కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nani Latest News

ట్యాగ్ · 72 కథనాలు · పేజీ 4

Natural Star Nani Begins Shoot Of Ante Sundariniki Movie Without Media Buzz,Telugu Filmnagar,Telugu Film News 2021,Natural Star Nani,Actor Nani,Hero Nani,Nani,Nani Movies,Nani Latest News,Nani New Movie,Nani Latest Movies,Nani Next Movie,Nazriya Nazi
సినిమా వార్తలు

'అంటే సుందరానికి' - సైలెంట్ గా స్టార్ట్ చేసిన నాని

న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్ లో పెట్టి ప్రస్తుతం షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను... సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అన్ని పనులు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. కరోనా ప్రభావం ఎక్కువగా లేకపోతే ఈసినిమా ఏప్రిల్ 23న రిలీజ్ అయ్యేది.

TFN Adminవాట్సాప్
Nani Makes A Fun Take On His Fan Greetings On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nani Receives A Heart Warming Note From A Pretty Airhostess,Jokes It Made Him Feel
సినిమా వార్తలు

అఫీషియల్ గా ఓల్డ్ అయ్యా

అఫీషియల్ గా ఓల్డ్ అయ్యా అనే ఫీలింగ్ వస్తుంది అంటున్నారు న్యాచురల్ స్టార్ నాని. దీనికి కారణం ఏంటనుకుంటున్నారా ఒక ఎయిర్ హోస్టెస్. రీసెంట్ గా నాని గోవా నుండి హైద్రాబాద్ వస్తుండగా తను ఎక్కిన ఫ్లైట్ లో ఒక ఎయిర్ హోస్టెస్ అభిమానంతో ఒక చిన్న లెటర్ ఇచ్చింది. అందులో నాని గారు నేను చిన్నప్పుటినుండి మీ సినిమాలు చూస్తూ పెరిగాను.. మీరు చాలా గొప్ప యాక్టర్.. నాతరువాత ఒక చిన్న లవ్ టోకెన్ అంటూ లెటర్ లో పేర్కొంది. ఇక ఈ లెటర్ ను నాని సోషల్ మీడియాలో పోస్ట్ ఇలాంటిది మనకు ఎవరైనా ఇస్తే ఎలా ఉంటుంది.. అది కూడా ఒక అందమైన ఎయిర్ హోస్టెస్.. దీనిబట్టి నేను అఫీషియల్ గా ఓల్డ్ అయ్యాననిపిస్తుంది అంటూ చమత్కరించాడు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

హిందీ 'జెర్సీ' షూటింగ్ పూర్తి

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. జెర్సీ సినిమాలో అర్జున్ పాత్రలో నాని చేసిన నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. క్రికెట్‌ను వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగం పోయి పనిపాటా లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ.. ఆ తర్వాత కొడుకు కోసం క్రికెట్ ఆడటం సినిమా మొత్తం ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
Natural Star Nani Sports Drama Jersey Movie To Feature At International Film Festival
సినిమా వార్తలు

నాని 'జెర్సీ' కి అరుదైన ఘనత - భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఎంపిక

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఓ క్రికెటర్ తన ఆటను మెరుగు పరచుకొని ఏ విధంగా గెలుపు సాధించాడు. జీవితంలో అతను ఓడి ఎలా గెలిచాడు అనేదే ఈ సినిమా కథ. 2019 ఏప్రిల్ 19న విడుదలైన ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో నాని నటన అయితే కంటతడి పెట్టిస్తుంది. నాచ్యురల్ స్టార్.. ఈ సన్నివేశాన్ని అయినా సహజంగా నటించగలడు.. ఇక ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాల్లో నాని చేసిన నటన అద్భుతం. నానికి కొడుకుగా చేసిన రోనిత్ కూడా చాలా బాగా నటించాడు. సత్యరాజ్, రావు రమేష్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తెలంగాణ యాసలో నాని..!

