
ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 86


శివం భజే ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

పుష్ప2 ఆగష్ట్ నుండి మళ్లీ మొదలు

గేమ్ ఛేంజర్.. రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దిల్ రాజు

మిస్టర్ బచ్చన్.. రిలీజ్ డేట్ వచ్చేసింది


దేవర.. డబ్బింగ్ పూర్తి చేసిన నటుడు

సరిపోదా శనివారం-సూర్య పవర్ ఫుల్ బర్త్ డే గ్లింప్స్

విక్రమార్కుడు రీ-రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

విశ్వంభర-స్పెషల్ డే కు టీజర్

విశ్వంభర టాకీ పార్ట్ కంప్లీట్

సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 పోస్టర్ లాంచ్
టీసీఏ ఆధ్వర్యంలో సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 1 ఫిబ్రవరిలో నిర్వహించారు. అది పెద్ద సక్సెస్ అవడంతో ఇప్పుడు సీజన్ 2 ని నవంబర్ లో నిర్వహిస్తున్నారు. ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ ఈ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 కి సంబంధించిన సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పోస్టర్ లంచ్ కార్యక్రమంలో టీసీఏ ఫౌండర్ సాయికృష్ణ, తెలుగు సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్, అశ్విన్ బాబు, సుశాంత్, ఆది సాయికుమార్, సామ్రాట్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆర్టిస్ట్ భూపాల్ మరియు ఓంకార్ గారు పాల్గొని ప్రసంగించారు.

శివం భజే ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్
అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా వస్తున్న సినిమా శివం భజే. న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ఆగష్ట్ 1 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ కు మరికొద్దిరోజులు మాత్రమే ఉండటంతో చిత్రయూనిట్ ఇప్పటినుండే వరుసగా అప్ డేట్లు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే పలు పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. అంతేకాదు ఫస్ట్ సింగిల్ రం రం ఈశ్వరం అనే పాటను రిలీజ్ చేయగా పవర్ ఫుల్ గా ఉన్ ఆ సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. ఈనేపథ్యంలోనే…

రాజమౌళిపై స్పెషల్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
తెలుగు ప్రేక్షకులందరూ ముద్దుగా 'జక్కన్న' అని పిలుచుకునే టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి అంటే ఇండియాలో తెలియనివారుండరు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం తరువాత అయితే ఆయన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై సత్తా చాటడంతో రాజమౌళి పేరు అనేక దేశాల్లో మారుమ్రోగిపోయింది. వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ చాలామంది ఆయనకు అభిమానులయ్యారు.

పేక మేడలు ప్రమోషన్స్ కోసం ప్రభాస్, బన్నీని కలవబోతున్నాం-నిర్మాత రాకేష్ వర్రే
క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని గారు రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

పుష్ప2 ఆగష్ట్ నుండి మళ్లీ మొదలు
సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప2 సినిమా కూాడా ఒకటి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో బన్నీ మాస్ లుక్, తన నటన తో పాట కథ, పాటలు అన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. ఇక ఈసినిమా ఇక్కడ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనాలు సృష్టించడంతో నార్త్ లో కూడా అల్లు అర్జున్ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ఈసినిమాకోసం ఎదురుచూస్తున్నారు.

క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారికి అడివి శేష్ సర్‌ప్రైజ్
హీరో అడివి శేష్ మరోసారి తన గొప్ప మనసును చాటారు. మంచి మనసుతో స్పందించడంలో ఎప్పుడూ ముందుండే శేష్ ఇటీవల క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్ని పాపతో రోజంతా సమయాన్ని గడిపారు. ఇండస్ట్రీకి చెందిన ఒక సన్నిహిత వ్యక్తి ద్వారా ఈ చిన్ని అభిమాని గురించి తెలుసుకున్న శేష్, త్వరగా ఆమె, కుటుంబ సభ్యులని సంప్రదించారు. వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ అయ్యారు. చిన్నారి మెసేజులకు రిప్లేయ్ ఇచ్చారు. చిన్నారి కోసం ఒక క్యూట్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.

గేమ్ ఛేంజర్.. రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దిల్ రాజు
'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. గేమ్ ఛేంజర్‌లో తన పాత్రకు సంబంధించి చరణ్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేశాడు.

మెకానిక్ రాకీ నుంచి.. శ్రద్ధా శ్రీనాథ్ ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మెకానిక్ రాకీ'. #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు. రవితేజ ముళ్లపూడి తొలిసారి దర్శకత్వం వహిస్తున్నాడు. 'గుంటూరు కారం' ఫేమ్ మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇప్పటికే లాంఛ్ చేసిన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.

మిస్టర్ బచ్చన్.. రిలీజ్ డేట్ వచ్చేసింది
టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి షాక్, మిరపకాయ్ చిత్రాలు చేయగా.. ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఓటీటీ టాప్ 1 ట్రెండింగ్ లో హరోంహర
ఎప్పటినుండో మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సుధీర్ బాబుకు హరోంహర అనే సినిమాతో డీసెంట్ హిట్ దక్కింది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా కుప్పం నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

ఆయ్ థీమ్ సాంగ్ రిలీజ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ మ్యాడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే కదా. ఆ సినిమా సూపర్ హిట్ నే అందించింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అంజి కంచిపల్లి దర్శకత్వం లో నార్నే నితిన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో ఆయ్ అనే సినిమా చేస్తున్నాడు. గోదావరి జిల్లాలో ఆయ్ అనేది వాడుక పదం అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇదే పదాన్ని సినిమా టైటిల్ గా పెట్టడంతోనే సినిమాకు మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

సితార బర్త్ డే.. మహేష్ బాబు, నమ్రత పోస్టులు వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతుల ముద్దుల తనయ సితార ఘట్టమనేని నేడు పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మహేష్, నమ్రత సోషల్ మీడియా వేదికగా తమ గారాల పట్టికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సితారకి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు, వీడియోలను పంచుకున్నారు. నమ్రత అయితే సితార చిన్నప్పటి ఫొటోలు, వీడియోలు కలగలిపి ఓ ప్రత్యేక వీడియో క్రియేట్ చేసి ఇన్‌స్టా వేదికగా స్పెషల్ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం మహేష్, నమ్రత దంపతులు పెట్టిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సిద్దు జొన్నలగొడ్డ తెలుసుకదా లాంగ్ షెడ్యూల్ కి డేట్ ఫిక్స్
ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి ఆ తరువాత గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అయితే డీజే టిల్లు తో సిద్దు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆసినిమాతో సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా సిద్దూ క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది. దానికితోడు ఈసినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు

'ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్' ప్రారంభించిన ప్రముఖ నటులు, నిర్మాత మురళీ మోహన్
డెర్మటాలజీ, కాస్మొటాలజీలో ఏడేళ్ల అనుభవం ఉన్న డాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్' ను సీనియర్ యాక్టర్ మురళీ మోహన్ చేతుల మీదుగా తొలి ఏకాదశి సందర్భంగా ప్రారంభించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో కేబీఆర్ పార్క్ ఎదురుగా టిడిపి ఆఫీస్ రోడ్ లో జిమ్ ఖానా క్లబ్ పక్కన ఈ క్లినిక్ ఏర్పాటు చేశారు. స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ కు ఆస్ట్రిడ్ డెర్మటాలజీ, కాస్మొటాలజీ క్లినిక్ లో అత్యంత ఆధునిక, మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీనియర్ నటులు భాస్కర్, సీనియర్ పాత్రికేయులు జర్నలిస్ట్ ప్రభు, ప్రముఖ…

దేవర.. డబ్బింగ్ పూర్తి చేసిన నటుడు
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

సరిపోదా శనివారం-సూర్య పవర్ ఫుల్ బర్త్ డే గ్లింప్స్
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. అంటే సుందరానికి తర్వాత నాని-వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావటంతో ఈసినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు.

విక్రమార్కుడు రీ-రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ లో గత కొంతకాలంగా రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తుండటం తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల చిత్రాలను మేకర్స్ మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఆయా హీరోల అభిమానులు మరోసారి తమ ఫేవరేట్ హీరోను బిగ్ స్క్రీన్‌పై చూసి మురిసిపోతున్నారు. ఇలా ఇప్పటికే పలువురు అగ్ర హీరోల సినిమాలు రీ-రిలీజ్ అయ్యి నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇదే కోవలో తాజాగా మరో స్టార్ హీరో మూవీ ఒకటి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.

పేకమేడలు మూవీ రివ్యూ
పేకమేడలు సినిమా చూస్తుంటే బస్తీల్లోని ఇళ్లల్లో జరిగే విషయాలను దర్శకుడు అంత అద్భుతంగా ఎలా క్యాప్చర్ చెయ్యగలిగారని ఆశ్చర్యం కలుగుతుంది. హీరో హీరోయిన్లతో పాటు మిగతా క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చెయ్యడం కోసం కొంత టైమ్ తీసుకున్నారు. కానీ, కామెడీతో బోర్ కొట్టకుండా రన్ చేశారు. ఒక్కసారి బి భర్త చేసే పనులు భార్యకు తెలిసిన తర్వాత సినిమా ఆగలేదు. పరుగులు పెట్టింది. యాక్షన్ లేదు, కామెడీ లేదు, కానీ ఆ ఎమోషనల్ సీన్లు వస్తుంటే రెప్ప వెయ్యకుండా మూవీ చూసేలా ఉంటుంది. క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అక్కడ అనూష క్రిష్ణ నటన సైతం అద్భుతం. పేకమేడలు ప్రారంభం నిదానంగా మొదలైన ఆ ఫీలింగ్ థియేటర్ల నుంచి బయటకు వచ్చ

విశ్వంభర-స్పెషల్ డే కు టీజర్
మెగాస్టార్ చిరంజీవి కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఏడాదికి రెండు సినిమాలతో అలరిస్తున్న మెగాస్టార్ ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా విశ్వంభర. మల్లిడి విశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టింది. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేస్తూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా మ్యూజిక్ సిట్టింగ్స్ ను కూడా ప్రారంభించారు.

విశ్వంభర టాకీ పార్ట్ కంప్లీట్
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యింది.ఇంకో రెండు సాంగ్స్ అలాగే క్లైమాక్స్ ఫైట్ బ్యాలెన్స్ వుంది.సాంగ్స్ లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి అలాగే ఓ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించాల్సి వుంది. ఇంట్రో సాంగ్ కంపోజ్ కూడా పూర్తి అయ్యింది. సినిమాలో మొత్తం 5 పాటలు వుండనున్నాయి.ఇందులో ఇప్పటికే మూడు పాటల చిత్రీకరణ జరిగిపోయింది.ఇక క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కు అనల్ అరసు నేతృత్వం వహించనున్నారు.ఆగస్టు లో ఈ బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ కానుంది.అదే నెల 22న చిరంజీవి బర్త్ డే కావడంతో ఆరోజున ఈ సినిమా అప్డేట్ రానుంది.టీజర్ రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు.