
ట్యాగ్ · 12 కథనాలు


స్టైలిష్ లుక్ లో మెగాస్టార్ చిరంజీవి

మూవీ టికెట్ ధరలపై సి ఎం జగన్ కు చిరు విజ్ఞప్తి

చిరంజీవి పై ఉప రాష్ట్రపతి ప్రశంసలు

"తడప్" మూవీ ట్రైలర్ కు మెగాస్టార్ ప్రశంసలు

"కొండపొలం"మూవీ పై చిరంజీవి ప్రశంసలు

చిరంజీవి "బతుకమ్మ "పండగ శుభాకాంక్షలు

కొవిడ్ రెస్పాన్స్ ఫండ్ కై చిరంజీవి పిలుపు

భార్య తో కలిసి 'చిరు' రక్తదానం
ఈ నలుగురు నా కెప్టెన్లు

సీనియర్ కెమెరా మెన్ కు చిరు సాయం
మెగాస్టార్ చిరంజీవి దానగుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే వారిలో చిరంజీవి ఒకరు. ఇప్పటివరకూ చిరు ఎన్నో దానాలు చేశారు. ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచారు. ఇప్పుడు మరో కుటుంబాన్ని ఆదుకున్నారు చిరు. సీనియర్ కెమెరామెన్ దేవరాజ్ కుటుంబానికి చిరు సాయం చేశారు.80, 90లలో దేవరాజ్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ దగ్గర నుండి చిరంజీవి, బాలకృష్ణ ఇలా ఎందరో పెద్ద పెద్ద నటులతో దేవరాజ్ పని చేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ భాషలలో కూడా సినిమాటోగ్రాఫర్ గా దాదాపు 300కు పైగా సినిమాలు చేశారు.అయితే ఇప్పుడు ఆయన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న…

స్టైలిష్ లుక్ లో మెగాస్టార్ చిరంజీవి
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించారు. చిరంజీవి, రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ అద్భుత స్పందనతో దూసుకుపోతోంది. వాల్తేరు వీరయ్య మూవీ 15 రోజులకు సుమారు 210 కోట్లు గ్రాస్, సుమారు 123 కోట్ల షేర్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.

మూవీ టికెట్ ధరలపై సి ఎం జగన్ కు చిరు విజ్ఞప్తి
సినిమాటోగ్రఫీ రెగ్యులరైజేషన్ ఎమెండ్ మెంట్ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఏపీ సినిమా హాళ్లలో ఇకపై ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కేవలం నాలుగు షో లే నిర్వహించాల్సి ఉంటుందనీ , చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలూ రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలనీ , అదనపు షోలకు అవకాశం లేదనీ , అన్ని సినిమాల టికెట్స్ రేట్లు ఒకేలా ఉండాలనీ , బ్లాక్ టికెట్స్ కు చెక్ పెట్టేలా సినిమా టికెట్ల విక్రయాలన్నీ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా జరగనున్నాయనీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీ పరిశ్రమ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై…

చిరంజీవి పై ఉప రాష్ట్రపతి ప్రశంసలు
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి కలిసి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఒకరిపై మరొకరు ప్రసంశలు కురిపించుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు చిరంజీవి మూడో కన్ను అన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ టాలీవుడ్ కి రెండు కళ్ళు అయితే చిరంజీవి మూడో కన్ను అని ఆయన ప్రశంసించారు.

"తడప్" మూవీ ట్రైలర్ కు మెగాస్టార్ ప్రశంసలు
ఫ్యాక్స్ స్టార్ స్టూడియోస్ , నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై మిలన్ లూథ్రియా దర్శకత్వంలో స్టార్ హీరో సునీల్ శెట్టి తనయుడు అహన్ శెట్టి , తారా సుతారియా జంటగా రూపొందుతున్న సెన్సేషనల్ హిట్ “RX 100 “మూవీ హిందీ రీమేక్ “తడప్ ” మూవీ డిసెంబర్ 3వ తేదీ రిలీజ్ కానుంది. సాంగ్స్ ప్రీతమ్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హర్షవర్ధన్ రామేశ్వర్ అందిస్తున్నారు. ఈ మూవీ తో అహన్ శెట్టి బాలీవుడ్ కు హీరోగా పరిచయం అవుతున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

"కొండపొలం"మూవీ పై చిరంజీవి ప్రశంసలు
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గ్రామీణ నేపథ్యం లో సన్నపు రెడ్డి వెంకట రామి రెడ్డి నవల “కొండపొలం” ఆధారంగా రూపొందిన ”కొండపొలం ” మూవీ అక్టోబర్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సాయి చంద్ , కోట , నాజర్ , అన్నపూర్ణ , హేమ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా రూపొందిన ఈ మూవీ లో కటారు రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్ తేజ్, ఓబులమ్మ అనే గ్రామీణ యువతిగా రకుల్ ప్రీత్ సింగ్ నటించారు.

