందులో నిఖిల్ స్టైలిష్ లుక్‌తో, రుక్మిణి వసంత్ గ్లామర్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక ప్రస్తుతం ఈ టీజర్ ట్రెండింగ్‌లో ఉంది.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి తమ 32వ చిత్రంగా రూపొందిస్తోంది. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నారు. యోగేష్ సుధాకర్, సునీల్ షా, రాజా సుబ్రమణ్యం ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్స్ కాగా.. బాపినీడు. బి ఈ చిత్రానికి సమర్పిస్తున్నారు.
అలాగే ఈ చిత్రానికి సింగర్ కార్తీక్ సంగీతాన్ని సమకూరుస్తుండగా.. సన్నీ ఎం.ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందిస్తున్నారు. ఇంకా స్టార్ టెక్నిషియన్స్ రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























