
ట్యాగ్ · 9 కథనాలు


సలార్ 2.. త్వరలో షూటింగ్ స్టార్ట్

'కె.జి.యఫ్ 2' అందుకే ఆలస్యమవుతుందా

'కె.జి.యఫ్ 2' టీజర్ ఖాతాలో మరో రికార్డ్

'కె.జి.యఫ్ 2' త్వరలో కొత్త రిలీజ్ డేట్

కె.జి.యఫ్ మేకర్స్ కొత్త సినిమా

'ప్రశాంత్ నీల్' బర్త్ డే.. టీమ్ సర్ ప్రైజ్ గ్లింప్స్
అఫీషియల్.. 'సలార్' లో 'శృతి'

ప్రభాస్‌తో హోంబలే ఫిల్మ్స్ మెగా కొలాబరేషన్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, స్పిరిట్, కల్కి 2, ఫౌజీతో ఎక్స్‌ట్రార్డినరీ ప్రాజెక్ట్‌లను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మ్యాసీవ్ స్కేల్‌లో రూపొందే మూడు మెగా సినిమాల కోసం ఆయన చేతులు కలిపారు. ఈ హిస్టారికల్ కొలాబరేషన్‌లో సలార్ పార్ట్ 2 తర్వాత, ఎడిషినల్‌గా రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రానున్నాయి.

సలార్ 2.. త్వరలో షూటింగ్ స్టార్ట్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ ‘సలార్: పార్ట్ 1-సీజ్‌ఫైర్’. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోయిజం, ప్రశాంత్ నీల్ టేకింగ్, యాక్షన్ సీన్స్ అన్నీ కలగలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

'కె.జి.యఫ్ 2' అందుకే ఆలస్యమవుతుందా
ఇండియన్ సినిమాలో ‘కె.జి.యఫ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’ దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని కట్టి పడేసింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. సౌత్ నుంచి వచ్చిన సినిమాల్లో ‘బాహుబలి’ తరవాత ఆ స్థాయిలో అలరించిన ఏకైక చిత్రం ‘కె.జి.యఫ్’. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

200 మిలియన్ వ్యూస్ తో "కె జి ఎఫ్ చాప్టర్ 2 " రికార్డ్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 1 “ మూవీ కన్నడ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ కి సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

'కె.జి.యఫ్ 2' టీజర్ ఖాతాలో మరో రికార్డ్
దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో కె.జి.యఫ్ 2 కూడా ముందు ప్లేస్ లో ఉంటుంది. అన్ని పరిస్థితులు బావుంటే ఈసినిమా ఈరోజు రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అయితే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి చేసుకుంటుంది. అయితే అప్పుడప్పుడు ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేస్తూ బజ్ మాత్రం క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఏ చిన్న అప్ డేట్ వచ్చిన వెంటనే వైరల్ అవుతుందన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాాజాగా ఈసినిమా టీజర్ మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది. యష్ పుట్టిన రోజు సందర్భంగా…

'కె.జి.యఫ్ 2' త్వరలో కొత్త రిలీజ్ డేట్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ ఎంత సంచలనం సృష్టించిందో తెలుసుకదా. కన్నడ చలన చిత్ర చరిత్రలోనే అత్యంతభారీ బడ్జెట్‌తో రూపొందిన ‘కె.జి.యఫ్’ సంచలన విజయం సాధించింది. అంతేకాదు దేశ వ్యాప్తంగా కూడా ఈసినిమా పలు రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు రెండో భాగం మరింత సంచలనాలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. నిజానికి ఈసినిమాను ఈనెల 16న రిలీజ్ చేద్దామని డేట్ ఫిక్స్ చేశారు కానీ అప్పటికి ఈసినిమా రిలీజ్ కావడం కష్టం.. దానికితోడు థియేటర్లు కూడా పూర్తిస్థాయిలో తెరుచుకునే పరిస్థితి లేదు. దీంతో జూన్ 16 ను…

కె.జి.యఫ్ మేకర్స్ కొత్త సినిమా
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ సంచలన విజయంతో ఇప్పుడు కె.జి.యఫ్ 2 కూడా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. మరోవైపు కె.జి.యఫ్ 2 తోపాటు ఇప్పటికే హోంబలే ఫిలిమ్స్ ప్రభాస్…

'ప్రశాంత్ నీల్' బర్త్ డే.. టీమ్ సర్ ప్రైజ్ గ్లింప్స్
‘ఉగ్రం’ అనే సూపర్ హిట్ మూవీతో కన్నడ పరిశ్రమలో అరంగేట్రం చేశాడు దర్శకుడుప్రశాంత్ నీల్. అయితే కె.జి.యఫ్ తీసుకొచ్చినంత గుర్తింపు మరే సినిమా తీసుకురాలేదు. దేశవ్యాప్తంగా ఒక్క సారిగాకె.జి.యఫ్ తో టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. ఇప్పుడు అదే జోష్ తో కె.జి.యఫ్ తీస్తున్నాడు. అంతేకాదు పాన్ ఇండియా డైరెక్టర్ గా ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలందరినీ లైన్ లో పెడుతూ పాన్ ఇండియా సినిమాలకు తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు.
అఫీషియల్.. 'సలార్' లో 'శృతి'
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 'సలార్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను ఇటీవలే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఇక ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాలోని భారీ యాక్షన్ సన్నివేశాలను తెలంగాణా లోని గోదావరి ఖని లో ఉన్న సింగరేణి గనుల్లో తెరకెక్కించనున్నట్టు.. ఇప్పటికే కోల్ మైన్ వద్ద ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్టు వార్తలు కూడా వస్తున్నాయి.