
ట్యాగ్ · 1431 కథనాలు · పేజీ 10


యూఐ నుండి వార్నర్ రిలీజ్.. అదరగొట్టిన ఉపేంద్ర

వరుణ్ తేజ్ కొత్త సినిమా ఇంట్రెస్టింగ్ అప్డేట్

తెలంగాణ లో పుష్ప 2 టికెట్ ధరల పెంపు

లక్కీ భాస్కర్ రేర్ ఫీట్

చైనాలో మహారాజకు సూపర్ రెస్పాన్స్
ఆరోజు చాలా నెర్వస్ అయ్యాను, కానీ..

హరిహర వీరమల్లు షూట్లో జాయినైన పవన్ కళ్యాణ్

అఫీషియల్.. RC16లో మీర్జాపూర్ నటుడు

డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్

సంక్రాంతికి అజిత్ విదాముయార్చి

నటి సమంత ఇంట తీవ్ర విషాదం

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు
మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ముఫాసా: ది లయన్ కింగ్' డిసెంబర్ 20, 2024న ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం 2019లో లైవ్-యాక్షన్ ది లయన్ కింగ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులని అలరించబోతోంది. ‘ముఫాసా’కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నారు. మహేష్ బాబు వాయిస్ ఓవర్ లో రిలీజైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

కన్నప్ప.. విష్ణు మంచు కుమార్తెల ఫస్ట్ లుక్ రివీల్
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సినిమాలోని ప్రతీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి బజ్ పెంచేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే కన్నప్ప టీజర్‌తో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

యూఐ నుండి వార్నర్ రిలీజ్.. అదరగొట్టిన ఉపేంద్ర
శాండల్‌వుడ్ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యూఐ’. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు ఉపేంద్ర కథ అందించగా.. లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్‌పై మనోహరన్-శ్రీకాంత్ కేపి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రీష్మా నానయ్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మురళీ శర్మ, సన్నీలియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీ కృష్ణ, ఇంద్రజిత్ లంకేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సారంగపాణి జాతకం నుండి.. సంచారి సంచారి సాంగ్ రిలీజ్
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'సారంగపాణి జాతకం'. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. 'జెంటిల్మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది.

వరుణ్ తేజ్ కొత్త సినిమా ఇంట్రెస్టింగ్ అప్డేట్
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఓ ఎక్సయిటింగ్ న్యూ ఎంటర్టైనర్ కోసం చేతులు కలిపారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనుంది. అయితే ఈ సినిమా ఇండో కొరియా నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది.
పుష్ప 2 నుండి 'పీలింగ్స్' సాంగ్ రిలీజ్
క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. 2021లో విడుదల అయిన పుష్ప 1 చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

లవ్ సాంగ్స్ కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ శంకర్
భారతీయ చిత్రాలలో పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అసలు పాటలు లేని సినిమాలను ఊహించలేము. ఒక మూవీ హిట్ అవ్వాలంటే కథతో పాటు పాటలు కూడా కీలకమే. కేవలం పాటల వలనే సూపర్ హిట్ అయిన చిత్రాలు అనేకం కనిపిస్తాయి. ఇక హీరో, హీరోయిన్స్ మధ్య వచ్చే డ్యూయెట్స్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తి కనబరుస్తుంటారు. అందులోనూ లవ్ సాంగ్స్ అంటే మరింత స్పెషల్.

తెలంగాణ లో పుష్ప 2 టికెట్ ధరల పెంపు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మరో 5 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.అయితే అంతకుముందే 4వ తేదిన రాత్రి 9:30 గంటల నుండి ప్రీమియర్స్ పడనున్నాయి.ఇక తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్ తోపాటు స్పెషల్ షోస్ కోసం దరఖాస్తు చేస్తున్నారు నిర్మాతలు.అందులో భాగంగా తెలంగాణ లో పర్మిషన్ వచ్చింది.

లక్కీ భాస్కర్ రేర్ ఫీట్
ఈ దీపావళికి వచ్చిన దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.దుల్కర్ కు హీరోగా తెలుగులో ఇది రెండో సినిమా.ఇంతవరకు మలయాళ సినిమాలతో 100కోట్లు కొట్టలేకపోయిన దుల్కర్ లక్కీ భాస్కర్ తో ఈ ఫీట్ సాధించాడు.ఇక ఈసినిమా రెండు రోజుల క్రితం ఓటిటి లోకి వచ్చింది.అయినా కూడా ఆ ప్రభావం థియేట్రికల్ రన్ పై పడలేదు. ప్రతిరోజు బుక్ మై షో లో 7000కుపైగా టికెట్స్ సేల్ అవుతున్నాయి.ఓటిటి లోకి వచ్చాక కూడా థియేటర్లలో ఇంకా మంచి రన్ కనబరుస్తుంది.

చైనాలో మహారాజకు సూపర్ రెస్పాన్స్
తమిళ హీరో విజయ్ సేతుపతి టైటిల్ లో నటించిన సినిమా మహారాజ.ఈఏడాది కోలీవుడ్ బిగెస్ట్ హిట్ లలో ఒకటిగా నిలిచింది ఈసినిమా.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.విజయ్ సేతుపతికి ఇది 50వ సినిమా.థియేట్రికల్ రన్ తరువాత ఓటిటిలోకి వచ్చి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈసినిమాతో విజయ్ సేతుపతి మొదటి సారి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు.
ఆరోజు చాలా నెర్వస్ అయ్యాను, కానీ..
పుష్ప-2 ది రూల్ ఇప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రమిది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూడబోతున్నారు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, ఆయన క్లాస్ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలవబోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా 12 వేలకు పైగా స్క్రీన్స్‌ల్లో విడుదల కాబోతోంది.

