ట్యాగ్ · 29 కథనాలు · పేజీ 2
మరోసారి గాయకుడి అవతారమెత్తుతున్న పవన్?

మరోసారి `గబ్బర్ సింగ్` జోడి?

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో #PSPK28
పవన్ కళ్యాణ్ కి జోడీగా పూజా హెగ్డే?

రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్?
'పింక్' రీమేక్ షూటింగ్ డేట్ కుదిరిందా..?
ఈ నెల 8 నుంచి `పవర్ స్టార్ 27` సెకండ్ షెడ్యూల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లోనే తొలిసారిగా ఓ పిరియాడిక్ ఫిల్మ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కి జోడీగా జాక్వలైన్ ఫెర్నాండెజ్, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. స్వరవాణి కీరవాణి బాణీలు సమకూర్చుతున్నాడు.
మరోసారి గాయకుడి అవతారమెత్తుతున్న పవన్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి నటుడు మాత్రమే కాదు మంచి గాయకుడు కూడా. `తమ్ముడు` చిత్రం కోసం `తాటి చెట్టు`, `ఏం పిల్ల` వంటి బిట్ సాంగ్స్ పాడి తనలోని గాయకుడ్ని పరిచయం చేసిన పవన్.. ఆపై `బై బయ్యే బంగారు రవణమ్మ` (ఖుషి), రావోయి మా ఇంటికి, నువ్వు సారా తాగుట (జానీ), కిళ్ళీ కిళ్ళీ (గుడుంబా శంకర్), పాపారాయుడు (పంజా), కాటమరాయుడా (అత్తారింటికి దారేది), కొడకా కోటేశ్వరరావా (అజ్ఞాతవాసి).. ఇలా మొత్తంగా తొమ్మిది సార్లు గొంతు సవరించుకుని అలరించాడు.

మళ్ళీ పోలీస్ స్టోరీతోనే.. పవన్, హరీష్ చిత్రం?
బ్లాక్ బస్టర్ మూవీ `గబ్బర్ సింగ్`(2012) తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం... ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

మరోసారి `గబ్బర్ సింగ్` జోడి?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కనువిందు చేసిన కథానాయికల్లో శ్రుతి హాసన్ ఒకరు. `గబ్బర్ సింగ్` (2012)లో తొలిసారి జోడీకట్టిన పవన్, శ్రుతి... ఆ చిత్రంతో బ్లాక్ బస్టర్ పెయిర్ అనిపించుకున్నారు. ఆ తరువాత ఈ ఇద్దరు `కాటమ రాయుడు` (2017) కోసం జట్టుకట్టారు. కాగా, స్వల్ప విరామం అనంతరం ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రానుందట.

మరోమారు.. పవన్ కళ్యాణ్, దేవిశ్రీ ప్రసాద్ కాంబో?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అచ్చొచ్చిన స్వరకర్తల్లో యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి మూడు చిత్రాలు `జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది` సంచలన విజయం సాధించాయి. నాలుగో సినిమాగా వచ్చిన `సర్దార్ గబ్బర్ సింగ్` ఆశించిన విజయం సాధించకపోయినా.. దేవిశ్రీ బాణీలు అలరించాయి.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో #PSPK28
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ కామెడీ మూవీ "గబ్బర్ సింగ్" 2012 వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. "గబ్బర్ సింగ్" మూవీ లో తన పెర్ఫార్మెన్స్ కు పవన్ కళ్యాణ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. దాదాపు 8సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో #PSPK28 మూవీ రూపొందనుంది.
పవన్ కళ్యాణ్ కి జోడీగా పూజా హెగ్డే?
హిందీనాట ఘనవిజయం సాధించిన `పింక్`... తమిళంలో `నేర్ కొండ పార్ వై` పేరుతో రీమేక్ అయి అక్కడా బ్లాక్ బస్టర్ బాట పట్టింది. అంతేకాదు.. ఇప్పుడా ఎమోషనల్ కోర్ట్ డ్రామా తెలుగులోనూ రీమేక్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ ఫిల్మ్ గా తెరకెక్కనున్న ఈ రీమేక్ కి `లాయర్ సాబ్` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. `దిల్` రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ బాట పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. `పింక్` రీమేక్ ని తన పునరాగమనానికి వేదికగా చేసుకున్న పవన్.. ఆపై టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా చేయబోతున్నారని సమాచారం. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నాటి కాలంలో సాగే ఈ పిరియాడికల్ ఫిల్మ్ లో పవన్.. రాబిన్ హుడ్ తరహా పాత్రలో దర్శనమిస్తారని తెలిసింది. అంటే.. అవినీతిపరులైన పెద్దల సొమ్మును కొట్టి పేదలకు సాయం చేసే దొంగగా పవర్ స్టార్ కనిపిస్తాడన్నమాట.
'పింక్' రీమేక్ షూటింగ్ డేట్ కుదిరిందా..?
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సంగతి కూడా విదితమే. మరి ఇప్పటికీ కన్ఫ్యూజన్ వున్న ఈ సినిమా ప్రారంభంపై ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. తాజా సమాచారం మేరకు ఈ నెల 20 నుండి సినిమా రెగ్యులర్ షూట్ మొదలవుతుందని తెలుస్తోంది. పవన్ కూడా త్వరలోనే చిత్రీకరణలో పాల్గొననున్నారట. ఒకపక్క రాజకీయాల్లో కూడా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ ఈ సినిమా కోసం కొద్దిరోజులు మాత్రమే కేటాయించడంతో దర్శక నిర్మాతలు కూడా అందుకు…