తేజ సజ్జ అచీవ్ మెంట్ – ఫిలిం ఫేర్ మ్యాగజైన్ పై ఫొటో

Teja Sajja achievement Featured On The Filmfare Magazine Cover

బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి చిన్నప్పుడే తన నటనతో అందరినీ మెప్పించాడు తేజ. ఇక జాంబిరెడ్డి సినిమాతో హీరోగా పరిచయం అయి మొదటి సినిమాతోనే హిట్ ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఓ బేబీ లాంటి సినిమాలో ఓ కీలక పాత్రలో కూడా నటించి కథ కు ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రయోగాలు చేయడానికి కూడా రెడీ అన్న భావన కలిగించాడు. ఆ తర్వాత ఇష్క్‌, అద్భుతమ్‌ సినిమాల్లో నటించిన తేజ సజ్జా ప్రస్తుతం హనుమాన్‌ సినిమాలో నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. బాంబిరెడ్డి తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా చాలా తక్కువ టైమ్ లోనే తేజకు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఫిలింఫేర్ మిడిల్ ఈస్ట్ మ్యాగజైన్ కవర్ పేజీపై తేజ సజ్జ ఫొటోను ప్రచురించారు. అయితే ఇది మాములు విషయం కాదు.. అందులోనూ కెరీర్ ప్రారంభ దశలో ఉన్న యంగ్ హీరోలకు ఇలాంటి అవకాశం రావడం అనేది చాలా అరుదు. అంతేకాదు అక్కినేని నాగార్జున తర్వాత ఫిల్మ్‌ఫేర్ మిడిల్ ఈస్ట్ మ్యాగజైన్ కవర్‌పై కనిపించిన రెండవ టాలీవుడ్ నటుడు తేజ సజ్జా రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు.

కాగా హనుమాన్‌ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + twenty =