పూరీ జగన్నాథ్-రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆగష్ట్ 15 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా మాస్ ఎలిమెంట్స్ తో టీజర్ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. స్టెప్పామార్ అంటూ వచ్చిన ఈ మాస్ సాంగ్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు సెకండ్ సాంగ్ తో వచ్చేశారు. మార్ ముంతా చోడ్ చింతా అనే సెకండ్ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను ఇప్పటికే రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈపాట కూడా మంచి మాసీగా ఉంది. దానికితోడు రామ్ అదిపోయే స్టెప్పులు మరో ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తున్నాయి. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈపాటను రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, కీర్తన శర్మ ఆలపించారు.
కాగా ఈసినిమాలో కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో అలీ, షయాజీ షిండే, గెటప్ శ్రీను, ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కే నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























