
ట్యాగ్ · 13 కథనాలు


వారసుడు చూడమని పిల్లలు పెద్దలకు చెప్తున్నారు

200 కోట్ల క్లబ్ లో వారిసు

వారసుడు-మహేష్, చరణ్ ఫస్ట్ ఛాయిస్

25 రోజులు పూర్తి చేసుకున్న మసూద

మెట్రో పై వారసుడు.. భారీ ప్రమోషన్స్ స్టార్ట్

కంటెంట్ ఉన్న సినిమాలకు సీజన్ ఏమీ ఉండదు

మూడు భాషలలో మసూద మూవీ రిలీజ్

స్నేహితురాళ్ళు అయిన సీనియర్ హీరోయిన్స్ తో మీనా

పరదా లో ఆకట్టుకుంటోన్న సంగీత ఫస్ట్ లుక్
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే 'టిల్లు స్క్వేర్' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో అప్పుడే ఆమె తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రారంభించేసింది. ఈ సినిమాకు 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో మరో ప్రముఖ మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్ తొలిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

వారసుడు చూడమని పిల్లలు పెద్దలకు చెప్తున్నారు
దళపతి విజయ్ నటించిన 'వారసుడు' జనవరి 14న తెలుగులో విడుదలైంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు పివిపి సినిమా పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి మరియు పెరల్ వి పొట్లూరి నిర్మించారు. దీని గురించి దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, ఈ చిత్రం త్వరలోనే 'మాస్టర్'ని మించి తెలుగు రాష్ట్రాల్లో దళపతి విజయ్ కి అతిపెద్ద హిట్ గా నిలవబోతుంది అని తెలిపారు. బుధవారం నాడు హైద్రాబాద్ లో విలేకరుల సమావేశంలో దర్శకుడు వంశీ పైడిపల్లి పలు విషయాలు తెలిపారు.

200 కోట్ల క్లబ్ లో వారిసు
తెలుగు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన సినిమా వారిసు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. చాలా కాలం తరువాత ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో ముందుకు వచ్చాడు విజయ్. ఈసినిమా తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ అయింది. ఇక ఇక్కడ జనవరి 14వ తేదీన ఈసినిమా రిలీజ్ అయింది. ఈసినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం తగ్గేదేలే అంటుంది. ఈసినిమా రిలీజ్ అయిన 5రోజుల్లోనే 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇక ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు అయిపోయింది. అయినా కూడా రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోయింది. వారం రోజుల్లో ఈసినిమా 200…

వారిసు కలెక్షన్స్ - 5 రోజుల్లో 150 కోట్లు
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన సినిమా వారిసు. ఈసినిమా తెలుగులో వారసుడు తమిళంలో ‘వారిసు’ అనే పేరుతో రిలీజ్ అయింది. సంక్రాంతికి బరిలో దిగిన ఈసినమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ముందు తమిళ్ లో జనవరి 11వ తేదీన ఈసినిమా రిలీజ్ అయింది. తమిళంలో ‘వారిసు’ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. విజయ్ చాలా కాలం తరవాత చేసిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ఇక ఇక్కడ జనవరి 14వ తేదీన ఈసినిమా రిలీజ్ అయింది. ఇక్కడ కూడా ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

సోల్ ఆఫ్ వారసుడుఫుల్ సాంగ్ రిలీజ్
తమిళ్ హీరో విజయ్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే కదా. అందకే ఆయన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ మంచి మార్కెట్ ను సొంతం చేసుకుంటున్నారు. ఇక బీస్ట్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు వారిసు సినిమాతో వచ్చేస్తున్నాడు. తెలుగులో వారసుడు టైటిల్ తో వస్తుంది. ఈసినిమాను తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.

