
ట్యాగ్ · 9 కథనాలు

బాలు విషయంలో నేషనల్ మీడియాపై హరీష్ కౌంటర్
బాలుకు నయన్ నివాళి..నమ్మడానికి కష్టంగా ఉంది
ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు పూర్తి
లెజెండరీ సింగర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
బాలు రాసిన లేఖ - నా పేరు ముందు అవి వద్దు
ఎస్పీ బాలుకి సినీ ప్రముఖుల సంతాపం
గాన గంధర్వుడు ఎస్పీ బాలు కన్నుమూత

ఎస్పీ బాలుకి కరోనా పాజిటివ్..!

ఎస్పీ బాలు కి 'మ్యూజికల్ ట్రిబ్యూట్'
కరోనా వల్ల తెలుగు పరిశ్రమ ఎంతో మంది ప్రముఖులను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక అన్నింటికంటే పెద్ద నష్టం లెజెండరీ సింగర్ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూయడం. ఎస్పీ బాలు లాంటి సింగర్ లేరు ఇక ముందు కూడా అలాంటి సింగర్ రావడం అనేది అసాధ్యం. భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన పాటలు మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాయి.
బాలు విషయంలో నేషనల్ మీడియాపై హరీష్ కౌంటర్
కరోనా కారణంగా ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన బాలు చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యా హ్నం 1:04 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇక నేడు తిరువళ్ళూరు జిల్లా తామరైపాక్కం ఫాం హౌజ్‌లో అంత్య క్రియలు నిర్వహించారు.
బాలుకు నయన్ నివాళి..నమ్మడానికి కష్టంగా ఉంది
తెలుగు సినీ ప్రేక్షకులను తన గాత్రంతో ఆరు దశాబ్దాలుగా అలరిస్తూ.. గాయకుడిగా ఎన్నో శిఖరాలని అధిరోహించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తిరిగి రాని లోకాలకు వెళ్ళారు. ఆయన సినీ ప్రయాణంలో తెలుగు, మలయాళ, తమిళం ఇలా దాదాపు 16 భాషలల్లో 45 వేలకు పైగా పాటలు పాడి బాలు లాంటి మరొక సింగర్ లేరు ఇకపై రారు అనేంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఏ హీరోకు తగినట్టు ఆ హీరోకు పాటలు పాడటం.. పాటలో మాడ్యులేషన్స్.. హీరోనే ఆ పాట పాడుతున్నాడా అనేలా ఉండటం.. ఇలా ఒకటేమిటి బాలును గాన గంధర్వుడిగా చేసిన క్వాలిటీస్ ఎన్నో. అలాంటి గాయకుడు ఇప్పుడు మన మధ్య లేరనే వార్త సినీ ఇండస్ట్రీస్ ను మాత్రమే కాదు ప్రతి…
ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు పూర్తి
కరోనా కారణంగా ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన బాలు చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక బాలు మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ప్రతి ఒక్కరూ బాలుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. బాలు మరణంతో ఒక శకం ముగిసిందని... గాంధర్వ లోకానికి వెళ్లారని.. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయిందని అందరూ గుర్తుచేసుకుంటున్నారు.
లెజెండరీ సింగర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
ఎస్ పి బి , బాలు అని సంగీతాభిమానులు ముద్దుగా పిలుచుకునే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు జిల్లా కొనేటమ్మ పేట విలేజ్ లో 1946 సంవత్సరం జూన్ 4 వ తేదీ జన్మించారు. చిన్న వయసు లోనే మ్యూజిక్ పట్ల బాలు ఆసక్తి పెంచుకున్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న టైమ్ లో అనేక పాటల పోటీలలో పాల్గొని అవార్డ్స్ అందుకున్నారు. సంగీత దర్శకుడు ఎస్ పి కోదండపాణి , సింగర్ ఘంటసాల జడ్జీలు గా జరిగిన పాటల పోటీ లో బాలు బెస్ట్ సింగర్ గా ఎంపిక అయ్యారు.
బాలు రాసిన లేఖ - నా పేరు ముందు అవి వద్దు
గాన గంధర్వుడు నిజంగానే గాంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎంతో మంది ప్రార్థనలు చేశారు. ఇన్ని రోజులు హాస్పిటల్ లో పోరాటం చేసిన బాలు మాత్రం ఈ రోజు తుది శ్వాస విడిచారు. నిజంగానే సినీ సంగీత ప్రపంచానికి ఈ రోజు చీకటి రోజే. తన గాత్రంతో ఎంతో మందిని మంత్ర ముగ్దుల్ని చేసిన బాలు మరణంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఇక ఆయన జ్జాపకాలను అంతా నెమరు వేసుకుంటున్నారు.
ఎస్పీ బాలుకి సినీ ప్రముఖుల సంతాపం
ఎస్పీ బాలు మరణంతో భారతీయ సినీ సంగీతం తమ ముద్దు బిడ్డను కోల్పోయింది. ఇన్నేళ్ల సినీ చరిత్రలో ఘంటసాల తర్వాత అంతటి స్థాయిలో ఎవరైనా గాయకుడు ఉన్నాడంటే అది కేవలం ఒక్క బాలు మాత్రమే. కరోనాతో దాదాపు 50 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన బాలు ఈ రోజు మధ్యాహ్నాం 1.04ని.లకు కన్నుమూసారు. ఇక రేపు సాయంత్రం బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చెన్నై తిరువళ్లూరు జిల్లాలో రెడ్ హిల్స్ సమీపంలో ఉన్న తామరైపాకంలో బాలు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక బాలు మృతితో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు బాలు మృతికి సంతాపం తెలుపుతున్నారు.
గాన గంధర్వుడు ఎస్పీ బాలు కన్నుమూత
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆగష్ట్ 5న కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన బాలు ఆరోగ్య పరిస్థితులు అప్పటినుండి బాలేదనే చెప్పొచ్చు. ఇటీవల కరోనా నెగిటివ్ వచ్చినా కూడా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీనితో నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు గురువారం ప్రకటించిన ఎంజీఎం వైద్యులు నేడు తుది శ్వాస విడిచినట్లు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఎస్పీ బాలు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఇక బాలు మరణంతో సినీ ప్రముఖులతో పాటు పలువురు సంతాపం తెలియచేస్తున్నారు.

ఎస్పీ బాలుకి కరోనా పాజిటివ్..!
ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కూడా రిస్క్ అని చెప్పి షూటింగ్ లకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు టాలీవుడ్ సెలబ్రిటీస్. ఏదో ఒకటి రెండు సినిమాలు మాత్రం షూటింగ్ జరుపుకున్నాయి. అయితే షూటింగ్ లకు వెళ్లకపోయినా కూడా సెలెబ్రిటీస్ మాత్రం కరోనా బారిన పడుతున్నారు.