ట్యాగ్ · 10 కథనాలు
పూరీ జగన్నాథ్ మరో పాన్ ఇండియా మూవీ

దర్శకుడిగా 20 సంవత్సరాలు పూర్తి

పూరీ జగన్నాథ్ తొలి చిత్రం ‘బద్రి’కి 20 వసంతాలు
స్టార్ హీరో కోసం కథ సిద్ధం చేస్తున్న పూరీ..!
లాక్ డౌన్ ను సూపర్ గా వాడుకుంటున్న పూరీ..!

లాక్ డౌన్ నేపథ్యంలో పూరి జగన్నాథ్ మెసేజ్

పవన్ తో పూరీ 'జనగణమన'..?
'ఫైటర్' ఒరిజినల్ టైటిల్ పై అప్ డేట్ ..!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముంబై లో కొద్దిరోజులు జరుపుకుంది. ఇక కరోనా వల్ల ప్యాకప్ చెప్పుకొని ఇక్కడికి వచ్చేసారు. మరి షూటింగ్ కు ఎప్పుడు వెళ్తారు అనేది మాత్రం ఇంకా తెలీదు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ ఫైటర్ కాదని ఇప్పటినే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఛార్మి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైటర్ అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని.. అసలైన టైటిల్ వేరే ఉందని ఇంతకుముందే తెలిపింది.
పూరీ జగన్నాథ్ మరో పాన్ ఇండియా మూవీ
'ఇస్మార్ట్' డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ప్రస్తుతం ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. నిర్మాణ దశలో ఉంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నాయికగా నటిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ కానుందని తెలిసింది.
‘ఫైటర్’ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్న పూరీ జగన్నాథ్?
చిత్ర పరిశ్రమలో ఒక్కో దర్శకుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ముఖ్యంగా టైటిల్స్ విషయంలో. “కళాతపస్వి” కె.విశ్వనాథ్, భీమనేని శ్రీనివాసరావుకు ‘స’,’శ’ అక్షరాలు.. సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ‘అ’ అనే అక్షరం టైటిల్స్‌లో ప్రథమాక్షరంగా చాలా సందర్భాల్లో కలిసిరాగా.. సంచలన దర్శకుడు తేజకు టైటిల్ చివరలో ‘పూర్ణాక్షరం’ (‘చిత్రం’, ‘జయం’.. ఇలా) ఉండడం అచ్చొచ్చింది. వీరిలాగే ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కి కూడా తన సినిమాల టైటిల్స్ విషయంలో ఓ సెంటిమెంట్ ఉంది.

నేను రిటైర్ అయ్యేంత వరకూ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి..!
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'బద్రి' సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ఒక రకంగా పవన్ కు యూత్ లో మంచి క్రేజ్ ను తీసుకొచ్చిన సినిమా ఇది. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రోజుతో 20 ఏళ్లు పూర్తయింది. దీనితో మరోసారి ఈ సినిమాను సోషల్ మీడియాలో గుర్తుచేసుకుంటున్నారు పవన్, పూరీ ఫ్యాన్స్. ఇప్పటికే రేణు దేశాయ్ ఈ సినిమా షూటింగ్ లో ఎంత కష్టపడిందో చెప్పుకొస్తూ... అప్పటి షూటింగ్ కు సంబంధించి కొన్ని రేర్ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది.

దర్శకుడిగా 20 సంవత్సరాలు పూర్తి
సూపర్ హిట్ "బద్రి " మూవీ తో పూరి జగన్నాథ్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, సూపర్, పోకిరి, దేశముదురు, చిరుత, బిజినెస్ మేన్, ఇద్దరమ్మాయిలతో, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

పూరీ జగన్నాథ్ తొలి చిత్రం ‘బద్రి’కి 20 వసంతాలు
కథానాయకులను కొత్తగా ఆవిష్కరించడంలో ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీరే వేరు. ఆయన తెరకెక్కించిన ప్రతీ చిత్రంలోనూ ఇదే శైలిని కొనసాగించారు, కొనసాగిస్తున్నారు. అంతేకాదు.. తెలుగులో అన్ని వర్గాల కథానాయకులతోనూ సినిమాలు చేసిన వైనం పూరి సొంతం. అలాంటి పూరి దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘బద్రి’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో.. పవన్‌ను గత చిత్రాలకంటే డిఫరెంట్‌గా, పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశారు పూరి. “నువ్వు నందా అయితే ఏంటి? నేను బద్రి.. బద్రీనాథ్” అని పవన్ చేత చెప్పించిన డైలాగ్ ఇప్పటికీ సంచలనమే. అలా ఫస్ట్ మూవీతోనే తను ఒక డిఫరెంట్ డైరెక్టర్ అని…
స్టార్ హీరో కోసం కథ సిద్ధం చేస్తున్న పూరీ..!
లాక్ డౌన్ సమయంలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇంట్లో ఉండే కొత్త సినిమా కథను రాసే పనిలో ఉన్నాడని ఇప్పటికే వార్తలు జోరుగా ప్రచారం అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే... ఓ అగ్ర హీరో కోసం పూరీ కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడట. ఆ అగ్ర హీరో ఎవరో కాదు.. మెగా స్టార్ చిరంజీవి. నిజానికి 150వ సినిమాను పూరీనే తెరకెక్కించాల్సి ఉంది. దీనికి ఆటోజానీ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసాడు పూరీ. అయితే స్టోరీ అంత నచ్చకపోవడంతో చిరు వెనక్కి తగ్గాడు. ఇప్పుడు మరోసారి.. చిరు కోసం పూరీ స్క్రిప్ట్ ను రాసే పనిలో వున్నాడట. అంతేకాదు తాజాగా అభిమానులతో మాట్లాడుతూ స్టార్…
లాక్ డౌన్ ను సూపర్ గా వాడుకుంటున్న పూరీ..!
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. కేవలం నిత్యావసర సరుకులు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే తప్పా బయట కాలు పెట్టే పరిస్థితి లేదు. చాలా మంది ఇంట్లోనే ఉంటూ కరోనా ఇచ్చిన సమయాన్ని కుటుంబంతో గడుపుతూ సద్వినియోగం చేసుకుంటున్నారు. సెలబ్రిటీలు సైతం ఇంట్లోనే ఉంటూ... ఫ్యామిలీతో... ఆట పాటలతో.. ఇంకొంతమంది గరిటె చేతబట్టి వంటలు చేస్తూ.. ఇలా పలు పనుల్లో బిజీ అయిపోయారు. కొందరు హీరోలు కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించే వీడియోలు తీస్తుంటే. మరికొందరు పాటల రూపంలో జాగ్రత్తలు చెబుతున్నారు. ఇక కొంతమంది దర్శకులు అయితే కొత్త స్క్రిప్టులకు పనిచెబుతున్నారు.

లాక్ డౌన్ నేపథ్యంలో పూరి జగన్నాథ్ మెసేజ్
కరోనా మహమ్మారి కారణంగా ప్రధాని 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలు ఇళ్ళకే పరిమితం అయ్యారు. కొంత మంది పరిస్థితులను అర్థం చేసుకోకుండా బయట తిరుగుతున్నారు. దానికి పర్యవసానం ప్రజలందరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రతీ ఒక్కరూ స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని పూరి జగన్నాథ్ కోరారు.

పవన్ తో పూరీ 'జనగణమన'..?
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ 'వకీల్ సాబ్' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు ఆఖరి దశకు వచ్చింది. అన్ని పనులు త్వరగా పూర్తి చేసి మే 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. వీటితో పాటు ఫైనల్ అయిన మరో సినిమా హరీష్ శంకర్ తో. ఈ రెండు…