
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 157


శర్వానంద్ మనమే ట్రైలర్ రిలీజ్-ఫన్ ప్లస్ కలర్ ఫుల్

మనమే స్ట్రాంగ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్

హరి హర వీరమల్లు- పవన్ జాయిన్ అయ్యేది అప్పుడే

ప్రముఖ సంస్థకు సత్యభామ ఆంధ్ర, సీడెడ్ హక్కులు

ఓజీ వస్తే తప్పుకుంటాం - నాగవంశీ

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ ఛాయస్ హీరో ఎవరంటే

మనమే ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

హరోం హర రిలీజ్ వాయిదా పై సుధీర్ క్లారిటీ

గం.గం.. గణేశా స్పెషల్ షో టాక్

నితిన్ తమ్ముడు భారీ యాక్షన్ షెడ్యూల్ అప్ డేట్

ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణకు మాతృ వియోగం

వాళ్లు చేస్తే మోడీ బయోపిక్ చేస్తా

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ డే కలెక్షన్స్
విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.రివ్యూస్ తో సంబంధంలేకుండా అంచనాలకు మించి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు ఈసినిమా 8.2కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.ఇందులో షేర్ 4కోట్ల పైనే.మొత్తం 12కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఈ రెండు రోజులు ఇదే జోరు కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ ను చేరుకోనుంది. విశ్వక్ కెరీర్ లో ఇవే బెస్ట్ ఓపెనింగ్స్.

శర్వానంద్ మనమే ట్రైలర్ రిలీజ్-ఫన్ ప్లస్ కలర్ ఫుల్
టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పలు పాటలను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

మనమే స్ట్రాంగ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్
డైనమిక్ హీరో శర్వానంద్ తన ల్యాండ్‌మార్క్ 35వ మూవీ 'మనమే' తో హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి రెడీగా వున్నారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. 'మనమే' జూన్ 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ కృతి శెట్టి మూవీ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

హరి హర వీరమల్లు- పవన్ జాయిన్ అయ్యేది అప్పుడే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొదటిసారి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ లో పవన్ నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టారు ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది.

గం.గం.. గణేశా రివ్యూ
ఓవరాల్ గా గం గం గణేశా లో ఆనంద్ దేవరకొండ నటన ,కామెడీ సన్నివేశాలు ,క్లైమాక్స్ హైలైట్ అయ్యాయి.ఓ మంచి టైం పాస్ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఈసినిమాను చూడొచ్చు.

ప్రముఖ సంస్థకు సత్యభామ ఆంధ్ర, సీడెడ్ హక్కులు
డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ పలు సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ ఏడాది ఇప్పటికే 'బేబి', 'గుంటూరు కారం', 'హనుమాన్', 'గామి', 'ఓం భీమ్ బుష్', 'టిల్లు స్క్వేర్' వంటి సూపర్ హిట్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ జర్నీ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ భజే వాయు వేగం సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఈసినిమా ఈరోజు రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

దేవకీ నందన వాసుదేవ జై భోలో కృష్ణ ఫుల్ సాంగ్ రిలీజ్
సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా, మహేష్ బాబు మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అశోక్ గల్లా. హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అశోక్ మొదటిసినిమాతోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాదాపు రెండేళ్ల తరువాత ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వం అశోక్ హీరోగా వస్తున్న సినిమా దేవకీ నందన వాసుదేవ. ఈసినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ను బట్టి అర్థమవుతుంది. మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ లో బురదలో జరిగే ఫైట్ సన్నివేశంతో కట్ చేసిన ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.

రివ్యూ : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
ఓవరాల్ గా రూరల్ గ్యాంగ్ స్టర్ డ్రామా గా వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో విశ్వక్ నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫస్ట్ హాఫ్ హైలైట్ అయ్యాయి. మాస్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నచ్చుతుంది. మిగితా వారు కూడా ఓ సారి చూసేయొచ్చు.

భజే వాయు వేగం మూవీ తెలుగు రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే కార్తికేయ భజేవాయి వేగం సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో బాగానే ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీకెండ్ కు వచ్చిన ఈసినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు..

తండ్రి కృష్ణను తలచుకుంటూ.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ సూపర్ స్టార్, దివంగత నటుడు ఘట్టమనేని కృష్ణ జయంతి నేడు. దీనిని పురస్కరించుకొని ఆయన తనయుడు, స్టార్ హీరో మహేష్ బాబు తండ్రిని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్)లో ఒక భావోద్వేగభరిత పోస్ట్ పంచుకున్నారు. కాగా తండ్రిని గుర్తుచేసుకుంటూ మహేష్ బాబు పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు
ఒకప్పుడు కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చిన సంగతి తెలిసిందే కదా. సినిమా సినిమాకు డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈమధ్య తన నుండి వచ్చిన సినిమా ఆ ఒక్కటీ అడక్కు. మల్లి అంకం దర్శకత్వంలో నరేష్ హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. చాలా గ్యాప్ తరువాత ఈసినిమాతో మళ్లీ కామెడీ ట్రాక్ లోకి వచ్చాడు నరేష్. మే 3 తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు. అనుకున్నంత విజయాన్ని అయితే ఈసినిమా అందించలేకపోయింది.