ఆల్ టైం టాప్ 2లో నానా హైరానా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుండి రెండు రోజుల క్రితం వచ్చిన మూడో పాట నానా హైరానా మ్యూజిక్ యాప్స్ ను ఓ ఊపు ఊపేస్తుంది.ఇక ఈసాంగ్ అటు యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ లో వ్యూస్ ను రాబట్టుకుంటుంది.తెలుగు తోపాటు తమిళ ,హిందీ భాషల్లో ఈసాంగ్ రిలీజ్ అవ్వగా తెలుగులో ఇప్పటివరకు 28మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.24గంటల్లో అయితే 23.44 మిలియన్ల వ్యూస్ తో టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ పొందిన లిరికల్ వీడియో గా సెకండ్ ప్లేస్ ను దక్కించుకుంది.27.19మిలియన్ల వ్యూస్ తో సౌత్ లోనే టాప్ లో కొనసాగుతుంది అల్లు అర్జున్ పుష్ప 2 కిస్సిక్ సాంగ్.ఈ లిస్ట్ లో నాలుగో స్థానం లో వుంది నానా హైరైనా.

ఓటీటీ లోకి వచ్చేస్తున్న మట్కా
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ మట్కా వాసు అనే డాన్ పాత్రలో కనిపించారు. వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్స్పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి గ్రాండ్‌గా నిర్మించారు. వరుణ్ తేజ్ కెరీర్లోనే మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ మూవీగా తెరకెక్కిన మట్కా భారీ అంచనాల నడుమ నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదలైంది.

అమరన్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్
దీపావళికి విడుదలై థియేటర్లలో దుమ్ము రేపిన శివ కార్తికేయన్ అమరన్ ఓటిటి లోకి కూడా వచ్చేస్తుంది.ఇప్పటికీ ఈసినిమా తమిళనాడు లో డీసెంట్ వసూళ్లను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానం లో కొనసాగుతుంది.నిన్నటి వరకు అమరన్ ప్రపంచ వ్యాప్తంగా 320 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి శివకార్తికేయన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలించింది.ఇక ఈసినిమాను వచ్చే నెల 5 నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది నెట్ ఫ్లిక్స్.తెలుగుతోపాటు తమిళ,మలయాళ,కన్నడ ,హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.ఈ సినిమా కనీసం రెండు మూడు వారాలైన నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో కొనసాగడం పక్కా.

హరిహర వీరమల్లు షూట్లో జాయినైన పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరియు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

అఫీషియల్.. RC16లో మీర్జాపూర్ నటుడు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో 'గేమ్ ఛేంజర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ నేపథ్యంలో చరణ్ 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాతో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్థి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.

డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడని ఇంతకుముందే వార్తలు రాగ ఇప్పుడు వాటిని నిజం చేస్తూ సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.జాసన్ సంజయ్ డైరెక్షన్ లో సందీప్ కిషన్ హీరోగా సినిమా రానుంది.నిన్న మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.తమన్ ఈసినిమాకు సంగీతం అందించనుండగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది.సో బడ్జెట్ కు డోకా ఉండదు.తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలకానుంది.
నన్ను స్టార్‌ను చేసింది సుకుమారే - అల్లు అర్జున్
పుష్ప-2 ది రూల్ ఇప్పుడు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రమిది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలింగా రూపొందిన ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూడబోతున్నారు. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, ఆయన క్లాస్ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ చిత్రంగా నిలవబోతుంది.

సంక్రాంతికి అజిత్ విదాముయార్చి
తమిళ హీరో తల అజిత్ ఈ పొంగల్ కు గుడ్ బ్యాడ్ అగ్లీ తో వస్తాడనుకుంటే ఆ స్థానం లో విదాముయార్చి ని దింపుతున్నాడు.మగిజ్ తిరుమనేని డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ఈసినిమా.నిన్న ఈసినిమా టీజర్ ను విడుదలచేశారు.ఇందులో రిలీజ్ ఎప్పుడో కూడా చెప్పేశారు.పొంగల్ కు బరిలోకి దిగనుంది.ఇక టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.ఈసినిమాలో అజిత్ సరసన త్రిష నటిస్తుండగా అర్జున్ సర్జా ఆండ్రియా జెర్మియా,అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.షూటింగ్ కూడా అయిపొయింది.అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.అయితే సంక్రాంతికి భారీ సినిమాలు వస్తుండడంతో విదాముయార్చిని తెలుగులో విడుదలచేయడం అనుమానమే.

నటి సమంత ఇంట తీవ్ర విషాదం
ప్రముఖ నటి సమంత ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ మేరకు విషయాన్ని సమంత స్వయంగా తన ఇన్‌స్టా ద్వారా తెలియజేశారు. ‘నాన్నను ఇక కలవలేను’ అంటూ స్టేటస్‌ను పోస్ట్ చేసి దానికి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు.