
ట్యాగ్ · 52 కథనాలు · పేజీ 3


పూజాహెగ్డే పై ప్రభాస్ ప్రశంసలు

గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ సెట్ లో "ఆదిపురుష్ "షూటింగ్
కల నెరవేరింది -ప్రభాస్
"ఆదిపురుష్ " మూవీ అప్ డేట్
'ఆదిపురుష్' కోసం 'అవతార్' టీమ్..?

ఇంట్లోనే విలు విద్య ప్రాక్టీస్ ..?
`ప్రభాస్ 20` నెక్ట్స్ షెడ్యూల్ అప్‌డేట్...
ప్రభాస్‌తో మరోసారి జట్టుకట్టనున్న ‘దిల్’ రాజు?

"ఆదిపురుష్ " మూవీ అప్ డేట్
టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 500 కోట్ల బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.

పూజాహెగ్డే పై ప్రభాస్ ప్రశంసలు
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలోరూపొందుతున్న పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ జూలై 30వ తేదీరిలీజ్ కానుంది. భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ సెట్ లో "ఆదిపురుష్ "షూటింగ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం "రాధేశ్యామ్ ", "సలార్ ", "ఆదిపురుష్ " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ బడ్జెట్ మూవీస్ అన్నీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. కరోనా కారణంగా ప్రభాస్ హీరోగా రూపొందుతున్న మూవీస్ అన్నీ హైదరాబాద్ సెట్స్ లోనే చిత్రీకరణ జరపాలని దర్శక , నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
కల నెరవేరింది -ప్రభాస్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రాధేశ్యామ్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "రాధేశ్యామ్ " మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీ లో జరుగుతుంది . ఈ మూవీ తరువాత వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ , టి -సిరీస్ బ్యానర్ పై ఓం రౌత్ దర్శకత్వంలో "ఆదిపురుష్ "బాలీవుడ్ మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీ - రేపు బిగ్ అనౌన్స్ మెంట్
అలా నిన్న ప్రభాస్ పుట్టిన రోజుకంటే ముందే బిగ్ సర్ ప్రయిజ్ ఉందని నాగ్ అశ్విన్ చెప్పాడో లేదో ఇలా వెంటనే అప్ డేట్ ఇచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ కు మాములు షాక్ ఇవ్వలేదు. పుట్టిన రోజు ముందు అంటే ఇంకా చాలా టైమే ఉంది అని లైట్ తీసుకున్నారు కానీ రేపు బిగ్ అన్నౌన్స్ మెంట్ ఉందని చెప్పి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాను నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ సంస్థ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా రేపు ఉదయం 10 గంటలకు బిగ్ సర్ప రైజ్ ఉందని తెలుపుతూ ట్వీట్ చేసారు…
"ఆదిపురుష్ " మూవీ అప్ డేట్
బ్లాక్ బస్టర్ "బాహుబలి ", "బాహుబలి 2 " మూవీస్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ప్రభాస్ కు అధిక సంఖ్య లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. స్టైలిష్ మూవీ "సాహో "బాలీవుడ్ లో ఘనవిజయం సాధించడంతో ఉత్తరాది లో ప్రభాస్ పై క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ప్రభాస్ తో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీస్ రూపొందుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం "రాధేశ్యామ్ "మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా బాలీవుడ్ మూవీ "ఆదిపురుష్ " అనౌన్స్ అయ్యింది.
'ఆదిపురుష్' కోసం 'అవతార్' టీమ్..?
తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణాసురిడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ఇక సీత పాత్రలో ఎవరు నటిస్తారు అనే దానిపై క్లారిటీ రావాలి. అయితే ఇప్పటివరకూ కీర్తి సురేష్, కియారా పేర్లు తెరపైకి వచ్చాయి. క్లారిటీ ఇచ్చేలోపు ఇంకెన్ని పేర్లు వస్తాయో చూడాలి.

ఇంట్లోనే విలు విద్య ప్రాక్టీస్ ..?
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘ఆది పురుష్’ అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్న సంగతి కూడా తెలిసిందే. అంతేకాదు ఓం రౌత్ కొత్త మేకోవర్ తో కొత్త ప్రభాస్ ను చూపించబోతున్నట్టు మాత్రం అర్ధమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో ఆయన శరీరాకృతిని కొత్తగా చూపించబోతున్నామని... అలాగే విలు విద్య కూడా నేర్చుకోబోతున్నాడని డైరెక్టర్ చెప్పడం జరిగింది.
'ప్రభాస్ 22' టైటిల్ పోస్టర్ రిలీజ్
గత కొద్దినెలల ముందు అయితే ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అన్నట్టు.. ఒక్క అప్ డేట్ ఒకే ఒక్క ప్రభాస్ సినిమా అప్ డేట్ అంటూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసేవారు ప్రభాస్ ఫ్యాన్స్. అయినా కూడా కష్టంగా ఉండేది. అయితే ఈ మధ్య కాస్త పంథా మార్చారు. ప్రభాస్ 20 రాధేశ్యామ్ సినిమా అప్ డేట్ ఇచ్చిన దగ్గర నుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ ఫ్యాన్స్ కు కాస్త ఊరట కలిగిస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఎలాంటి హడావుడి లేకుండా ప్రభాస్ 22 సినిమా అప్ డేట్ ఇచ్చి షాకిచ్చారు.
`ప్రభాస్ 20` నెక్ట్స్ షెడ్యూల్ అప్‌డేట్...
`వర్షం`, `డార్లింగ్`... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌లోని ప్రేమికుడి కోణాన్ని ఆవిష్కరించిన చిత్రాలివి. ఆ తరువాత ప్రేమకథలకు దూరమైన ఈ లవబుల్ స్టార్... సుదీర్ఘ విరామం అనంతరం మరో ప్రణయగాథతో పలకరించబోతున్నాడు. అది కూడా ఓ పిరియాడికల్ లవ్ స్టోరీతో. 1970 నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఇటలీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా... `జిల్` రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
ప్రభాస్‌తో మరోసారి జట్టుకట్టనున్న ‘దిల్’ రాజు?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు కలిసొచ్చిన నిర్మాతల్లో ‘దిల్’ రాజు ఒకరు. గతంలో ఈ ఇద్దరి కలయికలో ‘మున్నా(2007), ‘మిస్టర్ పర్ ఫెక్ట్’(2011) వంటి విజయవంతమైన చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. కాగా... త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రానుందని సమాచారం.

సాంగ్ చిత్రీకరణలో "సాహో "
యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతున్న సాహో మూవీ ప్రపంచవ్యాప్తం గా ఆగస్ట్ 15వ తేదీ కానుంది. ప్రస్తుతం సాహో మూవీ సాంగ్స్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఆస్ట్రియా లో ఆల్ప్స్ పర్వత శ్రేణి వద్ద ఉన్న టైరోల్ స్టేట్ లో షూటింగ్ కు అనువుగా అతి సుందర ప్రదేశాలు ఉన్నాయి. టైరోల్ స్టేట్ క్యాపిటల్ సిటీ ఇన్స్ బర్క్.