
ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 20

యూరోప్ థియేటర్ లో సాహో ప్రదర్శన
హీరో నాని బాలీవుడ్ రీమేక్ మూవీ ?
చాణక్య మూవీ సెప్టెంబర్ లో రిలీజ్

క్లాసికల్ డాన్సర్ గా సాయిపల్లవి..!

వారం గ్యాప్‌లో వస్తున్న `జెర్సీ` స్టార్స్

సెంటిమెంట్ డేట్‌ని టార్గెట్ చేసుకున్న బాలయ్య?
మరోసారి సెంటిమెంట్‌ను ఫాలో అయిన త్రివిక్రమ్

‘ప్రస్థానం’ దర్శకుడితో సాయితేజ్?
‘ఓ బేబి’ క్లోజింగ్ కలెక్షన్స్
డబ్బింగ్ షురూ చేసిన చాణక్య

ఈ వారం 'రణరంగం' లో గెలుపు 'ఎవరు' ది?
హీరో మూవీతో కోలీవుడ్ ఎంట్రీ

'పాగల్' గా వస్తున్న విశ్వక్ సేన్

శ్రద్ధా కపూర్ హ్యాపీ ఫీలింగ్

700 రోజుల్లో 70 రోజులు షూట్ చేశాం

సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు

కాలేజ్ ప్రొఫెసర్‌గా లేడీ సూపర్‌స్టార్?

అందాదూన్ రీమేక్ లో?
ఆయుష్మాన్ ఖురానా,టబు, రాధికా ఆప్టే నటించిన 'అందాదూన్' సినిమా మంచి ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాను రీసెంట్ గా ఆయుష్మాన్ ఖురానాకు నేషనల్ అవార్డ్ దక్కింది. మరి ఒక భాషలో హిట్ అయిన సినిమాలు వేరే భాషల్లో కి రీమేక్ చేయడం కామన్ థింగ్ కాబట్టి ఇక ఈ సినిమా ను కూడా తమిళ్ లో రీమేక్ చేయనున్నట్టు తెలుస్తుంది.
యూరోప్ థియేటర్ లో సాహో ప్రదర్శన
ఇప్పటికే సాహో పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. టీజర్, ట్రైలర్ తో సోషల్ మీడియాలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఎప్పుడు తాజాగా మరో రికార్డు ను సొంతం చేసుకుంది. యూరోప్ లోని ప్రఖ్యాత థియేటర్ గ్రాండ్ రెక్స్‌లో ప్రదర్శించనున్నారు. ఈ థియేటర్‌లో ఒకేసారి 2800 మంది ప్రేక్షకులు సినిమా చూసే వీలుంది. ఇప్పటికే సౌత్ నుంచి కబాలి, బాహుబలి, మెర్సల్, విశ్వరూపం 2 లాంటి సినిమాలను ఈ థియేటర్లో ప్రదర్శించారు. తాజా సాహోకు ఈ ఘనత దక్కింది. ఇప్పటికే గ్రాండ్ రెక్స్ థియేటర్ వద్ద సాహో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ స్టార్ట్ చేశారు.
హీరో నాని బాలీవుడ్ రీమేక్ మూవీ ?
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా, టబు,రాధిక ఆప్టే ప్రధాన పాత్రలలో హిందీ లో రూపొందిన బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీ అంధాధున్ 2018 సంవత్సరం అక్టోబర్ లో రిలీజయి ఘనవిజయం సాధించింది. 32 కోట్ల తో నిర్మించిన అంధాధున్ మూవీ 441 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ లో పెర్ఫార్మెన్స్ కు ఆయుష్మాన్ ఖురానా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకొన్నారు. అంధాధున్ మూవీ ని తెలుగు, తమిళ భాషలలో రీమేక్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
చాణక్య మూవీ సెప్టెంబర్ లో రిలీజ్
సుంకర రామబ్రహ్మం నిర్మాతగా తిరు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా చాణక్య మూవీ సెప్టెంబర్ నెలలో రిలీజ్ కానుంది. మెహరీన్, జరీన్ ఖాన్ కథానాయికలు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న చాణక్య మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

క్లాసికల్ డాన్సర్ గా సాయిపల్లవి..!
శేఖర్ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో ఓ కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య - సాయిపల్లవి కాంబినేషన్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను పట్టాలెక్కించే పనిలో వున్నాడు.

వారం గ్యాప్‌లో వస్తున్న `జెర్సీ` స్టార్స్
ఈ వేసవికి విడుదలై విజయం సాధించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా`జెర్సీ’లో జంటగా నటించి అలరించారు నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. కట్ చేస్తే... ఈ ఇద్దరూ ఇప్పుడు వారం రోజుల గ్యాప్‌లో తమ కొత్త చిత్రాలతో సందడి చేయనున్నారు. అంతేకాదు... ఆయా సినిమాలు పాత చిత్రాల టైటిల్స్‌తో తెరకెక్కినవే కావడం విశేషం.

సెంటిమెంట్ డేట్‌ని టార్గెట్ చేసుకున్న బాలయ్య?
`యన్టీఆర్` బయోపిక్ తరువాత స్వల్ప విరామం తీసుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ... ప్రస్తుతం `జై సింహా` దర్శకుడు కె.యస్.రవికుమార్ కాంబినేషన్‌లో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. కాగా... ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే తేదికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఓ ప్రత్యేక కారణం ఉందట.
మరోసారి సెంటిమెంట్‌ను ఫాలో అయిన త్రివిక్రమ్
కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలను రూపొందించడంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీరే వేరు. అలాగే... తన చిత్రాలకి టైటిల్స్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసుకుంటారాయన. ఈ నేపథ్యంలోనే... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో రూపొందిస్తున్న కొత్త చిత్రానికి కూడా ‘అల వైకుంఠపురములో’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసాడు త్రివిక్రమ్. అంతేకాదు... టైటిల్ విషయంలో తనకున్న `అ` సెంటిమెంట్‌ని రిపీట్ చేశాడు.

`సరిలేరు నీకెవ్వరు`... ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

‘ప్రస్థానం’ దర్శకుడితో సాయితేజ్?
‘చిత్రలహరి’తో మెమరబుల్ హిట్ అందుకున్న మెగా హీరో సాయి తేజ్... ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ప్రతీ రోజు పండగే’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా... ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందనుందని సమాచారం. కాగా... ఈ సినిమా పూర్తయ్యేలోపు మేర్లపాక గాంధీ, డెబ్యూ డైరెక్టర్ సుబ్బుతోనూ సాయితేజ్ కొత్త ప్రాజెక్ట్స్ పట్టాలెక్కనున్నాయని సమాచారం. అంతేకాదు... మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌లోనూ నటించేందుకు తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
‘ఓ బేబి’ క్లోజింగ్ కలెక్షన్స్
నందినిరెడ్డి దర్శకత్వంలో.. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక పక్క కామెడీ చేస్తూనే.. మరో పక్క ఎమోషన్ తో కట్టిపడేసి.. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సమంత నటనను ప్రశంసిస్తున్నారు. వసూళ్ల పరంగా కూడా ఈ చిత్రం మంచి రికార్డులను క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
డబ్బింగ్ షురూ చేసిన చాణక్య
తమిళ డైరెక్టర్ తిరు సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో 'చాణక్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్, హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజాగా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకుంది. అంతే కాదు డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా పాటలను చిత్రీకరించాల్సి ఉంది.

ఈ వారం 'రణరంగం' లో గెలుపు 'ఎవరు' ది?
నిజానికి రేపు సాహో రిలీజ్ అవ్వాలి. కానీ ఇంకా కొన్ని కార్యక్రమాలు పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ కాస్త ఆగష్ట్ 30 కు వెళ్ళింది. ఇక ఒక్క సాహో రిలీజ్ డేట్ పై చాలా సినిమాలా రిలీజ్ డేట్లు ఆధారపడటంతో... సాహో దెబ్బకి మళ్ళీ రిలీజ్ డేట్లు మార్చుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రణరంగం, ఎవరు సినిమాలు ఆగష్ట్ 15కు వచ్చాయి. వాల్మీకి, గ్యాంగ్ లీడర్ సినిమాలు సినిమాలు సెప్టెంబర్ కు వెళ్లిపోయాయి. ఇక రేపు ఇండిపెండెన్స్ కి రణరంగం, ఎవరు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
హీరో మూవీతో కోలీవుడ్ ఎంట్రీ
సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన్, యాక్ట్రెస్ లిజీ తనయ కల్యాణి ప్రియదర్శన్ 2013 సంవత్సరం లో క్రిష్ 3 మూవీ కి అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్ గా సినీకెరీర్ ప్రారంభించారు. 2016 సంవత్సరంలో ఇరు ముగన్ తమిళ మూవీ కి అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. 2017 సంవత్సరంలో హలో మూవీ తో టాలీవుడ్ కు నటిగా పరిచయమయ్యారు. చిత్రలహరి మూవీ తో విజయం సాధించారు. ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కానున్న రణరంగం మూవీ లో హీరోయిన్ గా నటించారు. KJR ప్రొడక్షన్స్ బ్యానర్ పై PS మిత్రన్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరో గా నటిస్తున్న హీరో తమిళ మూవీ తో కళ్యాణి కోలీవుడ్ కు ఎంటరవుతున్నారు. కొన్ని నెలల క్రితం షూటింగ్ ప్రారంభమైన హీరో మూవీ కై…

'పాగల్' గా వస్తున్న విశ్వక్ సేన్
ఫలక్‌నమా దాస్‌తో సక్సెస్‌ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తున్నాడు. నరేష్ రెడ్డి కుప్పిలి అనే కొత్త దర్శకుడితో విశ్వక్ సేన్ హీరో గా 'పాగల్' అనే సినిమా తెరకెక్కబోతుంది. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని సమాచారం.

నాని గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గ్యాంగ్ లీడర్ మూవీ సెప్టెంబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కార్తికేయ నెగటివ్ రోల్ లో నటించడం విశేషం. లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రఘు బాబు ముఖ్య పాత్రలలో నటించారు. PC శ్రీరామ్ ఛాయాగ్రహణం, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఫస్ట్ లుక్, టీజర్ తో ఆకట్టుకున్న గ్యాంగ్ లీడర్ మూవీ పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ జంటగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ…

శ్రద్ధా కపూర్ హ్యాపీ ఫీలింగ్
తీన్ పత్తి మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్రద్ధా కపూర్ నటించిన ఆషికి 2, ఏక్ విలన్, ABCD2, బాఘి, స్త్రీ, బట్టే గుల్ మీటర్ చాలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న శ్రద్ధా కపూర్ 2019 సంవత్సరంలో మూడు సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన సాహో, నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన చిచ్చోరే, రెమో D సౌజా దర్శకత్వంలో స్ట్రీట్ డాన్సర్. ఈ మూడు సినిమా లలో సాహో , చిచ్చోరే మూవీస్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. స్ట్రీట్ డాన్సర్ మూవీ 2020 జనవరి లో రిలీజ్ కానుంది.

700 రోజుల్లో 70 రోజులు షూట్ చేశాం
శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. కాజల్ అగర్వాల్, కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా రేపు విడుదల కానున్న సందర్భంగా సుధీర్ వర్మ ప్రెస్ మీట్లో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నాడు.

సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు
సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 'సాహో'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రోజుకో అప్డేట్ ఇస్తూ సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గాట్రైలర్ ను రిలీజ్ చేయగా.. అది సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. బాహుబలి రికార్డ్స్ సైతం చెరిపేసి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

కాలేజ్ ప్రొఫెసర్‌గా లేడీ సూపర్‌స్టార్?
సూపర్‌స్టార్ మహేష్ బాబు అప్‌కమింగ్ ఫిల్మ్ `సరిలేరు నీకెవ్వరు`తో అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాములమ్మ పోషించే పాత్రపై ఆ మధ్య రకరకాల కథనాలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం... ఇందులో విజయశాంతి కాలేజ్ ప్రొఫెసర్‌గా కనిపించబోతున్నారని తెలిసింది. అంతేకాదు... ప్రస్తుతం హైదరాబాద్‌లోని నల్సార్ లా కాలేజ్‌లో జరుగుతున్న చిత్రీకరణలో ఆమె పాల్గొంటున్నారని సమాచారం.