ఓజీ వస్తే తప్పుకుంటాం - నాగవంశీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఓజీ' సెప్టెంబర్ 27న విడుదలకానుందని తెలిసిందే. పవన్ అందుబాటలో లేకపోవడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది లేకపోతే ఈపాటికి షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యేది. అయితే రిలీజ్ డేట్ విషయంలో పవన్ ఫ్యాన్స్ కు ఇప్పుడు కొత్త టెంక్షన్ మొదలయ్యింది. ఓజీ వచ్చే డేట్ కు లక్కీ భాస్కర్ వస్తుందని మేకర్స్ నిన్న ప్రకటించారు. వెంకీ అట్లూరి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ ఛాయస్ హీరో ఎవరంటే
విశ్వక్ సేన్ కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ గా వస్తుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.ఈసినిమా విజయంపై టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.విశ్వక్ కు మాస్ లో క్రేజ్ వుండడం సినిమా కూడా అదే జోనర్ కావడం అలాగే ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.రేపే ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

మనమే ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
హీరో శర్వానంద్ కు సాలిడ్ హిట్ దక్కి చాలా కాలమే అయిపోయింది. ఆ మధ్య వచ్చిన ఒకే ఒక జీవితం ఒక మోస్తరు విజయాన్ని అందించినా మంచి కమ్ బ్యాక్ ను అయితే ఇవ్వలేకపోయింది. కమర్షియల్ గా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఇక ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న సినిమా మనమే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది.

హరోం హర రిలీజ్ వాయిదా పై సుధీర్ క్లారిటీ
టాలీవుడ్ నైట్రో స్టార్ సుధీర్ బాబు కూడా సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా హరోం హర. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న ఈసినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్, పాటలను రిలీజ్ చేయగా అన్నీ ఆకట్టుకున్నాయి.

గం.గం.. గణేశా స్పెషల్ షో టాక్
గత ఏడాది బేబితో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు గం. గం.. గణేశా అంటూ పలకరించడానికి రెడీ అయ్యాడు. ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకు హైప్ వచ్చింది. ఇక సినిమా మీద వున్న కాన్ఫిడెంట్ తో ఇండస్ట్రీ లో వున్న దగ్గరి వాళ్లకు స్పెషల్ షోస్ ను వేశారు మేకర్స్.

నితిన్ తమ్ముడు భారీ యాక్షన్ షెడ్యూల్ అప్ డేట్
ఎంసీఏ, వకీల్ సాబ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్ వేణు. ఆయన ప్రస్తుతం నితిన్ హీరోగా తమ్ముడు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ప్రేక్షకుల పల్స్ తెలిసిన డైరెక్టర్ గా అన్ని కమర్షియల్ అంశాలతో తమ్ముడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శ్రీరామ్ వేణు.

ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణకు మాతృ వియోగం
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి శ్రీమతి సూర్యదేవర నాగేంద్రమ్మ గురువారం కన్నుమూశారు. 90 సంవత్సరాల నాగేంద్రమ్మ హృదయ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. రేపు ఉదయం 10 గంటలకు ఫిల్మ్ నగర్ లోని విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

వాళ్లు చేస్తే మోడీ బయోపిక్ చేస్తా
టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ ఒక్క సినీ ఇండస్ట్రీ అని కాదు..అన్ని సినీ ఇండస్ట్రీల్లోనూ బయోపిక్ ల హవా సాగుతుంది. పొలిటికల్ నేపథ్యంలో తెలుగులో ఎన్టీఆర్ మహానాయకుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు మరికొంతమంది బయోపిక్ లు తెరకెక్కాయి.. రిలీజ్ కూడా అయ్యాయి. తమిళంలో జయలలిత బయోపిక్ కూడా వచ్చింది. ఆతరువాత భారత ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ కూడా వచ్చింది.

అఫీషియల్.. ఆగిపోయిన ప్రశాంత్ వర్మ - రణ్‌వీర్‌సింగ్ కాంబో ప్రాజెక్ట్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'హనుమాన్' సినిమాతో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా 330 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఔరా అనిపించింది. దీంతో ప్రశాంత్ వర్మ పేరు అంతటా మారుమ్రోగిపోయింది. ఈ క్రమంలో అయనకు టాలీవుడ్ నుండే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్‌సింగ్ ప్రశాంత్ వర్మతో కలిసి ఓ సినిమా చేయడానికి అంగీకరించారు.