
ట్యాగ్ · 9 కథనాలు


మోసగాళ్లకు మోసగాడు ట్రైలర్ రిలీజ్

తండ్రిని గుర్తుచేసుకుంటూ మంజుల ఎమోషనల్

నిర్మాతల హీరోగా పేరుపొందిన సూపర్ స్టార్ కృష్ణ

63 దేశాలలో రిలీజ్ అయిన కృష్ణ మోసగాళ్ళకు మోసగాడు

సూపర్ స్టార్ కృష్ణ రిటైర్ మెంట్

సూపర్ స్టార్ కృష్ణ ‘డియర్ బ్రదర్’కి 25 ఏళ్ళు

తండ్రి గురించి మహేష్ ఎమోషనల్ లెటర్
అలనాటి అందాల నటుడు సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అంటే కృష్ణ అని మారుపేరు. అందుకే తన కేరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఇక నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా, టాలీవుడ్ లో మొట్టమొదటి కౌబాయ్ సినిమా అయిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈసందర్భంగా మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ లెటర్ ను షేర్ చేశారు.

మోసగాళ్లకు మోసగాడు ట్రైలర్ రిలీజ్
సూపర్ స్టార్ కృష్ణ తన సినీ చరిత్రలో చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రయోగాలు చేయడం అంటే ఆయనకు ఇష్టం. ఆ ఇష్టం వల్లే ఎన్నో క్లాసిక్ సినిమాలను మనకు అందించగలిగారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మోసగాళ్లకు మోసగాడు సినిమా గురించి. మోసగాళ్లకు మోసగాళ్లు సినిమాకు ముందు కౌబాయ్ తరహా పాత్రలు రాలేదు. తెలుగు సినీ చరిత్రలో వచ్చిన మొట్టమొదటి కౌబాయ్ సినిమా ఇది. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈక్లాసిక్ ను కూడా రీ రిలీజ్ చేయనున్నారు. మే 31వ తేదీన ఈసినిమా రీ రిలీజ్ అవుతుంది. ఈసినిమాను 4కే వెర్షన్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను తాజాగా…

తండ్రిని గుర్తుచేసుకుంటూ మంజుల ఎమోషనల్
సూపర్ స్టార్ మహేష్ కుటుంబానికి ఈ ఏడాది మాత్రం ఎంతో విషాదాన్ని మిగిల్చిన ఏడాది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకే ఏడాది ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయారు. ముందు మహేష్ సోదరుడు రమేష్ బాబు ఆ తరువాత తల్లి పద్మావతి మరణించగా ఆ బాధ నుండి తేరుకోకముందే రీసెంట్ సూపర్ స్టార్ కృష్ణ మరణంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. గత కొద్దిరోజుల క్రితమే కృష్ణకు గుండెపోటు రావడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఇప్పుడిప్పుడే కుటుంబసభ్యులు ఆ బాధ నుండి తేరుకుంటున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా తండ్రిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా కూతురు మంజుల కూడా…

నిర్మాతల హీరోగా పేరుపొందిన సూపర్ స్టార్ కృష్ణ
తేనె మనసులు (1965 ) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన కృష్ణ 5 దశాబ్దాలలో సుమారు 350 సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునిహీరో కృష్ణ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణించారు. లక్షలాది అభిమానులను సంపాదించుకున్న ఘట్టమనేని కృష్ణ నిజమైన సూపర్ స్టార్. వెండితెరపైనే కాదు నిజజీవితంలో కూడా ఆయన హీరో. నిర్మాతల కోసం, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం పని చేసిన హీరో సూపర్ స్టార్ కృష్ణ.

63 దేశాలలో రిలీజ్ అయిన కృష్ణ మోసగాళ్ళకు మోసగాడు
పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ , విజయనిర్మల జంటగా కొన్ని హాలీవుడ్ మూవీస్ ఇన్ స్పిరేషన్ తో తెరకెక్కిన వెస్ట్రన్ యాక్షన్ కౌబాయ్ ఫిల్మ్ మోసగాళ్ళకు మోసగాడు 1971 ఆగస్ట్ 27 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.కృష్ణ కెరియర్ లో మైలురాయిగా నిలిచిన సినిమా మోసగాళ్లకు మోసగాడు. ఈ చిత్రం సౌత్ ఇండియాలోనే కాదు, ఇండియన్ సినిమాలోనే ఇది మొట్టమొదటి కౌబాయ్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

తెలుగు ప్రేక్షకుల ఆల్ టైమ్ ఫేవరెట్ 'అల్లూరి సీతారామరాజు'
తెలుగు సినీ ప్రేక్షక్షులకు అల్లూరి సీతారామరాజు అంటే మొదట గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ కృష్ణ. అప్పట్లో ప్రయోగాత్మక సినిమాలు చేయాలంటే ముందుకొచ్చే హీరో ఎవరైనా ఉన్నారంటే కృష్ణా తరువాతే ఎవరైనా అన్న విషయం తెలిసిందే. తెలుగు సినీ చరిత్రలో ఆయన చేసిన ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటిగా అల్లూరి సీతారామరాజు పాత్ర కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. కృష్ణ తప్పా ఆ పాత్రను అలా ఎవరూ చేయలేరు అన్నట్టు.. అల్లూరి బ్రతికి ఉంటే ఇలానే ఉంటాడా అనే రీతీలో కృష్ణ నటించారు.

సూపర్ స్టార్ కృష్ణ రిటైర్ మెంట్
"తేనె మనసులు"(1965 ) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన కృష్ణ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సుమారు 350 సినిమాలలో నటించిన కృష్ణ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎదిగారు. విశేష అభిమానులు ఉన్న హీరో కృష్ణ ఫస్ట్ కలర్ ఫిల్మ్ , ఫస్ట్ 70 ఎమ్ ఎమ్ వంటి పలు నూతన అధ్యాయాలకు ఆద్యుడు ఆయ్యారు. నటుడు , నిర్మాత , దర్శకుడిగా ఐదు దశాబ్దాలుగా కళామతల్లి కి సేవలందించిన హీరో కృష్ణ ను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన సూపర్ స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. సాహసాలకు మారు పేరు కృష్ణ. ప్రయోగాత్మక సినిమాలు తీయాలంటే ఆయన తరువాతే. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ రాజ్యమేలుతున్న వేళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృష్ణ తనదైన మార్గం నిర్దేశించుకున్నారు. ఒకరు జానపదం మరొకరు పౌరాణికాలకు పెట్టింది పేరుగా ముందుకు సాగుతున్న వేళ.. సాంఘిక చిత్రాలకు కేరాఫ్ గా మారారు కృష్ణ. అందులోనూ విత్ యాక్షన్ అంటే.. నిర్మాతలు దర్శకులకు ప్రముఖంగా సూపర్ స్టార్ కనిపించేవారు. తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. తెలుగు వెండి…

సూపర్ స్టార్ కృష్ణ ‘డియర్ బ్రదర్’కి 25 ఏళ్ళు
సూపర్ స్టార్ కృష్ణ నటించిన పలు మాస్ ఎంటర్‌టైనర్స్ ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘డియర్ బ్రదర్’ ఒకటి. టి.ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణకి జోడిగా గౌతమి నటించింది. రఘువరన్, ‘మహర్షి’ రాఘవ, యమున, డిస్కో శాంతి, బ్రహ్మానందం, అలీ, బాబుమోహన్, సారథి ముఖ్య పాత్రలు పోషించగా సురభి ప్రత్యేక గీతంలో మెరిసింది.