వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ‘ఎఫ్2’. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే. అంతేకాదు రూ.120 కోట్ల గ్రాస్,రూ.80 షేర్‌ను రాబట్టి కలెక్షన్స్ పరంగా కూడా వెంకీ,వరుణ్ ఆఖరికి దిల్ రాజు కెరీర్ లో కూడా బెస్ట్ కలెక్షన్స్ అందించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు అనిల్ రావిపూడి, దిల్ రాజు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఎప్పుడో పూర్తయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ సిద్దం చేసినప్పటికీ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇక ఇప్పుడు మళ్లీ షూటింగ్స్ మొదలవుతున్నాయి కాబట్టి మరోవైపు అనిల్ రావిపూడి ఎఫ్ 3 ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే షురూ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు జనవరి 2021 నుంచి ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ లోపు వరుణ్, వెంకీ సినిమాలు కూడా పూర్తవుతాయి. ఆ తర్వాత ఎలాగూ అనిల్ తక్కువ టైంలోనే సినిమాను పూర్తి చేస్తాడు కాబట్టి.. 5 నెలల్లోనే షూటింగ్ ను కంప్లీట్ చేసి వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాడట. చూద్దాం ఏం జరుగుతుందో మరి.
కాగా ఈ ఏడాది అనిల్ రావిపూడికి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: