యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి చాలా రోజుల తరువాత ఓ అప్డేట్ తో వచ్చాడు అయితే ఇదేదో సినిమా అప్డేట్ కాదు తన హెల్త్ అప్డేట్.దురదృష్టవ శాత్తు నా కుడి చేతికి తీవ్రమైన ఫ్రాక్చర్స్ అయ్యాయి అలాగే కాలికి కూడా గాయం అయ్యింది.డాక్టర్ల సలహాలతో తొందరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. దానికి కొన్ని నెలల సమయం పడుతుంది.త్వరలోనే మళ్ళీ స్క్రీన్ మీద కనిపించి మిమ్మల్ని అలరిస్తానని నవీన్ నోట్ ద్వారా తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ,జాతి రత్నాలు తో వరస హిట్లు కొట్టిన నవీన్ పొలిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తో హ్యాట్రిక్ పూర్తి చేశాడు.గత ఏడాది రిలీజైన ఈసినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ప్రస్తుతం ఈ హీరో చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్ లు వున్నాయి.అందులో భాగంగా సితార ఎంటర్టైన్మెంట్స్,మైత్రి మూవీ మేకర్స్ ,నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లలో సినిమాలకు కమిట్ అయ్యాడు.
ఇక మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫిలింఫేర్ అవార్డుల నామినేషన్ లలో మెరిసింది.బెస్ట్ హీరో ,బెస్ట్ హీరోయిన్ అలాగే బెస్ట్ మూవీ కేటగిరీలలో పోటీ పడుతుంది.మరి ఇందులో ఎన్ని అవార్డులను గెలుచుకుంటుందో చూడాలి.మహేష్ బాబు పి ఈసినిమాను డైరెక్ట్ చేయగా అనుష్క హీరోయిన్ గా నటించింది.యూవీ క్రియేషన్స్ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























