‘కె.జి.యఫ్ 2’ లో అదే స్పెషల్..!

Prashanth Neel About KGF Chapter-2,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Movie Latest News,Prashanth Neel,Director Prashanth Neel About KGF Chapter 2,Director Prashanth Neel About KGF Chapter 2,Director Prashanth Neel Latest News,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 Movie Story,KGF Chapter 2 Live Updates,Prashanth Neel on KGF Chapter 2,Prashanth Neel: KGF Chapter 2 will feel fresh

దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కె.జి.యఫ్ చాప్టర్ 1
సినిమాతో సెన్సెషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరోసారి కె.జి.యఫ్ చాప్టర్2 మూవీని తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఏప్రిల్ 14న ఈసినిమా రిలీజ్ కాబోతుండగా.. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఈసినిమాలో చాలా వరకూ యష్ తన డైలాగ్స్ తనే రాసుకున్నాడట. ఆసక్తికర విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బయటపెట్టాడు. ‘వైలెన్స్‌.. వైలెన్స్‌.. వైలెన్స్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఇట్‌.. బట్‌.. వైలెన్స్‌ లైక్స్‌ మీ’ అంటూ వచ్చే డైలాగ్ హీరోనే రాశాడట. అంతేకాదు ఈసినిమాలో యష్ మరిన్ని డైలాగ్స్‌ కూడా రాసినట్లు ప్రశాంత్‌ వర్మ తెలిపాడు.

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఇక యష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మిలియన్ వ్యూస్ తో ఇప్పటికే టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =