
ట్యాగ్ · 9 కథనాలు


రేర్ ఫీట్ సాధించిన 'కె.జి.యఫ్ 2'

'కె.జి.యఫ్ 2' లో అదే స్పెషల్..!

'కె.జి.యఫ్ 2' అందుకే ఆలస్యమవుతుందా

'కె.జి.యఫ్ 2' టీజర్ ఖాతాలో మరో రికార్డ్

'కె.జి.యఫ్ 2' త్వరలో కొత్త రిలీజ్ డేట్

ఫలక్ నుమా ప్యాలెస్ లో"కెజిఎఫ్ 2"షూటింగ్

1250 కోట్ల దిశగా "కె జి ఎఫ్ చాప్టర్ 2 "
స్టార్ హీరో యష్ , శ్రీనిధి శెట్టి జంటగాహోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో అన్ని భాషలలోనూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.

రేర్ ఫీట్ సాధించిన 'కె.జి.యఫ్ 2'
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 కూడా ఒకటి. ఇక ఈసినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ఇక ఈసినిమా రిలీజ్ కాకముందే కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ట్రైలర్ రిలీజ్ కాగా అది మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది. ఇక ఇప్పుడు మరో కొత్త రేర్ ఫీట్ ను సాధించింది. ఈసినిమా గ్రీస్ భాషలో కూడా విడుదల కానుంది. ఇప్పటివరకు ఏ సౌత్ ఇండియన్ సినిమా గ్రీస్ భాషలో విడుదల అవ్వలేదు. దీంతో ఈసినిమాలో మరో సరికొత్త రికార్డ్ వచ్చి చేరింది. మరి ఇంత భారీ స్థాయిలో విడుదల అవుతున్న ఈసినిమా ప్రేక్షకుల…

'కె.జి.యఫ్ 2' లో అదే స్పెషల్..!
దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కె.జి.యఫ్ చాప్టర్ 1 సినిమాతో సెన్సెషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరోసారి కె.జి.యఫ్ చాప్టర్2 మూవీని తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఏప్రిల్ 14న ఈసినిమా రిలీజ్ కాబోతుండగా.. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

'కె.జి.యఫ్ 2' అందుకే ఆలస్యమవుతుందా
ఇండియన్ సినిమాలో ‘కె.జి.యఫ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’ దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని కట్టి పడేసింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. సౌత్ నుంచి వచ్చిన సినిమాల్లో ‘బాహుబలి’ తరవాత ఆ స్థాయిలో అలరించిన ఏకైక చిత్రం ‘కె.జి.యఫ్’. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

200 మిలియన్ వ్యూస్ తో "కె జి ఎఫ్ చాప్టర్ 2 " రికార్డ్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 1 “ మూవీ కన్నడ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ కి సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

'కె.జి.యఫ్ 2' టీజర్ ఖాతాలో మరో రికార్డ్
దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో కె.జి.యఫ్ 2 కూడా ముందు ప్లేస్ లో ఉంటుంది. అన్ని పరిస్థితులు బావుంటే ఈసినిమా ఈరోజు రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అయితే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి చేసుకుంటుంది. అయితే అప్పుడప్పుడు ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేస్తూ బజ్ మాత్రం క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఏ చిన్న అప్ డేట్ వచ్చిన వెంటనే వైరల్ అవుతుందన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాాజాగా ఈసినిమా టీజర్ మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది. యష్ పుట్టిన రోజు సందర్భంగా…

'కె.జి.యఫ్ 2' త్వరలో కొత్త రిలీజ్ డేట్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ ఎంత సంచలనం సృష్టించిందో తెలుసుకదా. కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంతభారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.యఫ్’ సంచలన విజయం సాధించింది. అంతేకాదు దేశ వ్యాప్తంగా కూడా ఈసినిమా పలు రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. నిజానికి ఈసినిమాను ఈనెల 16న రిలీజ్ చేద్దామని డేట్ ఫిక్స్ చేశారు కానీ అప్పటికి ఈసినిమా రిలీజ్ కావడం కష్టం.. దానికితోడు థియేటర్లు కూడా పూర్తిస్థాయిలో తెరుచుకునే పరిస్థితి లేదు. దీంతో జూన్ 16 ను…

ఫలక్ నుమా ప్యాలెస్ లో"కెజిఎఫ్ 2"షూటింగ్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 1 “ మూవీ కన్నడ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ కి సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

" కె .జి.ఎఫ్ 2" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్ ఫిక్స్
HOMBALE ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన " కె .జి.ఎఫ్ చాఫ్టర్ 1" కన్నడ మూవీ 2018 సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. శాండల్ వుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి