తమిళ హీరో తల అజిత్ ఈ పొంగల్ కు గుడ్ బ్యాడ్ అగ్లీ తో వస్తాడనుకుంటే ఆ స్థానం లో విదాముయార్చి ని దింపుతున్నాడు.మగిజ్ తిరుమనేని డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ఈసినిమా.నిన్న ఈసినిమా టీజర్ ను విడుదలచేశారు.ఇందులో రిలీజ్ ఎప్పుడో కూడా చెప్పేశారు.పొంగల్ కు బరిలోకి దిగనుంది.ఇక టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.ఈసినిమాలో అజిత్ సరసన త్రిష నటిస్తుండగా అర్జున్ సర్జా ఆండ్రియా జెర్మియా,అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.షూటింగ్ కూడా అయిపొయింది.అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.అయితే సంక్రాంతికి భారీ సినిమాలు వస్తుండడంతో విదాముయార్చిని తెలుగులో విడుదలచేయడం అనుమానమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అజిత్ ఈసినిమాతో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే.ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.తమిళంలో ఈ సంస్థకు ఇదే మొదటి సినిమా.మార్క్ ఆంటోనీ ఫేమ్ అదిక్ రవిచంద్రన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఈసినిమాను పొంగల్ కు విడుదలచేస్తామని ముందు ప్రకటించారు కానీ ఇప్పుడు ఆ టైంలో విదాముయార్చి వస్తుండడంతో రిలీజ్ వాయిదా పడనుంది.సమ్మర్ లో ఈ సినిమా విడుదలచేయనున్నారు.త్వరలోనే న్యూ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ లో అజిత్ మూడు గెటప్ లలో కనిపించనున్నాడు.ఇందులో సునీల్ ,ప్రేమలు హీరో నస్లేన్ కీలక పాత్రలో కనిపించున్నారు.ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం మరో మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ ను తీసుకున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























