మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఓ ఎక్సయిటింగ్ న్యూ ఎంటర్టైనర్ కోసం చేతులు కలిపారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనుంది. అయితే ఈ సినిమా ఇండో కొరియా నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దర్శకుడు మేర్లపాక గాంధీ, యువి క్రియేషన్స్ తో వరుణ్ తేజ్ కి ఇది ఫస్ట్ వెంచర్ కావడం విశేషం. వరుణ్ తేజ్ గతంలో బ్లాక్ బస్టర్ ‘కంచె’ కోసం ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో జతకట్టారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
యువి క్రియేషన్స్ లో బ్లాక్ బస్టర్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ని అందించిన డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఇప్పుడు వరుణ్ తేజ్‌తో కలిసి ఒక యూనిక్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు. ఈ మూవీతో డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఇప్పుడు కొత్త జోనర్, కొత్త ఆర్టిస్టులను తెలుగు తెరకు పరిచయం చేయడానికి రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం మార్చి 2025లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ అద్భుతమైన స్క్రిప్ట్ ని రెడీ చేసిన ఈ ప్రాజెక్ట్ లో వరుణ్ తేజ్ ఫ్రెష్ అండ్ యూనిక్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: