
ట్యాగ్ · 10 కథనాలు


బ్లాక్ బస్టర్ సింహా మూవీ రీ రిలీజ్ డేట్

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'గల్లీ రౌడీ'

'వసంత కోకిల' టీజర్ రిలీజ్

ఆస్కార్ అవార్డు తో హైదరాబాద్ కు చేరుకున్న ఆర్ ఆర్ ఆర్ టీమ్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు…

బ్లాక్ బస్టర్ సింహా మూవీ రీ రిలీజ్ డేట్
తెలుగు చిత్రపరిశ్రమలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా స్టార్ హీరోస్.. డైరెక్టర్స్ కెరీర్లో సూపర్ హిట్స్ అందుకున్న సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు మేకర్స్ తీసుకువస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవి, వెంకటేశ్, ఎన్టీఆర్, ప్రభాస్ కెరీర్లోని ఆల్ టైమ్ హిట్ చిత్రాలు థియేటర్లలో రీ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.2010 సంవత్సరం లో అత్యధిక వసూళ్లు సాధించిన, బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సింహా మూవీ రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించనుంది.

కోనసీమ థగ్స్ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా బాగానే ఆకట్టుకుంటుంది. మాస్ ఆడియన్స్ కు ఈసినిమా బాగా నచ్చుతుందని చెప్పొచ్చు.

మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ అయిన వసంత కోకిల మూవీ ట్రైలర్
ముద్రాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై రమణన్ పురుషోత్తమ దర్శకత్వంలో జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు బాబీ సింహా , కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ వసంత ముల్లై తమిళ మూవీ ఫిబ్రవరి 10 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు , కన్నడ వెర్షన్స్ వసంతకోకిలా టైటిల్ తో 10 వ తేదీ రిలీజ్ కానున్నాయి.నలభై ఏళ్ల క్రితం కమల్ హాసన్, శ్రీదేవి నటించిన సూపర్ హిట్ వసంతకోకిల`టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కడం విశేషం. ఇప్పటికేచిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, సాంగ్స్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.

బాలకృష్ణ , అల్లు అర్జున్ మల్టీ స్టారర్ మూవీ పై బోయపాటి కామెంట్స్
"భద్ర "మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన బోయపాటి శ్రీను పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ హీరోగా బోయపాటి తెరకెక్కించిన "సింహా ", లెజెండ్ ", "అఖండ", అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన "సరైనోడు " మూవీస్ ఘనవిజయం సాధించాయి. "లెజెండ్ " మూవీ కి బెస్ట్ డైరెక్టర్ గా బోయపాటి నంది అవార్డ్ అందుకున్నారు. దర్శకుడు బోయపాటి హీరోలను ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తారో విలన్స్ ను కూడా అదే విధంగా చూపించడం విశేషం.

బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ లో మీకు నచ్చిన మూవీ..?
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ లు ఉంటాయి.. ఆ కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకులకు స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అలాంటి ఒక సాలిడ్ కాంబినేషనే బోయపాటి శ్రీను-బాలకృష్ణ ది. వీరిద్దరి సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ ఎంటర్ టైన్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్. తన మొదటి సినిమా భద్ర లోనే తన మార్క్ ను చూపించాడు. ఆతరువాత వచ్చిన తులసి సినిమా కూడా అలాంటి జోనరే. మరి అలాంటి యాక్షన్ సినిమాలకు బాలకృష్ణ లాంటి హీరో తోడైతే ఎలా ఉంటుంది. అలా వచ్చిన సినిమానే సింహా. ఈసినిమా రికార్డులు సృష్టించింది. దాంతో ఈకాంబినేషన్ అందరికీ నోటెడ్ అయిపోయింది. ఈ కాంబినేషన్‌లో…

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'గల్లీ రౌడీ'
థియేటర్లు ఓపెన్ అవ్వడంతో సినిమా రిలీజ్ ల సందడి మొదలైంది. ఇక మేకర్స్ కూడా ఏ మాత్రం లేట్ చేయకుండా తమ సినిమాలను వీలైనంత త్వరగా రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఈనేథ్యంలోనే వారానికి కనీసం అరడజను సినిమాలైనా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఇప్పుడు యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా తన సినిమాకు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసేశాడు. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. ఈసినిమా కూడా రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. “గల్లీ రౌడీ” సెప్టెంబర్ 3న రిలీజ్ అవుతున్నట్టు తెలిపారు.

'వసంత కోకిల' టీజర్ రిలీజ్
తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటుల్లో బాబి సింహా కూడా ఒకరు. పలు తమిళ మూవీస్ లో ప్రతినాయకుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో కూాడా పలు సినిమాల్లో నటించాడు. రన్, ఏదైనా జరగొచ్చు, డిస్కో రాజా మూవీస్ లో నటించాడు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వచ్చేస్తున్నాడు.
హీరో బాలకృష్ణ బ్లాక్ బస్టర్ "సింహా " మూవీ
యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, నయనతార జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "సింహా "మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. ఘనవిజయం సాధించిన "సింహా "మూవీ 92 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. దర్శకుడు బోయపాటి తన మాస్ ట్రీట్ మెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హీరో బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ , ప్రత్యేక గెటప్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా నంది , సినీ మా , సంతోషం అవార్డ్స్ అందుకున్నారు.

నటసింహ బాలకృష్ణ ‘సింహా’కు 10 ఏళ్ళు
“చూడు.. ఒకవైపే చూడు.. రెండో వైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు.. మాడిపోతావ్”.. అంటూ డాక్టర్ నరసింహగా నటసింహ నందమూరి బాలకృష్ణ తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించిన చిత్రం ‘సింహా’. ఇందులో బాలయ్య పలికిన ప్రతీ డైలాగ్ అప్పట్లో సంచలనమే. మరీ ముఖ్యంగా.. జనాల జేజేలందుకునేలా బాలయ్యను సరికొత్త కోణంలో ఆవిష్కరించారు చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను. బాలయ్య ద్విపాత్రాభినయం పోషించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నయనతార, స్నేహా ఉల్లాల్, నమిత నాయికలుగా నటించారు. కె.ఆర్.విజయ, రెహమాన్, సాయికుమార్, ఆదిత్యమీనన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, వేణు మాధవ్, చలపతిరావు, కృష్ణభగవాన్, ఝాన్సీ ముఖ్య పాత్రలు పోషించారు…