
ట్యాగ్ · 10 కథనాలు


'హనుమాన్' అప్ డేట్.. కొన్ని రోజులు భరించండి..!

థియేటర్ల లోనే ఇష్క్ - కొత్త రిలీజ్ డేట్

ప్రశాంత్ వర్మ 'హనుమాన్' గ్రాండ్ లాంచ్

ఇష్క్ ట్రైలర్ రిలీజ్ - లవ్ అండ్ థ్రిల్లర్

'ఇష్క్' ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

'టక్ జగదీష్' ప్లేస్ లో తేజ 'ఇష్క్'

త్వరలో "జాంబి రెడ్డి" సీక్వెల్
'ఇష్క్' ఫస్ట్ లుక్ రిలీజ్
షూటింగ్ పూర్తి చేసుకున్న జాంబీ రెడ్డి

తేజ సజ్జ అచీవ్ మెంట్ - ఫిలిం ఫేర్ మ్యాగజైన్ పై ఫొటో
బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి చిన్నప్పుడే తన నటనతో అందరినీ మెప్పించాడు తేజ. ఇక జాంబిరెడ్డి సినిమాతో హీరోగా పరిచయం అయి మొదటి సినిమాతోనే హిట్ ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఓ బేబీ లాంటి సినిమాలో ఓ కీలక పాత్రలో కూడా నటించి కథ కు ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రయోగాలు చేయడానికి కూడా రెడీ అన్న భావన కలిగించాడు. ఆ తర్వాత ఇష్క్, అద్భుతమ్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా ప్రస్తుతం హనుమాన్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. బాంబిరెడ్డి తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

'హనుమాన్' అప్ డేట్.. కొన్ని రోజులు భరించండి..!
విభిన్నమైన చిత్రాలు తీసి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం తను హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తాను తీసిన జాంజిరెడ్డి సినిమాలో హీరోగా నటించిన తేజ సజ్జానే ఈసినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఓ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఈసినిమా సూపర్ హీరోస్ నేపథ్యంలో తెరకెక్కుతుంది కాబట్టి సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగానే ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాలా రోజులవుతుంది…

థియేటర్ల లోనే ఇష్క్ - కొత్త రిలీజ్ డేట్
సినిమా షూటింగ్ లు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా సినిమాలు షూటింగ్ లను పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుండగా.. ఇక పెండింగ్ లో ఉన్న సినిమాలు.. రిలీజ్ లు వాయిదా వేసుకున్న సినిమాలు కొత్త రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే తేజ సజ్జా సినిమా ఇష్క్ కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. రాజు దర్శకత్వంలో తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా వస్తున్న సినిమా ఇష్క్. నిజానికి ఏప్రిల్ 23నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా, కరోనా కారణంగా రిలీజ్‌కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు థియేటర్లు ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈనేపథ్యంలో రిలీజ్ డేట్ ను అధికారికంగా…

ప్రశాంత్ వర్మ 'హనుమాన్' గ్రాండ్ లాంచ్
రొటీన్ గా కాకుండా కాస్త వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కించే దర్శకులు కొంతమంది ఉంటారు. అందులో ప్రశాంత్ వర్మ కూడా ఒకడని చెప్పొచ్చు. తన మొదటిసినిమాతో అది నిరూపించాడు. ఆ తరువాత కూడా కల్కి..ఇటీవల జాంబిరెడ్డి తో మరోసారి రుజువు చేశాడు. నిజానికి జాంబీస్ తో హాలీవుడ్ లో సిరీస్ మీద సిరీస్ ఉన్నాయి. కానీ అదే జాంబీస్ లాగ ఇక్కడ సినిమా తీసి మెప్పించాలంటే కాస్త కష్టమే. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు సూపర్ హీరోస్ నేపథ్యంలో మరో జోనర్ తో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. నిజానికి ఇది కూడా ఎక్కువగా హాలీవుడ్ జోనరే. చిన్న పిల్లల…

ఇష్క్ ట్రైలర్ రిలీజ్ - లవ్ అండ్ థ్రిల్లర్
ఓ బేబి, జాంబిరెడ్డి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కుర్ర హీరో తేజ. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో వస్తున్నాడు. ఇష్క్.. 'నాట్ ఎ లవ్ స్టోరీ' అనేది ట్యాగ్ లైన్ ను బట్టి ఇది ప్రేమకథ కాదు అనేది తెలుస్తూనే ఉంది. మలయాళంలో విజయం సాధించిన 'ఇష్క్' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

'ఇష్క్' ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
బాలనటుడిగా ఎన్నోసినిమాల్లో నటించిన తేజ సజ్జా.. ఇటీవలే హీరోగా జాంబిరెడ్డి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక హీరోగా తన మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తేజ తన రెండో సినిమా ఇష్క్ సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజు దర్శకత్వంలో తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ల న, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి స్పందనే లభించింది. అంతేకాదు రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 23న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

'టక్ జగదీష్' ప్లేస్ లో తేజ 'ఇష్క్'
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం సినిమా రిలీజ్ లపై బాగానే పడుతుంది. ఇప్పటికే ఈ నెలలో రిలీజ్ కావల్సిన లవ్ స్టోరీ, తలైవి సినిమాలు తమ రిలీజ్ లను వాయిదా వేసుకున్నాయి. ఈ లిస్ట్ లో ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ సినిమా కూడా చేరిపోయింది. టక్ జగదీష్ కుటుంబమంతా కలిసి చూసే సినిమా అని.. అలాంటి సినిమాను ఫ్యామిలీస్ కలిసి చూస్తేనే మజా వస్తుందని.. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేకపోవడంతో రిలీజ్ డేట్ కూడా మారిపోయిందని చెపుతూ నాని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇక ఇప్పడు ఈ అవకాశాన్ని చిన్న సినిమాలు బాగానే వాడుకుంటున్నాయి. నాని టక్ జగదీష్ స్లాట్ ను బుక్ చేసుకున్నాడు తేజ.

త్వరలో "జాంబి రెడ్డి" సీక్వెల్
యాపిల్ ట్రీస్ స్టూడియోస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "అ ! "మూవీ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా , ఆనంది జంటగా వైరస్ బారిన పడిన ప్రజలు ఎలా బిహేవ్ చేస్తారనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ "జాంబి రెడ్డి" మూవీ ఘనవిజయం సాధించింది. "జాంబి "జానర్ లో రూపొందిన తొలి తెలుగు సినిమా "జాంబి రెడ్డి" మూవీ ని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికరంగా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
'ఇష్క్' ఫస్ట్ లుక్ రిలీజ్
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో చిన్నప్పుడే తన నటనతో ఆకట్టుకున్నాడు తేజ. ఇక ఇటీవలే హీరోగా జాంబిరెడ్డి సినిమా చేసి తన మొదటి సినిమాతోనే హీరోగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తేజ తన రెండో సినిమా ఇష్క్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తేజ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా ఇష్క్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
షూటింగ్ పూర్తి చేసుకున్న జాంబీ రెడ్డి
గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పై ప్రశాంత్ వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలనటునిగా ఎన్నో సినిమాల్లో అలరించిన తేజ సజ్జా ‘ఓ బేబీ’ చిత్రంలో కీలక పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్ష హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కుతుంది.