ట్యాగ్ · 11 కథనాలు

భారతీయుడు2 లో విలన్ గా..?

కథ, పాత్రల ప్రాధాన్యత ముఖ్యం - కాజల్ అగర్వాల్

ప్రభాస్ కి అతిథిగా కాజల్?
కాజల్ అగర్వాల్ శాండల్ వుడ్ ఎంట్రీ ?

కాజల్ హాలీవుడ్ మూవీ టైటిల్ ది కాల్ సెంటర్ ?
కొరియన్ ఫిల్మ్ రీమేక్‌లో కాజల్?

తమిళ వెబ్ సిరీస్ ప్రారంభం

కాజల్ అగర్వాల్ సమర్పణలో మను చరిత్ర మూవీ

గోపీచంద్‌కి జోడీగా కాజల్ అగర్వాల్?

కాజల్... స్పెషల్ డే
ఇండియన్ 2 - ఫైనల్లీ నా షూట్ స్టార్ట్..!
శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

భారతీయుడు2 లో విలన్ గా..?
శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 23 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

కథ, పాత్రల ప్రాధాన్యత ముఖ్యం - కాజల్ అగర్వాల్
స్టార్ హీరోలతో పాటు, యువ హీరోలతో కూడా జతకడుతున్న కాజల్ అగర్వాల్ టాలీవుడ్, కోలీవుడ్ లలో అగ్రతారగా రాణిస్తున్నారు. దాదాపు 14 సంవత్సరాలుగా తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కాజల్ తమిళ భాషలో నటించిన "ప్యారిస్ ప్యారిస్ " మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. కాజల్ ప్రస్తుతం నటిస్తున్న మూవీస్ "ఇండియన్ 2"(భారతీయుడు 2), "ముంబై సాగ" (హిందీ ), హాలీవుడ్ క్రాస్ ఓవర్ మూవీ "మోసగాళ్ళు" చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.

ప్రభాస్ కి అతిథిగా కాజల్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన కనువిందు చేసిన కథానాయికల్లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. `డార్లింగ్` (2010), `మిస్టర్ పర్ ఫెక్ట్` (2011) వంటి బ్లాక్ బస్టర్స్ లో ఈ ఇద్దరి జోడీ మెప్పించింది. కట్ చేస్తే... తొమ్మిదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ప్రభాస్ సినిమాలో కాజల్ దర్శనమివ్వనుందట. అయితే, ఈ సారి హీరోయిన్ గా కాదు. అతిథి పాత్రలో.
కాజల్ అగర్వాల్ శాండల్ వుడ్ ఎంట్రీ ?
టాలీవుడ్, లో, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు కాజల్ శాండల్ వుడ్ ఎంట్రీ కి రంగం సిద్ధమయ్యింది. SS ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్ చంద్రు దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా కన్నడ, తెలుగు, తమిళ. మలయాళ , హిందీ, మరాఠీ, బెంగాలీ భాషలలో రూపొందనున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "కబ్జ"మూవీ ఈ రోజు ప్రారంభం కానుంది. కబ్జ మూవీ పాన్ ఇండియా ఫిల్మ్ గా రూపొందుతుంది.

కాజల్ హాలీవుడ్ మూవీ టైటిల్ ది కాల్ సెంటర్ ?
టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ ఒక హాలీవుడ్ మూవీ లో నటించనున్న విషయం తెలిసిందే జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా ఇంగ్లీష్ , తెలుగు భాషలలో రూపొందనున్న మూవీ కి టైటిల్ ది కాల్ సెంటర్ గా ఫిక్స్ చేసినట్టు సమాచారం. విష్ణు మంచు నిర్మాణ సారథ్యంలో రూపొందనున్న ఈ మూవీ తెలుగు వెర్షన్ లో విష్ణు మంచు హీరోగా నటిస్తారు. ఈ రొమాంటిక్ డ్రామా లో కాజల్ ఒక కొత్త లుక్ లో కనిపిస్తారని సమాచారం.
కొరియన్ ఫిల్మ్ రీమేక్‌లో కాజల్?
`నేనే రాజు నేనే మంత్రి`లో జోగేంద్ర, రాధగా అలరించిన రానా, కాజల్ అగర్వాల్... మరోసారి కలసి నటించేందుకు సిద్ధమవుతున్నారా? అవుననే వినిపిస్తోంది ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో.

తమిళ వెబ్ సిరీస్ ప్రారంభం
టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఇంగ్లీష్, తెలుగు భాషలలో రూపొందున్న కాల్ సెంటర్, ముంబై సాగ హిందీ, అ !2తెలుగు, ఇండియన్ 2, సూర్య 39 తమిళ మూవీస్ షూటింగ్ జరుపుకొంటున్నాయి. కాజల్ అగర్వాల్ ఒక తమిళ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెడుతున్నారు . తమిళ మూవీస్ లో హీరోయిన్ గా వెలుగొందుతున్న తెలుగమ్మాయి ఆనంది ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

కాజల్ అగర్వాల్ సమర్పణలో మను చరిత్ర మూవీ
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సమర్పించు మను చరిత్ర మూవీ ఈ రోజు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమయింది. భరత్ కుమార్ Pదర్శకత్వం లో నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి, మేఘ ఆకాష్ జంటగా ఫాలింగ్ ఇన్ లవ్ ఈజ్ ఏ పెయిన్ ఫుల్ జాయ్ ట్యాగ్ లైన్ తో మను చరిత్ర మూవీ రూపొందుతుంది. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామా మను చరిత్ర ను కాజల్ అగర్వాల్ మేనేజర్ రాన్సన్, N శ్రీనివాస్ రెడ్డి తో కలసి నిర్మిస్తుండగా కాజల్ అగర్వాల్ సమర్పిస్తున్నారు.

గోపీచంద్‌కి జోడీగా కాజల్ అగర్వాల్?
పుష్కరకాలానికి పైగా కథానాయికగా రాణిస్తోంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ఓ వైపు అగ్ర కథానాయకులతో నటిస్తూనే... మరో వైపు యువ కథానాయకులతోనూ జోడీ కడుతూ తన స్థానాన్ని పదిలపరుచుకుంటోంది ఈ ఉత్తరాది భామ. కాజల్ నటించిన కొత్త చిత్రాలు `సీత`, `పారిస్ పారిస్` (తమిళ్), శర్వానంద్ - సుధీర్ వర్మ కాంబినేషన్ మూవీ... ఈ వేసవిలో తెరపైకి రానున్నాయి. అలాగే భారీ బడ్జెట్ మూవీ`భారతీయుడు 2`లో లోకనాయకుడు కమల్ హాసన్‌కి జోడీగా నటిస్తూ బిజీగా ఉంది కాజల్. అంతేకాదు... మాస్ మహరాజ్ రవితేజకి జంటగా `కనకదుర్గ`లోనూ కాజల్ నాయికగా నటించబోతోందని సమాచారం.

కాజల్... స్పెషల్ డే
కాజల్ అగర్వాల్... ఈ భామ టాలీవుడ్‌కి చందమామ. కేవలం తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లోనూ నటిగా తనదైన ముద్ర వేసింది ఈ పంచదార బొమ్మ. 50కి పైగా సినిమాల్లో నటించి... కుర్రకారు మదిని దోచేసింది. అలాంటి కాజల్‌కి ఈ రోజు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే... సరిగ్గా ఇదే ఫిబ్రవరి 15న కాజల్ కథానాయికగా నటించిన మొదటి సినిమా `లక్ష్మీ కళ్యాణం` (2007) విడుదలైంది. తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ఈ సినిమాతోనే కాజల్ హీరోయిన్‌గా తొలి అడుగులు వేసింది. పల్లెటూరి అమ్మాయి లక్ష్మిగా నటించి... తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత అదే ఏడాదిలో వచ్చిన కృష్ణవంశీ…