వరుస సినిమాలను కమిట్ అవుతూ ఫుల్ బిజీ అవ్వనున్నాడు న్యాచురల్ స్టార్ నాని. వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఒక్కసారి లాక్ డౌన్ కనుక తీసేస్తే షూటింగ్ లతో బిజీ కానున్నాడు. ఇప్పటికే ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమా చేసాడు. సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితీరావ్‌ హైదరీ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా లాక్ డౌన్ వల్ల ఆగింది. ఆ సినిమా చేస్తూనే నానితో ‘నిన్ను కోరి ' తెరకెక్కించిన శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ రీతూవర్మ తో పాటు మరో హీరోయిన్ గా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. ఆతర్వాత 'టాక్సీవాలా' సినిమా…

TFN Adminవాట్సాప్
Natural Star Nani To Speak Telangana Dialect In His Upcoming Movie
సినిమా వార్తలు

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నాని మూవీ

హీరో నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత "టాక్సీవాలా " మూవీ ఫేమ్ రాహుల్, "బ్రోచేవారెవరురా " మూవీ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించే చిత్రాలలో నాని నటించనున్నారు. నాని ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నాని రక్తదానం

తలసేమియా పేషేంట్స్ కు బ్లడ్ అవసరం చాలా ఎక్కువ అనే విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని బ్లడ్ బ్యాంక్స్ లో బ్లడ్ స్టాక్ తక్కువగా ఉంది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో బ్లడ్ డొనేట్ చేయడానికి డోనర్స్ జంకుతున్నారు. ఈ సమయంలో హీరో నానితన భార్యతో సహా ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ కు వెళ్ళి బ్లడ్ డొనేట్ చేశారు. బ్లడ్ డొనేట్ చేయడానికి భయపడే వారికి ప్రేరణ గా నిలిచిన హీరో నానికి సెల్యూట్ అంటూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ట్వీట్ చేసింది.

Team TFNవాట్సాప్
Natural Star Nani Performance Going To The Key Highlights For Shyam Singha Rao
సినిమా వార్తలు

నాని ‘ట‌క్ జ‌గ‌దీష్‌’, ‘శ్యామ్ సింగ్ రాయ్‌’ అప్ డేట్స్

ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నాని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒక‌టి ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ కాగా... మ‌రొక‌టి ‘శ్యామ్ సింగ్ రాయ్’. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ రూపొందిస్తున్న ‘ట‌క్ జ‌గ‌దీష్‌’కు సంబంధించి ఇప్ప‌టికే కొంత‌మేర చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. కాగా, జూన్ 6వ తేదీ నుంచి త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా... సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Natural Star Nani Takes Up Another Experimental Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Nani,Natural Star Nani,Nani Latest News,Natural Star Nani New Movie News,Nani Upcoming Film Updates
సినిమా వార్తలు

ప్రయోగాత్మక చిత్రం లో నాని ?

విభిన్న కథా చిత్రాలు ఎంపిక చేసుకుని విజయపథం లో దూసుకుపోతున్న న హీరో నాని ఇప్పుడు ఒక ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని నెగటివ్ రోల్ లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్" మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

నాని 'V' షూటింగ్ పూర్తి

మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'V'. గతకొద్ది రోజుల ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సుధీర్ బాబు , నివేత థామస్, అదితి రావు హైదరి ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీన రిలీజ్ కానుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ నిన్నటి తో పూర్తి చేసుకుంది. ఈ చిత్ర షూటింగ్ నిన్నటితో మొత్తం పూర్తయిందని నాని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

గోదావ‌రి నేప‌థ్యంలో నాని, శివ చిత్రం?

`నిన్ను కోరి` వంటి స‌క్సెస్ ఫుల్ మూవీ త‌రువాత నేచుర‌ల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. `పెళ్ళి చూపులు` ఫేమ్ రీతూ వ‌ర్మ నాయిక‌గా న‌టించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మించ‌నున్నారు.

Team TFNవాట్సాప్
Natural Star Nani About his Character in Gang Leader,Nani – A Dedicated Actor And A Thorough Entertainer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Nani Latest News,Natural Star Nani New Movie News,Actor
సినిమా వార్తలు

కామిక్ రివెంజ్ డ్రామా

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన కామిక్ రివెంజ్ డ్రామా NANI'S గ్యాంగ్ లీడర్ మూవీ రేపు (13వ తేదీ) రిలీజ్ కానుంది. హీరో కార్తికేయ విలన్ గా నటించడం ఆసక్తికర విషయం. సీనియర్ నటి లక్ష్మి, శరణ్య, ప్రియాంక అరుళ్ మోహన్, శ్రీయా రెడ్డి, ప్రాణ్య లేడీస్ గ్యాంగ్ గా నటించగా నాని గ్యాంగ్ లీడర్ గా నటించారు. హీరో నాని సపోర్ట్ తో ఒకరితో ఒకరికి రిలేషన్ లేని ఈ గ్యాంగ్ ప్రతినాయకుడు (కార్తికేయ )పై ప్రతీకారం తీర్చుకొనే కథ తో ఈ మూవీ రూపొందింది.

Team TFNవాట్సాప్

షేర్