
ట్యాగ్ · 12 కథనాలు


ఇంత మంచి సినిమా లేట్ గా చూశా

బలగంకు షాకింగ్ టీఆర్పి

బలగం టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్

బలగం మొగిలయ్య కు చిరు సాయం

బలగం షోస్ ఆపేదే లేదు

సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న బలగం

బలగం పై మాస్ మహారాజా ప్రశంసలు

మరో ఇంటర్నేషనల్ అవార్డుకు నామినేట్ అయిన బలగం
టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్‌రాజు వారసులైన హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా దిల్‌రాజు ప్రొడక్షన్స్, శిరీష్ సమర్పణలో నిర్మించిన సినిమా బలగం. వేణు ఎల్దండి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కింది. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించిన ఈ చిత్రంలో దాదాపు అందరూ కొత్త నటులే నటించడం విశేషం. మార్చి 3వ తేదీన చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బలగం సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇంత మంచి సినిమా లేట్ గా చూశా
కమెడియన్ వేణు దర్శకుడిగా మారుతూ వచ్చిన సినిమా బలగం. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈసినిమా ఈసినిమా మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించడంతో సినిమా అందరికీ కనెక్ట్ అయింది. ఒకే జోనర్ కు పరిమితం కాకుండా అందరూ ఈసినిమాను ఆదరించడంతో చిన్న సినిమా అయినా కూడా అంత పెద్ద విజయం సాధించింది. అంతేకాదు ఈసినిమాను చూసి విడిపోయిన కుటుంబాలు కూడా కలిసిపోయాయంటేనే అర్థంచేసుకోవచ్చు ఈసినిమా ఎంత ప్రభావం చూపించగలిగిందో. కేవలం ఇక్కడ మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా తన సత్తా చాటి అవార్డులు కొల్లగొట్టింది.

బలగం- బుల్లి తెరపై రెస్పాన్స్ కు ప్రియదర్శి థ్యాంక్స్
వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ఎంత మంచి విజయాన్ని అందుకుందో చూశాం. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా పెద్ద సక్సెస్ ను అందించింది మేకర్స్. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా పదిరెట్లు లాభాలు అందించింది. అంతర్జాతీయంగా కూడా ఈసినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఈసినిమా ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఓటీటీ లో కూడా ఈసినిమా తన సత్తా చాటుకుంది. ఓటీటీ లో మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ అయిన దగ్గర నుండి ఈసినిమా ఏదో ఒకరకంగా పలు రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది.

బలగంకు షాకింగ్ టీఆర్పి
ఈఏడాది మార్చి లో విడుదలై సెన్సేషన్ సృష్టించింది బలగం.చిన్న సినిమాగా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీస్ లో ఒకటిగా రికార్డు సృష్టించింది.కేవలం 2కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈసినిమా ఫుల్ రన్ లో 25కోట్ల గ్రాస్ ను రాబట్టింది.కేవలం బలగం థియేటర్లలోనే కాదు టీవీలో కూడా సూపర్ హిట్ అయ్యింది.రీసెంట్ గా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మాలో మొదటిసారి ప్రసారం అయిన బలగం ఏకంగా 14.3రేటింగ్స్ ను రాబట్టి అదుర్స్ అనిపించింది.ఒక చిన్న సినిమా ఈరేంజ్ లో రేటింగ్స్ రాబట్టడం చిన్న విషయం కాదు.ప్రస్తుతం ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ లో వుంది.

బలగం టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్
ఈమధ్య కాలంలో ఎక్కువమందికి రీచ్ అయినా సినిమా బలగం.కేవలం అర్బన్ ఏరియాల్లో కాదు రూరల్ ఏరియాల్లో కూడా ఈసినిమాకు విశేషమైన ఆదరణ లభించింది.చాలా ఊర్లలలో ఫ్రీగా ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్ లో సినిమాను వీక్షించారు.ఈఏడాది మార్చి లో విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.లో బడ్జెట్ లో తెరకెక్కిన బలగం సుమారు 25కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీస్ లో ఒకటి గా రికార్డు సృష్టించింది.ఇక ఇప్పుడు ఈసినిమా టీవీ లో ప్రసారం కానుంది.వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా లో ఈ ఆదివారం సాయంత్రం 6గంటలకు ప్రసారం కానుంది. టీవీలో కూడా ఈసినిమా ఖచ్చితంగా మంచి రేటింగ్స్ ను రాబట్టుకోవడం…

బలగం మొగిలయ్య కు చిరు సాయం
మెగాస్టార్ చిరంజీవి దానగుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే వారిలో చిరంజీవి ఒకరు. ఇప్పటివరకూ చిరు ఎన్నో దానాలు చేశారు. ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచారు. ఇక తాజాగా చిరు తన ఉదార గుణాన్ని మరోసారి నిరూపించారు. ఇక తాజాగా మెగాస్టార్ తన ఉదార గుణాన్ని మరోసారి నిరూపించారు. గతకొద్దికాలంగా మొగిలయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో మెగాస్టార్ వేణు ను సంప్రదించి తన ట్రీట్ మెంట్ కు అయ్యే ఖర్చును తానే పెట్టుకుంటానని భరోసా ఇచ్చారట. ఇప్పుడు ఈవార్త వైరల్ అవుతుంది. మరోవైపు మెగా ఫ్యాన్స్ చిరు చేసిన సాయం పట్ల హర్ష వ్యక్తం చేస్తున్నారు.

బలగం షోస్ ఆపేదే లేదు
మన తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తాను చాటుతున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులతో పాటు ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు మరో సినిమా కూడా అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చుకుంది. చాలా చిన్న సినిమాగా అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమా బలగం. కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా బలగం. తెలంగాణ సంస్కృతి, మానవ సంబంధాలని మనసులకు హత్తుకునేలా భావోద్వేగాలతో నిండిన కథను తీసుకొచ్చి దర్శకుడిగా విజయాన్ని సాధించాడు.

సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న బలగం
దిల్‌రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించించి. ఈ మూవీలో నటించిన నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. భారీ కలెక్షన్స్ రాబడుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న బలగం
దిల్‌రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వేణు ఎల్దండి దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించించి. ఈ మూవీలో నటించిన నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. భారీ కలెక్షన్స్ రాబడుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

బలగం పై మాస్ మహారాజా ప్రశంసలు
ఒకప్పుడు చిన్న సినిమాలు ఎప్పుడు వచ్చేవో ఎప్పుడు వెళ్లేవో కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు చిన్న సినిమాలకు సైతం మంది ఆదరణ లభిస్తుంది. కథ బాగుంటే పెద్ద పెద్ద నిర్మాతలు సైతం ప్రోత్సహిస్తున్నారు. కాబట్టే ఈమధ్య చాలా చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ ను అందుకోగలుగుతున్నాయి. ఇక చిన్న సినిమాల కోసమే ప్రత్యేకంగా కొత్త బ్యానర్ ను పెట్టి.. మొదటి సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నారు దిల్ రాజు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ ను పెట్టి అందులో మొదటిగా తీసిన సినిమా బలగం. కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ ప్రియదర్శి హీరోగా ఈసినిమా వచ్చింది. కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన…

నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన బలగం
శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం లో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీ ధర్, విజయలక్ష్మి, మొగిలి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి భీమ్స్ సంగీతం అందించారు. ఈ మూవీ లో నటించిన నటీ నటులు తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

బలగం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పీచ్
శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం లో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీ ధర్, విజయలక్ష్మి, మొగిలి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి భీమ్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.