చిరంజీవి "బతుకమ్మ "పండగ శుభాకాంక్షలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ మహిళలు బతుకమ్మ పాటలను పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమర్జనం చేస్తారు. , తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చినా గత వెయ్యి ఏళ్లుగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు.

కొవిడ్ రెస్పాన్స్ ఫండ్ కై చిరంజీవి పిలుపు
కరోనా మహమ్మారి తో దేశం అల్లకల్లోలమైన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ , కర్ఫ్యూ లతో జన జీవనం అస్త వ్యస్త మైంది. కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు. ఆక్సిజన్ దొరకక , హాస్పిటల్స్ లో బెడ్స్ అందుబాటులో లేక లక్షలాది మరణాలు సంభవించాయి. వేలాది మంది ఉపాధిని కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దేశంలోని దాదాపు అన్ని రంగాలు వెనకబడ్డాయి. ఎంతో మంది ఆకలితో అలమటించారు. ప్రభుత్వాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయి. సెలెబ్రిటీలు సైతం తమ వంతుగా సాయం చేశారు. కరోనా చారిటబుల్ ట్రస్ట్ అంటూ చిరంజీవి గత సంవత్సరం సినిమా కార్మికులను ఆదుకున్నారు.

భార్య తో కలిసి 'చిరు' రక్తదానం
మెగాస్టార్ చిరంజీవిసేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇక ఈ కరోనా కష్ట కాలంలో కూడా తన ఛారిటీ ద్వారా సినీ కార్మికులకు తగిన సాయం అందించారు. ఇక ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులకు శ్రీకారం చుట్టారు. అంతేకాదు అంబులెన్స్ సర్వీస్ కూడా అందించాలని చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా... చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా గత కొన్ని ఏళ్లుగా చిరంజీవి రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ, ఆపదలో వున్న వారికి రక్తాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి రక్తదానం చేశారు. ఇందుకు…

తోడ బుట్టిన.. రక్తం పంచిన బ్రదర్స్ కి 'హ్యాపీ బ్రదర్స్ డే'
అంతర్జాతీయ బ్రదర్స్ డే. ఇక ఈసందర్భంగా అందరూ సోషల్ మీడియా వేదికగా తమ సోదరులకు విషెస్ తెలుపుతున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా తమ సోదరులతో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకుంటూ వారి చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా బ్రదర్స్ డే ను గుర్తుచేసుకున్నారు. తన సోదరులు నాగబాబు – పవన్ కళ్యాణ్ లతో దిగిన చిన్న నాటి ఫొటోను పోస్ట్ చేసి.. తోడ బుట్టిన బ్రదర్స్ కి.. రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి హ్యాపీ బ్రదర్స్ డే!” అని అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

'దాసరి' కి పద్మ పురస్కారం ఇవ్వాలి.. 'చిరు' విన్నపం
ఒకప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ఎవరంటే దాసరి నారాయణ రావు అని ఎవర్ని అడిగినా చెపుతారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా దాసరి దగ్గరుండి సమస్యను పరిష్కారం చేసేవారు. ఇక దాసరి చనిపోయాక ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరునే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయ్యారు. చిరునే దాసరి ప్లేస్ ను రీప్లేస్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై స్పందిస్తున్నారు. పెద్దరికంగా వ్యవహరిస్తున్నారు. ఇక దాసరి పుట్టినరోజు సందర్భంగా ఆయనను స్మృసించుకున్నారు చిరు. అంతేకాదు ఆయనకు పద్మ పురస్కారం ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు.
ఈ నలుగురు నా కెప్టెన్లు
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా మెగా స్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ.. ప్రకటిస్తూ మంచి స్పీడ్ మీద ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా చివరి దశకు చేరుకుంది. ఇక షూటింగ్ దశలో ఉండగానే లూసిఫర్ రీమేక్ ను కూడా రీసెంట్ గా ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో మొదలు పెట్టనున్నారు.