ఇన్ట్సాలో వారసుడు రంజితమే సాంగ్ రికార్డ్
తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన నటించిన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తుంటారు. ఆయన సినిమాలు ఇక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాయి. ఇక ప్రస్తుతం అయితే విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో వారిసు అనే టైటిల్ తో తెలుగులో వారసుడు టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే వరుసగా పోస్టర్లు, పాటలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

వారసుడు-మహేష్, చరణ్ ఫస్ట్ ఛాయిస్
‘మహర్షి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన వంశీ పైడిపల్లితో విజయ్ ‘వారసుడు’ చిత్రాన్ని చేస్తున్నాడు. తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అంతేకాదుప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టేశారు. దీనిలోభాగంగా ఈసినిమా నుండి వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రంజితమే సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.

థ్రిల్లింగ్ హార్రర్ మసూద ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈమధ్య చిన్నసినిమా, పెద్ద సినిమా అని కాదు.. ఏ సినిమాలో కంటెంట్ ఉంది అని మాత్రమే చూస్తున్నారు ఆడియన్స్. అందుకే చిన్న సినిమాలు కూడా అంత బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నాయి. ఇప్పటికే చాలా చిన్న సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక రీసెంట్ గా వచ్చన మసూద సినిమా కూడా ఈ కేటగిరిలోకే చేరుతుంది. సాయికిరణ్ దర్శకత్వంలో తిరువీర్ , కావ్య కల్యాణ్‌రామ్ జంటగా.. సంగీత కీలక పాత్రలో నటించిన సినిమా మసూద. హార్రర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ అయింది. అంటే సినిమా సూపర్ హిట్ అయిందన్నమాట. దీంతో ఈసినిమా మంచి…

25 రోజులు పూర్తి చేసుకున్న మసూద
మళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సాయికిరణ్ దర్శకత్వంలో జార్జిరెడ్డి మూవీ ఫేమ్ తిరువీర్ , కావ్య కల్యాణ్‌రామ్ జంటగా, సీనియర్ నటి సంగీత ముఖ్య పాత్రలో తెరకెక్కిన హర్రర్ డ్రామా మసూద మూవీ18 వ తేదీ రిలీజ్అయ్యి విజయం సాధించింది. ప్రశాంత్ విహారి సంగీతం అందించారు . ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా రిలీజ్ చేయడం విశేషం.

మెట్రో పై వారసుడు.. భారీ ప్రమోషన్స్ స్టార్ట్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ హీరోగా వస్తున్న సినిమా వారిసు. తెలుగులో వారసుడు అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇక ఈ సినిమాను కూడా ముందునుండీ సంక్రాంతి బరిలో దించనున్నట్టు చెబుతూనే వస్తున్నారు మేకర్స్. ఈనేపథ్యంలోనే రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఈసినిమా జనవరి 13వ తేదీన ఇక్కడ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఈసినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

కంటెంట్ ఉన్న సినిమాలకు సీజన్ ఏమీ ఉండదు
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న మసూద ప్రపంచవ్యాప్తంగా విడుదలై నేటికీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సంద్భంగా రామానాయుడు స్టూడియో లో థాంక్యూ మీట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు దిల్ రాజు…

మూడు భాషలలో మసూద మూవీ రిలీజ్
మళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్.బ్యానర్ పై సాయికిరణ్ దర్శకత్వంలో జార్జిరెడ్డి మూవీ ఫేమ్ తిరువీర్ , కావ్య కల్యాణ్‌రామ్ జంటగా హర్రర్ డ్రామా జోనర్‌లో మసూద మూవీ తెరకెక్కుతుంది. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు. మసూద మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.హీరో నాని చేతుల మీదుగా రిలీజ్అయిన మసూద మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

స్నేహితురాళ్ళు అయిన సీనియర్ హీరోయిన్స్ తో మీనా
"నెంజంగళ్ "(1982 ) మూవీ తో కోలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన మీనా తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించారు. "నవయుగం "(1990 ) మూవీ తో మీనా టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్"సీతారామయ్య గారి మనవరాలు " మూవీ లో మీనా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో మీనా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. అన్నిభాషల స్టార్ హీరోస్ కు జోడీగా నటించిన ఘనత మీనాదే.