
ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 112


జర్నీ ఆఫ్ విశ్వం- రిలీజ్ టైమ్ ఫిక్స్

ఓవర్సీస్ లో శివం భజే గ్రాండ్ రిలీజ్

మైత్రీ చేతిలో శివం భజే నైజాం రైట్స్

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రత్యేక సినిమాగా నిలుస్తుంది

చాలా సర్‌ప్రైజ్ అయ్యా - తనికెళ్ల భరణి

రాయన్ పై ప్రశంసలు కురిపించిన మహేష్ బాబు

శివం భజే సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?

ది గోట్ థర్డ్ సింగిల్ అప్డేట్

ఆయ్ రిలీజ్ డేట్ అదే

రాయన్ 3డేస్ కలెక్షన్స్

థగ్ లైఫ్- కమల్ డబ్బింగ్ షురూ

కన్నప్ప.. చెంచుల మహారాణిగా మధుబాల

రాజా సాబ్.. ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ రిలీజ్

35 నుండి అరుణ్ శర్మ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

పరదా లో ఆకట్టుకుంటోన్న సంగీత ఫస్ట్ లుక్
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే 'టిల్లు స్క్వేర్' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో అప్పుడే ఆమె తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రారంభించేసింది. ఈ సినిమాకు 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో మరో ప్రముఖ మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్ తొలిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

జర్నీ ఆఫ్ విశ్వం- రిలీజ్ టైమ్ ఫిక్స్
టాలీవుడ్ మ్యాచో గోపీచంద్ ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా సరైన హిట్ మాత్రం దక్కడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే భీమా సినిమాతో వచ్చాడు కానీ భీమా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా విశ్వం. మాస్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.

ఓవర్సీస్ లో శివం భజే గ్రాండ్ రిలీజ్
అశ్విన్ బాబు హీరోగా రాబోతున్న మోస్ట్ ఎగ్జైటింగ్ సినిమా శివం భజే. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఇప్పటివరకూ వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. పాటలకి, ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన లభించడం.. ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలు క్యూరియాసిటీ ని పెంచాయి. దీంతో ఈసినిమా అశ్విన్ బాబుకు హిట్ ను ఇస్తుందనే అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి.

కళ్యాణ్ రామ్ సినిమా క్లైమాక్స్.. 1,000 మంది ఆర్టిస్టులతో
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అందులోనూ రెగ్యులర్ టైపు కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఆయన ఆసక్తి చూపుతుంటారు. రెండేళ్ల క్రితం 'బింబిసార' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయారు. దాని తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన 'అమిగోస్', 'డెవిల్' ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.

దేవర సెకండ్ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఇప్పటివరకూ ఎన్టీఆర్ నుండి సినిమా రాలేదు. దీంతో ఎన్టీఆర్ ను వెండితెరపై ఎప్పుడు చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తిచేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తయింది. మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. పవర్ ఫుల్ గా ఉన్న ఈ సాంగ్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అందరూ సెకండ్ సాంగ్ గురించి ఈగర్ వెయిట్ చేస్తున్నారు.

మైత్రీ చేతిలో శివం భజే నైజాం రైట్స్
రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా శివం భజే. అప్సర్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రత్యేక సినిమాగా నిలుస్తుంది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లిస్ట్ లో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా గురించి హరీష్ శంకర్ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తూనే ఉన్నారు.. ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తాజాగా మరోసారి ఈసినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

చాలా సర్‌ప్రైజ్ అయ్యా - తనికెళ్ల భరణి
ప్రముఖ టాలీవుడ్ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం దక్కింది. 800కు పైగా చిత్రాల్లో నటించడంతోపాటు 52 సినిమాలకు మాటలను అందించి రచయితగా పనిచేసిన భరణి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్నో అవార్డులను అందుకున్నారు. ‘సముద్రం’ సినిమాలో నటనకు గానూ ఉత్తమ విలన్‌గా, ‘నువ్వు నేను’ సినిమాలోని నటనకు ఉత్తమ క్యారెక్టర్ నటునిగా, ‘గ్రహణం’తో ఉత్తమ నటునిగా, ‘మిథునం’ సినిమాకు గాను ఉత్తమ రచయిత మరియు ఉత్తమ దర్శకునిగా అయిదు నంది అవార్డులను గెలుచుకున్నారు.

రాయన్ పై ప్రశంసలు కురిపించిన మహేష్ బాబు
కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం 'రాయన్'. ఇది ధనుష్ 50వ చిత్రం కావడం, అందునా ఆయనే దర్శకత్వం వహించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జులై 26న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఇక రాయన్ చిత్రాన్ని తమిళంలో సన్ పిక్చర్స్ నిర్మించగా.. తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి గ్రాండ్‌గా విడుదల చేసింది. సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది.

తుఫాన్ స్నీక్ పీక్.. విజిల్స్ వేయించిన విజయ్ ఆంటోని
కోలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'తుఫాన్'. తమిళంలో 'మరయ్ పిడిక్కత్త మనిథన్'గా తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో తుఫాన్ పేరుతో విడుదల చేస్తున్నారు మేకర్స్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రచనతో పాటు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించాడు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి. లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్న తుఫాన్ ఆగస్టు 2న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.

శివం భజే సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'శివం భజే'. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‍గా నటిస్తోంది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్ట్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది.

ది గోట్ థర్డ్ సింగిల్ అప్డేట్
కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ లియో తరువాత దళపతి విజయ్ నటిస్తున్నసినిమా ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం).ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.ఇప్పటివరకు ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరెండు పాటలను విజయే పాడాడు.ఇక త్వరలోనే థర్డ్ సింగిల్ కూడా రానుంది.ఆగస్టు 1న ఈ సాంగ్ గురించి అప్డేట్ ఇవ్వనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన అర్చన కల్పాతి తెలియజేశారు.

ఆయ్ రిలీజ్ డేట్ అదే
మ్యాడ్ తో హిట్ అందుకున్న యంగ్ హీరో నార్నె నితిన్ నుండి వస్తున్న రెండో సినిమా ఆయ్.గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫన్ మూవీ గా తెరకెక్కుతుంది.ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.వీటికి తోడు గీతా ఆర్ట్స్ నుండి వస్తున్న సినిమాకావడంతో హైప్ క్రీయేట్ అయ్యింది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం అనుమానాలను రేకెత్తించింది.ఆగస్టు 15న విడుదలకానుందని ముందే అనౌన్స్ చేశారు.కానీ అదే రోజు డబుల్ ఇస్మార్ట్,మిస్టర్ బచ్చన్ కూడా దిగుతుండడంతో ఆయ్ వెనక్కివెళ్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

రాయన్ 3డేస్ కలెక్షన్స్
ధనుష్ రాయన్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 75.42కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ దిశగా సాగుతుంది.తమిళనాడులో మొదటి రెండు రోజుల కన్నా నిన్న అత్యధిక వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.ఈవారంలో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.సార్ తరువాత ధనుష్ ఈసినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.ఇందులో నటించడం మాత్రమే కాదు తనే డైరెక్షన్ కూడా చేశాడు.ఇది ధనుష్ కు 50వ సినిమా కూడా.

థగ్ లైఫ్- కమల్ డబ్బింగ్ షురూ
విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ముందుగా కల్కి2898AD సినిమాలో సుప్రీం యాస్కిన్ గా కనిపించి అదరగొట్టాడు. సినిమాలో కనిపించింది తక్కువ సేపే అయినా, ఆ ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉంటుంది. రీసెంట్ గా ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్ కు ముందు ఈసినిమాపై ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను రిచ్ కాలేకపోయింది ఈసినిమా. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

కన్నప్ప.. చెంచుల మహారాణిగా మధుబాల
ట్యాలెంటెడ్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఒకప్పటి బ్లాక్ బస్టర్ ‘భక్త కన్నప్ప’ కు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ మూవీపై అంచనాలను పెంచేసింది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు నటిస్తుండటం విశేషం.

రాజా సాబ్.. ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ రిలీజ్
'కల్కి 2898 AD' సినిమాతో ఇటీవలే ప్రేక్షకులముందుకు వచ్చాడు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని చరిత్ర సృష్టించింది. విడుదలై నెల దాటినా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే అంతకుముందు వచ్చిన 'సలార్' మూవీతో దాదాపు రూ. 800 కోట్లు కొల్లగొట్టాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్స్ అందించాడు.

డబుల్ ఇస్మార్ట్ నుండి క్యా లఫ్డా ఫుల్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నుండి రాబోతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ డబుల్ ఇస్మార్ట్. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి కారణం ఈసినిమా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తుండటమే. ఇక అంచనాలకు తగ్గట్టుగా ఇప్పటికే వచ్చిన అప్ డేట్లు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఆగష్ట్ 15 వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

35 నుండి అరుణ్ శర్మ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్
నంద కిషోర్ ఈమాని దర్శకత్వంలో నివేధా థామస్ పాత్రలో వస్తున్న సినిమా 35-చిన్న కథ కాదు. ఇందులో నివేదా థామస్ ఓ మధ్య తరగతి గృహిణి పాత్రలో కనిపిస్తోంది. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

ఓదెల 2- బోనాల స్పెషల్ గా తమన్నా పోస్టర్ రిలీజ్
ఈ సినిమాలో తమన్నా శివశక్తి అనే పాత్రలో.. మహదేవ్‌కు పరమభక్తురాలిగా కనిపించనుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ఓదెల 2 షూటింగ్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాశీలో మొదలుపెట్టారు.ఇక గతకొద్ది రోజులుగా నిర్విరామంగా షూటింగ్ ను జరుపుతున్నారు మేకర్స్. ప్రస్తుతం అయితే రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓదెల మల్లన్న టెంపుల్ సెట్ లో క్లైమాక్స్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. తమన్నా ఇంకా ఇతర కీలక పాత్రలతో పాటు దాదాపు 800 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ షూట్ లో పాల్గొంటున్నట్టు సమాచారం.