కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hyderabad

ట్యాగ్ · 13 కథనాలు

Pradeep Ranganathan Watches Pawan Kalyan's OG at Vimal Theatre, Hyderabad
సినిమా వార్తలు

ఓజీ థియేటర్‌లో సందడి చేసిన తమిళ్ స్టార్ హీరో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ముందురోజు వేసిన బెనిఫిట్ షోలతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ అందరి అంచనాలకు తగ్గట్టే తొలిరోజే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో, ఈ సినిమాను వీక్షించడానికి అభిమానులతోపాటు పలువురు స్టార్ హీరోలు సైతం ఆసక్తిని కనబరిచారు.

Srikanth Mవాట్సాప్
The Kingdom pre-release event will take place at Yousufguda Police Grounds, Hyderabad on July 28
సినిమా వార్తలు

కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే

విజయ్ దేవరకొండ కింగ్డమ్ మరో 5రోజుల్లో థియేటర్లలోకి రానుంది.విజయ్ గత చిత్రాలు నిరాశపరిచిన కింగ్డమ్ పై అంచనాలు భారీగా వున్నాయి. కీలకమైన ట్రైలర్ ఈరోజు రిలీజ్ కానుంది. ట్రైలర్ వచ్చాక సినిమా హైప్ మరింతగా పెరగనుంది.ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో కట్ చేశారు.విజయ్ నుండి వస్తున్న ఫుల్ లెంగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇదే.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈనెల 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపనున్నారు.ఈ ఈవెంట్ వేదిక ను కూడా ఫిక్స్ చేశారు. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గౌండ్స్ లో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు.ముఖ్య అతిథిగా ఎవరిని తీసుకొస్తారో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, కళ్యాణ్ రామ్ నివాళులు
సినిమా వార్తలు

ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, కళ్యాణ్ రామ్ నివాళులు

లెజెండరీ నటుడు, నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా.. ఆయన మనుమలు, స్టార్ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్ , కళ్యాణ్‌ రామ్‌ నివాళులర్పించారు. ఈ మేరకు నేటి ఉదయం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న ఆయన సమాధి ఎన్టీఆర్‌ ఘాట్‌కు చేరుకున్న నట సోదర ద్వయం తాతకు ఘనంగా పుష్పాంజలి ఘటించారు.

Srikanth Mవాట్సాప్
Actor Vishnu Manchu Sensational Comments on Family Issue,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Manchu Family Controversy,Manchu Manoj,Manchu Family Feud,Mohan Babu Vs Son Man
సినిమా వార్తలు

మా నాన్న మాట నాకు వేదవాక్కు - విష్ణు మంచు

తండ్రి మాట తనకు వేదవాక్కు అని పేర్కొన్నారు టాలీవుడ్ హీరో విష్ణు మంచు. ఈ మేరకు ఆయన తాజాగా తమ కుటుంబంలో చోటుచేసుకున్న ఘటనలపై ప్రజలకు స్పష్టత ఇవ్వడానికి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు పలు కీలక విషయాలు వెల్లడించారు. తమ ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు త్వరలోనే సమసిపోతాయని, త్వరలోనే తిరిగి అందరం కలిసిపోతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Srikanth Mవాట్సాప్
Hyderabad Police Seize Guns From Manchu Family,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Manchu Family Controversy,Police Seize Mohan Babu Gun,Manchu Manoj,Manchu Family Feud,Moh
సినిమా వార్తలు

మోహన్ బాబు, విష్ణు లైసెన్స్‌డ్‌ గన్స్ సీజ్

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న వివాదం తీవ్ర స్థాయికి చేరింది. గడచిన మూడు రోజులుగా ఆయనకు, చిన్న కుమారుడు హీరో మనోజ్‌కు మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న రాత్రి జల్ పల్లిలోని మంచు టౌన్ లోని మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
సినిమా వార్తలు

పొంగల్ రేస్ - అడ్వాన్స్ బుకింగ్స్

మళ్లీ పొంగల్ రేస్ మొదలైంది. ప్రతి సమత్సరం లాగానే ఈ ఏడాది కూడా సాంక్రాంతి బరిలోకి దిగేందుకు హీరోలు సిద్ధమయ్యారు. గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు, రజినీ దర్బార్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్, సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఆ తర్వాత ఆ రేంజ్ లో థియేటర్స్ లో సందడి చేసిన అవకాశం లేకుండా పోయింది. కరోనా వల్ల దాదాపు ఎనిమిది నెలలు థియేటర్ ల మొహం చూడలేదు. ఇక క్రిస్మస్ కు రిలీజ్ అయిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మంచి సాలిడ్ ఓపెనింగ్ ఇచ్చింది. ఒక రకంగా ఈ సినిమా మంచి బూస్టప్ ఇచ్చిందని చెప్పొచ్చు. కేవలం 50% ఆక్యూపెన్సీ ఉన్నాకానీ మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నో పాలిటిక్స్ అంటున్న తలైవా

అభిమానులకు కాస్త నిరాశ పరిచే వార్తే చెప్పారు తలైవా, సూపర్ స్టార్ రజినీ కాంత్. రజినీ పొలిటికల్ ఎంట్రీ పై ఎప్పుడూ ఏదో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక ఎంతో కాలంగా రజినీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అభిమానులతో పాటు అందరూ ఎదురుచూస్తున్నారు . అయితే ఇటీవలే రాజకీయాల్లోకి వస్తున్నానని.. డిసెంబ‌ర్ 31న త‌న పార్టీ పేరుని అనౌన్స్ చేస్తాన‌ని, జ‌న‌వ‌రిలో పార్టీని స్టార్ట్ చేస్తాన‌ని ఆయ‌న తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రోజు కోసం ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లోనే మరో ట్విస్ట్ ఇచ్చారు రజినీ.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కోలుకున్న రజినీ.. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్

మొత్తానికి రజినీ అభిమానులకు కాస్త ఊరట లభించింది. సూపర్ స్టార్ రజినీ కాంత్ అస్వస్థతకు గురైన వార్త అటు సినీ పరిశ్రమలనే కాదు అభిమానులను సైతం ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. హైబీపీతో బాధపడుతున్న రజినీ.. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరిన సంగతి కూడా విదితమే. అయితే ప్రస్తుతం రజినీ ఆరోగ్యం బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. ఎలాంటి అనారోగ్యం లేదని అయితే వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. ఇక మూడు రోజుల నుంచి హాస్పిటల్ లో ఉన్న రజినీ డిశ్చార్జ్ అయ్యారు

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అస్వస్థతకు గురైన 'తలైవా'

సూపర్ స్టార్ రజినీ కాంత్ అస్వస్థతకు గురైన వార్త అటు సినీ పరిశ్రమలనే కాదు అభిమానులను సైతం ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం రజినీ అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం హైద్రాబాద్ లో ఉన్నారు. అయితే చిత్ర సిబ్బందిలో దాదాపు 4గురికి కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ ను కూడా రద్దు చేశారు. ప్రస్తుతం రజినీ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తమిళ మూవీ సెట్స్ లో సమంత

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సోషల్ మీడియా లో సమంత ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. గార్డెనింగ్ , వర్కౌట్ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులను సమంత ఇన్ స్పైర్ చేస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న హారర్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సమంత ఇప్పుడు ఒక తమిళ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హైదరాబాద్ లో స్టార్ హీరో యశ్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరో యశ్ , శ్రీనిధి శెట్టి జంటగా బ్లాక్ బస్టర్ "కెజిఎఫ్ చాప్టర్ 1 " కన్నడ మూవీ సీక్వెల్ "కెజిఎఫ్ చాప్టర్ 2 "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా పాత్రలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన "కెజిఎఫ్ చాప్టర్ 2 "మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వరద భాదితుల కోసం ముందుకొచ్చిన 'తెలుగు సినీ ప్రముఖులు'

కరోనా వల్ల ఇప్పటికే ప్రపంచం అతలాకుతలమైపోయింది. ఇప్పుడిప్పుడే కాస్త సాధారణ పరిస్థితులు వస్తున్నాయి కదా అని అనుకునేలోపు మళ్లీ మరో సమస్య వచ్చి పడింది. అది కూడా తెలుగు రాష్ట్రాలకు. ఏపీలో కాస్త బెటరే కానీ.. భారీ వ‌ర్షాల‌తో భాగ్య‌న‌గ‌రం వ‌ణికిపోతుంది. గ‌త కొద్ది రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌తో అనేక కాల‌నీలు జ‌ల‌దిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఇక ఏ ఆపద వచ్చినా మన సినీ ప్రముఖులు ఎప్పుడు ముందుంటారు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా నేపథ్యంలో మన సెలబ్రిటీస్ అందరూ ముందుకు వచ్చి తమ వంతు సాయం చేయగా ఇప్పుడు వరదలతో చిక్కుల్లో పడ్డ హైద్రాబాద్ వాసులకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పటికే వారిని ఆదుకునేందుకు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హైదరాబాద్ సేఫ్ సిటీ..!

మహిళలకు హైదరాబాద్ సేఫ్ సిటీ అంటుంది ఫిదా పిల్ల సాయి పల్లవి. అసలు సంగతేంటంటే.. హైదరాబాద్‌లోని హెచ్‌ఐఐసీలో సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సాధికారత సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవి.. మహిళా ఉద్యోగుల భద్రత కోసం రూపొందించిన ‘షీ సేఫ్‌’ అనే ప్రత్యేక యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని, పోలీసుల భద్రతతో మహిళలు నిశ్చింతగా ఉంటున్నారన్నారని.. మహిళకు హైదరాబాద్ సేఫ్ సిటీ అని ఆమె తెలిపింది.

TFN Adminవాట్సాప్

షేర్