
ట్యాగ్ · 9 కథనాలు


సెన్సార్ పూర్తి చేసుకున్న 'సన్ ఆఫ్ ఇండియా'..!

'సన్ ఆఫ్ ఇండియా' ట్రైలర్ రిలీజ్

మోహన్‌బాబు 'సన్ ఆఫ్ ఇండియా' రిలీజ్ డేట్ ఫిక్స్

ట్రెండింగ్ లో మోహన్ బాబు బర్త్ డే సీడీపీ
బ్లాక్ బస్టర్ "పెదరాయుడు "

చిరంజీవితో బాండింగ్ పై కలెక్షన్ కింగ్ కామెంట్స్
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంటుందనేది అందరూ అనుకుంటూనే ఉంటారు. వారిద్దరూ మాములుగా మాట్లాడుకున్నా సరే ఏదో ఒక చర్చ నడుస్తుంటూనే ఉంటుంది. అంతేకాదు పలుమార్లు మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. మేమిద్దరం స్నేహితులం అని చెప్పడానికి ఫొటోలు ఇంకా సంభాషణల ద్వారా చూపించినా కూడా ఇంకా ఎక్కడో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న అభిప్రాయంతోనే చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు.

మోహన్ బాబు 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ రివ్యూ
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఇలాంటి జోనర్స్ అందరూ చూడాలంటే కొంచం కష్టమే ముఖ్యంగా యూత్ కి. అయితే ఫ్యాన్స్.. ఇలాంటి సినిమాలను ఇష్టపడే వారికి ఖచ్చితంగా ఈసినిమా నచ్చుతుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సన్ ఆఫ్ ఇండియా'..!
'కలెక్షన్ కింగ్' మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలు, ఎన్నో పాత్రలు చేశారు. కేవలం హీరోగా మాత్రమే కాదు.. విలన్ గా పలు పాత్రలు చేశారు. అంతేకాదు నిర్మాతగా పలు సినిమాలు కూడా నిర్మించారు. ఇక గతకొంతకాలంగా హీరోగా సినిమాలు చేయకపోయినా.. పలు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఇప్పుడు మరోసారి ఆయన ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తుంది. మోహన్ బాబు ప్రధాన పాత్రలో రత్నబాబు దర్శకత్వంలో సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా చేస్తున్నాడు.

'సన్ ఆఫ్ ఇండియా' ట్రైలర్ రిలీజ్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా సినిమాలు చేసి చాలా కాలమైంది. అయితే పలు సినిమాల్లో కొన్ని కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో రత్నబాబు దర్శకత్వంలో సన్ ఆఫ్ ఇండియాఅనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక దీనిలో భాగంగానే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మోహన్‌బాబు 'సన్ ఆఫ్ ఇండియా' రిలీజ్ డేట్ ఫిక్స్
మళ్లీ ఇండస్ట్రీలో సందడి మొదలైంది. ఒకరి తరువాత ఒకరు వరుసపెట్టి సినిమా రిలీజ్ డేట్లను ప్రకటించేస్తున్నారు. పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు ఎలాగూ ఫిక్స్ అయిపోవడంతో చిన్న సినిమాలు.. మినిమం బడ్జెట్ సినిమాలు కూడా చాలా జాగ్రత్తగా సినిమా రిలీజ్ డేట్లను ఎంపిక చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఎన్నో రోజుల నుండి పెండింగ్ లో ఉన్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. మోహన్ బాబు ప్రధాన పాత్రలో రత్నబాబు దర్శకత్వంలో సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ కూడా రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ సినిమా గ్లింప్స్ ని కూడా గతంలో రిలీజ్ చేశారు.

'అఖండ' పై కలెక్షన్ కింగ్ ప్రశంసలు
కరోనా తరువాత కూడా మంచి సక్సెస్ రేటు ఉన్న సిని పరిశ్రమ ఏదైనా ఉంది అంటే అది టాలీవుడ్ అని చెప్పొచ్చు. కరోనా సమయంలో అన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా మనవాళ్లు ఎక్కడా తగ్గకుండా కాస్త పరిస్థితులు మెరుగుపడగానే సినిమాలు పూర్తి చేసుకున్నారు.. రిలీజ్ లు చేశారు. ఇంకా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. మన తెలుగు ప్రేక్షకులు కూడా సినిమా అంటే అంతే ప్రేమతో ఉంటారు. తెలుగు సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ విషయంలో అది మరోసారి రుజువు చేశారు. ఈ సినిమా కూడా ఇండస్ట్రీకి మరింత బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు.

ట్రెండింగ్ లో మోహన్ బాబు బర్త్ డే సీడీపీ
హీరో , విలన్ , కామెడీ విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన మోహన్ బాబు విలక్షణ నటుడు , కలెక్షన్ కింగ్ గా పేరుపొందారు. ఈ రోజు మోహన్ బాబు తన 69 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అద్భుతమైన డైలాగ్ డెలివరీ , పెర్ఫార్మెన్స్ తో నాలుగున్నర దశాబ్దాలుగా మోహన్ బాబు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. 500 మూవీస్ కు పైగా నటించిన మోహన్ బాబు "పద్మశ్రీ "అవార్డ్ అందుకున్నారు.
బ్లాక్ బస్టర్ "పెదరాయుడు "
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ , భానుప్రియ , సౌందర్య ప్రధాన పాత్రలలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "పెదరాయుడు "మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో మోహన్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. పెదరాయుడు తండ్రి పాపారాయుడు పాత్రలో రజనీకాంత్ తన మేనరిజమ్స్ , స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
'పెదరాయుడు'.. మోహన్ బాబు-రాజా రవీంద్ర కామెడీ సీన్
రజనీకాంత్, మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 'పెదరాయుడు' ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో.. ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలెక్షన్ల పరంగానూ కలెక్షన్ కింగ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మోహన్ బాబు సినీ కెరీర్లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. పెదరాయుడిగా మోహన్ బాబు గారి నటన ఒక స్థాయి లో ఉంటే, పాపారాయుడిగా రజనీకాంత్ గారి నటన ఈ సినిమాను మరోస్థాయిలో నిలిపాయి.