శాండల్‌వుడ్ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యూఐ’. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు ఉపేంద్ర కథ అందించగా.. లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్‌పై మనోహరన్-శ్రీకాంత్ కేపి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రీష్మా నానయ్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. మురళీ శర్మ, సన్నీలియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీ కృష్ణ, ఇంద్రజిత్ లంకేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఉపేంద్ర జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 19న లాంచ్ చేసిన సౌండ్ ఆఫ్ యూఐ ఎలాంటి థీమ్‌తో ఉండబోతుందో ప్రేక్షకులకు ఒక హింట్ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో ఉపేంద్ర హార్డ్ కోర్ ఫ్యాన్స్‌తో పాటు జెనరల్ ఆడియెన్స్ లోనూ ‘యూఐ’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ‘వార్నర్’ పేరిట ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.
ఈ మేరకు సోమవారం సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ ఇది టీజర్ కాదు, ట్రైలర్ కాదు.. వార్నర్’ అని తెలిపింది. దీనిని గమనిస్తే.. కథ 2040 సంవత్సరంలో జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్, COVID-19, ద్రవ్యోల్బణం, ఏఐ, నిరుద్యోగం, యుద్ధం యొక్క నిరంతర ముప్పు అస్తవ్యస్తమైన, బాధాకరమైన సమాజానికి దారి తీస్తాయి.
వినాశకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, సామాజిక విభజనలు పాతుకుపోయాయి. కులం, మతం, సంఘర్షణ, విభజన మూలాలుగా వ్యక్తుల జీవితాల మారుస్తాయి. ఈ డిస్టోపియన్ వరల్డ్‌లో ఉపేంద్ర నియంతగా కనిపించారు. మార్పు కోసం, న్యాయం కోసం, మంచి భవిష్యత్తు కోసం కష్టజీవులు నిరసనలకు దిగుతారు. ఇదే సమయంలో పవర్ ఫుల్‌గా ఎంట్రీ ఇచ్చిన ఉపేంద్ర రూత్ లెస్‌గా కనిపించారు.
కథ-కథనంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర మరో వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఆకట్టుకునేలా ప్రెజెంట్ చేశారు. ఈ వార్నర్ ఎంతో ఇంటెన్స్‌గా ఉండి సినిమాపై అంచనాలను ఇంకా పెంచేలా ఉంది. ఉప్పీ అయితే ఇరగ్గొట్టేశాడు. చాలా రోజుల తర్వాత తన స్టైల్, గ్రేస్ అభిమానులకు కనువిందు చేసేలావుంది. సినిమా కోసం నిర్మించిన వరల్డ్ గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్‌ను చూపుతూ ఎక్స్‌ట్రార్డినరీగా వుంది.
హెచ్‌సి వేణుగోపాల్ క్యాప్చర్ చేసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ బి లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ మూడ్ సెట్ చేసింది. కాగా ఈ మూవీ ఆర్ట్ డైరెక్షన్ శివ కుమార్ జె (KGF1&2 ఫేమ్), VFXని నిర్మల్ కుమార్ (విక్రాంత్ రోనా ఫేమ్) పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. కాగా యూఐ డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: