కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

COVID-19

ట్యాగ్ · 70 కథనాలు · పేజీ 4

సినిమా వార్తలు

సూర్య కు కరోనా పాజిటివ్

ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త సామాన్య స్థితికి వస్తున్నాయి.. ప్రజలు కూడా కాస్త భయం పోయి బయట తిరుగుతున్నారు.. అయితే కరోనా మాత్రం అప్పుడప్పుడు నేనున్నాని ఇంకా గుర్తుచేస్తూనే ఉంది. గత ఏడాది కరోనా వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామో అందరికీ తెలుసు. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి.. ఇంట్లో నుండి అడుగు బయటపెట్టలేని పరిస్థితి. ఎంతో మంది ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. పస్తులతో ఉన్నారు.. ఈ సమయంలోనే ఎంతోమంది దాతలు కూడా ముందుకు వచ్చి సాయం చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కోలుకున్న వరుణ్ - కరోనా నెగిటివ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇన్ని రోజులు హోమ్ క్వారంటైన్ లోనే ఉన్నాడు. ఇక ఇప్పుడు వరుణ్ కోలుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా చేయించుకున్న పరీక్షలో తనకు కోవిడ్ `నెగిటివ్` వచ్చినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ``నెగిటివ్`గా వచ్చిన రిపోర్ట్ నాకు ఇంత సంతోషాన్ని కలిగిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. అవును.. నాకు కోవిడ్ నెగిటివ్ వచ్చింద`ని వరుణ్ తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ బాబు కు రామ్ చరణ్ కృతజ్ఞతలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రామ్ చరణ్ ఇంటికే పరిమితం అయ్యి ఆ విషయాన్ని సోషల్ మీడియా లో అనౌన్స్ చేశారు. తమ అభిమాన హీరోకు కరోనా అని తెలియగానే లక్షలాది మంది అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. హీరో రామ్ చరణ్ ఆరోగ్యం పై మహేష్ బాబు స్పందించి జాగ్రత్తగా ఉండమనీ, త్వరగా కరోనా నుండి కోలుకోవాలని కోరుకుంటున్నా అనీ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మెగా ఫ్యామిలీ కరోనా దెబ్బ - వరుణ్ కు కరోనా పాజిటివ్

మెగా ఫ్యామిలీకి కరోనా దెబ్బ బాగానే పడినట్టు కనిపిస్తుంది. గతంలో నాగబాబు కరోనా బారిన పడగా కోలుకున్నారు. ఆ తర్వాత చిరు పాజిటివ్ అన్నారు కానీ.. అదృష్టవశాత్తు అది సాంకేతిక లోపం వల్ల పాజిటివ్ అని వచ్చిందని చెప్పడంతో కూల్ అయ్యారు. ఇక ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపాడు. ఈ షాక్ నుంచి మెగా అభిమానులు కోలుకోకముందే మరో షాక్ తగిలింది. కొద్దిగంటల వ్యవధిలోనే మరో మెగా హీరో కరోనా బారిన పడినట్టు తెలిపాడు. ఆ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్

సెలెబ్రిటీస్ ను మాత్రం కరోనా ఇప్పుడప్పుడే వదిలే ప్రసక్తి కనిపించట్లేదు. అసలు ఎలాంటి లక్షణాలు లేని వాళ్ళు కూడా కరోనా పాజిటివ్ అని చెపుతూ షాకులిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీస్ మాకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.. అయినా పాజిటివ్ వచ్చింది అని చెప్పిన సంఘటనలు గుర్తుండేవుంటాయి . అయితే ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా కరోనా పాజిటివ్ అని చెప్పి షాకిచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఈ పరిస్థితిలో థియేటర్స్ ఓపెన్ చేస్తే వెళతారా? వెళ్ళరా?

2020 ఇలా ఉంటుందని ఎవరూ ఉహించనుకూడా ఉండరు. కరోనా వచ్చినా ఏదో రెండు మూడు నెలలు ఉంటుందేమో అని అనుకున్నారు కానీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు. ఇక ఈ కరోనా వల్ల ఎన్నో పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సినీపరిశ్రమకు కొన్ని కోట్లలో నష్టం కలిగింది. షూటింగ్స్ ఎలాగూ లేవు.. కనీసం థియేటర్స్ అయినా ఓపెన్ అవుతాయా.. ఆ బిజినెస్ అన్నా జరుగుతుందా అంటే అదీ లేకుండా పోయింది.

TFN Adminవాట్సాప్
Legendary Singer SP Balasubrahmanyam Tests Positive For Corona Virus
సినిమా వార్తలు

ఎస్పీ బాలుకి కరోనా పాజిటివ్..!

ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కూడా రిస్క్ అని చెప్పి షూటింగ్ లకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు టాలీవుడ్ సెలబ్రిటీస్. ఏదో ఒకటి రెండు సినిమాలు మాత్రం షూటింగ్ జరుపుకున్నాయి. అయితే షూటింగ్ లకు వెళ్లకపోయినా కూడా సెలెబ్రిటీస్ మాత్రం కరోనా బారిన పడుతున్నారు.

TFN Adminవాట్సాప్
Singer Smita Tested Postive For Corona Virus
సినిమా వార్తలు

లక్షణాలు లేవు.. కరోనా పాజిటివ్ వచ్చింది..!

రోజు రోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతున్న నేపథ్యంలో వేలాది మంది కరోనా బారిన పడుతున్నారు. సెలబ్రెటీలనుండి , సామాన్యుల వరకు ఎవర్నీ ఈ వైరస్ వదిలిపెట్టట్లేదు. ఇక టాలీవుడ్ లో కొందరు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బండ్ల గణేష్, రాజమౌళి, తేజ ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. బండ్ల గణేష్ కోలుకోగా రాజమౌళి, తేజ ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్ లోనే వుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తేజకు కరోనా పాజిటివ్..!

టాలీవుడ్ సెలబ్రిటీస్ ను కూడా కరోనా వదలట్లేదు. షూటింగ్ లు మొదలు పెట్టిన వాళ్లకూ వస్తుంది... షూటింగ్ లకు వెళ్లని వాళ్లకు కూడా వస్తుంది. మొన్నటికి మొన్న టాలీవుడ్‌లో ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రాజ‌మౌళికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పాడు. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లో వున్నాడు. ఇక ఇప్పుడు ఈ వార్త మరిచిపోకముందే మరో డైరెక్టర్ కూడా కరోనా బారిన పడ్డట్టు తెలుస్తుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజకి క‌రోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవల ఓ వెబ్ సిరీస్ షూటింగ్ లో తేజ పాల్గొన్నట్టు సమాచారం. దీంతో ఆయ‌న‌తో ప‌ని చేసిన యూనిట్ సబ్యులకు, అలాగే కుటుంబ సభ్యులకు కారోనా టెస్టులు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కరోనా ఎఫెక్ట్.. బాహుబలి - భల్లాలదేవలకు కూడా మాస్క్ లు..!

కరోనా ఎఫెక్ట్ బాహుబలి సినిమాపై కూడా పడింది. అదేంటి బాహుబలి ఎప్పుడో వచ్చింది.. కరోనా ఇప్పుడు వచ్చింది కదా అని డౌట్ కదా. అసలు సంగతి ఏంటంటే.. ప్రస్తుతం ప్రపంచంమొత్తం కరోనా వైరస్ తో వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోఅందరూ సోషల్ డిస్టెన్స్ ను మెయిన్ టైన్ చేస్తున్నారు. ఇక ఈ కరోనా వల్ల మాస్క్, శానిటజైర్ జీవితంలో ఒక బాగం అయిపోయాయి. ఇంటినుండి బయటకు వచ్చేముందు ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలని, ప్రతిఒక్కరు తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా కాపాడాలని సెలెబ్రిటీస్ దగ్గర నుండి సామాన్య ప్రజల వరకూ అందరూ పిలుపునిస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్