సంక్రాంతి విన్నర్ సంక్రాంతికి వస్తున్నాం వారం రోజుల్లోనే 200కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.రీజినల్ మూవీ గా వచ్చి అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.ఇక వీక్ డేస్ లోకూడా ఈసినిమా స్ట్రాంగ్ హోల్డ్ ను కొనసాగిస్తూ సెన్సేషనల్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానం లో నిలిచి డామినేషన్ కొనసాగిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వగా బయ్యర్లకు భారీ లాభాలను తీసుకొస్తుంది. 8 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 215కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ట్రెండ్ చూస్తుంటే ఈసినిమా ఫుల్ రన్ లో 300కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక తండేల్ వచ్చే వరకు సంక్రాంతికి వస్తున్నాంకు బాక్సాఫీస్ వద్ద ఎదురువుండదు.
అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈసినిమాలో వెంకటేష్ హీరోగా నటించగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా దిల్ రాజు ఈసినిమా ను నిర్మించారు. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుంది. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: