ట్యాగ్ · 9 కథనాలు

ఇద్దరు సూపర్ స్టార్లు సేమ్ టు సేమ్
మహేష్ బాబు స్మార్ట్ లుక్
ఇంట్లో లేకపోతే 'మహేష్' అక్కడే.. నమ్రతా
మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్ రికార్డ్

ఎన్టీఆర్ కు మహేష్ ఛాలెంజ్..!
ప్లాస్మా డొనేషన్ పై మహేష్ పిలుపు
మరో చిన్నారికి తోడుగా మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నారులకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పటికే వెయ్యికి పైగా గుండె ఆపరేషన్ లు చేయించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఇక ఇప్పుడు మరోచిన్నారికి తోడుగా నిలబడి సాయం అందించారు. మహేష్ కుటుంబం ప్రముఖ ఆంధ్రప్రదేశ్ యాజమాన్యంతో కలిసి చిన్నపిల్లలకు ఆపరేషన్ లు చేయిస్తున్నసంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే గుండె సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరిన ఓ చిన్నారి అంకిత్ భార్గవ్‌కు మహేష్ ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో అతడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ మహేశ్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు.

ఇద్దరు సూపర్ స్టార్లు సేమ్ టు సేమ్
తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. తెలుగు వెండి తెరపై కృష్ణ చేసిన ప్రయోగాలు మరే హీరో చేయలేదంటే అతిశయోక్తి కాదు. తెలుగులో మొదటి 70 ఎమ్ఎమ్ సినిమా... `మోసగాళ్లకు మోసగాడు` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కౌబాయ్‌ని పరిచయం చేశారు. ఇంకా జేమ్స్ బాండ్ చిత్రాలతో పాటు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి రికార్డు సాధించారు.
లైన్ ప్రొడ్యూసర్ గోపీకృష్ణ కు మహేష్ బాబు అభినందనలు
టాలీవుడ్ లైన్ ప్రొడ్యూసర్ , ఫారిన్ షూట్ కో- ఆర్డినేటర్ గోపీకృష్ణ నర్రావుల కు సూపర్ స్టార్ మహేష్ బాబు అభినందనలు తెలిపారు. "బజార్ రౌడీ "(1988 ) మూవీ తో లైన్ ప్రొడ్యూసర్ గా మారిన గోపికృష్ణ మహేష్ బాబు నటించిన అనేక సూపర్ హిట్ మూవీస్ కు పని చేశారు . చిరంజీవి (సైరా నరసింహా రెడ్డి ), పవన్ కళ్యాణ్ (గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది ), ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో ), ప్రభాస్ (మిర్చి ) మూవీస్ కు వర్క్ చేశారు.
మహేష్ బాబు స్మార్ట్ లుక్
బాలనటుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన మహేష్ బాబు సూపర్ హిట్ "రాజకుమారుడు " మూవీ తో హీరోగా మారి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న "సర్కారు వారి పాట "మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక మహేష్ బాబు "సర్కారు వారి పాట "మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.
ఇంట్లో లేకపోతే 'మహేష్' అక్కడే.. నమ్రతా
సూపర్‌స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డాన్ లో మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి చెప్పినట్టు నమ్రత గతంలో ఎప్పుడూ చెప్పింది లేదు. ఎప్పుడో ఒకసారి వారికి సంబంధించిన పోస్ట్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. కానీ ఇప్పుడు రోజుకో పోస్ట్ అయినా అభిమానులతో పంచుకుంటున్నారు. లేటెస్ట్ గా తీసిన పిక్స్ వీడియోస్ తో పాటు త్రోబ్యాక్ పిక్స్, వీడియోస్ ఇలా అన్నీ పోస్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మహేష్ గురించి మరో ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు.
మహేష్ బాబు ఫ్యాన్స్ ట్విట్టర్ రికార్డ్
బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా దూసుకుపోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న తన బర్త్ డే ను జరుపుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నివారణ నేపథ్యం లో తన బర్త్ డే వేడుకలు జరపొద్దని మహేష్ బాబు అభిమానులను కోరారు. దీంతో మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా లో మహేష్ బాబు బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ను భారీగా ట్రెండ్ చేశారు.

ఎన్టీఆర్ కు మహేష్ ఛాలెంజ్..!
మొత్తానికి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ పుట్టినరోజు అయిపోయింది. ఈ సందర్భంగా మహేష్ కోరిక మేరకు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తమ తఢాకా చూపించారు. తన పుట్టిన రోజు సందర్భంగా మహేష్ ' సర్కారు వారి పాట' సినిమా నుండి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి గిఫ్ట్ ఇవ్వగా.. ఫ్యాన్స్ కూడా మహేష్ కు గిఫ్ట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో మహేష్ బాబు పుట్టిన రోజు హ్యాష్ టాగ్ ను వైరల్ చేశారు. ఈ ట్యాగ్ ట్రెండ్ అవ్వడంతో పాటు.. వరల్డ్ రికార్డుని క్రియేట్ చేసింది. ఇండియా వైడ్‌గా కాకుండా ఏకంగా వరల్డ్ ట్రెండ్స్‌లో మహేష్ బాబు బర్త్‌డే హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది…
'సర్కారు వారి పాట' మోషన్ పోస్టర్ రిలీజ్
తన పుట్టిన రోజు వేడుకలు చేయొద్దని ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరిచినా తన కొత్త సినిమా సర్కారు వారి పాట సినిమా అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను కుష్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన తండ్రి సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసాడు. మహేష్ లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్‌తో స్టైలిష్‌గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ముందెప్పుడూ చూడని మాస్ లుక్‌తో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.
ప్లాస్మా డొనేషన్ పై మహేష్ పిలుపు
కరోనా మహమ్మారిని జయించిన వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకురావాలని సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా మద్దతు పలుకుతూ వారు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన చేపడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేసి ఇతరుల ప్రాణాలను రక్షించాలని మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సెలబ్రిటీస్ ఇప్పటికే స్పందించి ప్లాస్మా డొనేషన్ చేయాలని కోరారు. ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ కూడా ప్లాస్మా డొనేషన్ పై పిలుపనిచ్చారు.