
ట్యాగ్ · 9 కథనాలు


బాలకృష్ణ తో సీరియస్ యాక్షన్ డ్రామ

"F 3" మూవీ రిలీజ్ డేట్

"F 3" మూవీ దసరా స్పెషల్ వీడియో రిలీజ్

F3..మళ్లీ నవ్వులు మొదలు

లాక్ డౌన్ నేపథ్యంతో ‘ఎఫ్ 3’?
సీక్వెల్ కే ఫిక్స్ అయిన అనిల్ రావిపూడి?

అనిల్ తో బాలయ్య - క్రేజీ కాంబినేషన్

మెగా ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నా - అనిల్ రావిపూడి
పలు సూపర్ హిట్ మూవీస్ కు డైలాగ్ ,స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసిన అనిల్ రావిపూడి సూపర్ హిట్ "పటాస్" మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. "సుప్రీమ్ ", "రాజా ది గ్రేట్", "F 2":ఫన్ & ఫ్రస్టేషన్", "సరిలేరు నీకెవ్వరు "వంటి సూపర్ హిట్ మూవీస్ ను అద్భుతంగా తెరకెక్కించి అనిల్ ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం అనిల్"F 2":ఫన్ & ఫ్రస్టేషన్" మూవీ సీక్వెల్ "F 3 "మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ మూవీ ముగింపు దశలో ఉంది.

బాలకృష్ణ తో సీరియస్ యాక్షన్ డ్రామ
'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ తో మూడో సినిమా అఖండ తో వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో హ్యాట్రిక్ ఖాయం అన్న నమ్మకంతో ఉన్నారు అభిమానులు.

"F 3" మూవీ రిలీజ్ డేట్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే కాంబినేషన్ లో "F 3" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో అంజలి , రాజేంద్ర ప్రసాద్ , సునీల్ , మురళీశర్మ , సంగీత, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

"F 3" మూవీ దసరా స్పెషల్ వీడియో రిలీజ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో కామెడీ ఎంటర్ టైనర్ "F 3 " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అంజలి , రాజేంద్ర ప్రసాద్ , సునీల్ , మురళీశర్మ , సంగీత ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

F3..మళ్లీ నవ్వులు మొదలు
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2019 సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా 'ఎఫ్2'. ప్రస్తుతం ఈసినిమా సీక్వెల్ ఏఫ్3 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈసినిమాకు కూడా కరోనా వల్ల బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడే మళ్లీ అందరూ షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాల షూటింగ్స్ మొదలవ్వగా.. తాజాగా ‘ఎఫ్ 3’ చిత్ర షూటింగ్‌ని కూడా మళ్ళీ మొదలుపెట్టినట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఇదే విషయం తెలుపుతూ.. దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ‘‘నేను అభిమానించే నా కో-బ్రదర్స్‌తో మళ్ళీ షూటింగ్ మొదలెట్టాము. మెల్లగా మళ్ళీ నవ్వులు మొదలు..’’ అని అనిల్…

ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే. అంతేకాదు రూ.120 కోట్ల గ్రాస్,రూ.80 షేర్‌ను రాబట్టి కలెక్షన్స్ పరంగా కూడా వెంకీ,వరుణ్ ఆఖరికి దిల్ రాజు కెరీర్ లో కూడా బెస్ట్ కలెక్షన్స్ అందించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు అనిల్ రావిపూడి, దిల్ రాజు.

లాక్ డౌన్ నేపథ్యంతో ‘ఎఫ్ 3’?
వినోదాత్మక చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్నాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. మొదటి సినిమా 'పటాస్' నుండి రీసెంట్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' వరకు తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. కాగా, కెరీర్‌లోనే తొలిసారి తన దర్శకత్వంలోనే రూపొందిన ఓ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌ని ప్లాన్ చేసే పనిలో ఉన్నాడట ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్.
సీక్వెల్ కే ఫిక్స్ అయిన అనిల్ రావిపూడి?
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’తో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. కాగా ‘సరిలేరు...’ తరువాత ఇప్పటివరకు తన నెక్స్ట్ వెంచర్ ని ప్రకటించని అనిల్.. తన దర్శకత్వంలోనే రూపొందిన ఓ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నాడట.

అనిల్ తో బాలయ్య - క్రేజీ కాంబినేషన్
తెలుగు సినీ పరిశ్రమలో అప్పుడప్పుడు క్రేజీ కాంబినేషన్స్ వస్తూనే ఉంటాయి. అలా వచ్చిన క్రేజీ కాంబినేషన్ లో ఒకటే పూరీ-బాలయ్య సినిమా. ఈ సినిమాలో పూరీ బాలయ్యను మాములు హైపర్ గా చూపించలేదు. ఇక ఇప్పుడు బాలయ్య మరో డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు అనిల్ రావిపూడి. ప్రస్తుతం అనిల్ రావిపూడి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది ఎఫ్2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి... ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ తో సరిలేరు మూవీ తో సూపర్ హిట్ కొట్టాడు. దీనితో అనిల్ తో సినిమాలు చేయడానికి హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.