
ట్యాగ్ · 9 కథనాలు


ఈస్ట్ గోదావరి అడవుల్లో "పుష్ప "
మై క్యూటీ హ్యాపీ బర్త్ డే
ఆదిలాబాద్ లో బన్నీ - ఫ్యామిలీ టూర్ మాత్రమే
బన్నీ 'ఐకాన్' రావడం పక్కా - వేణు శ్రీరామ్

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "దేశముదురు " మూవీ
'గీతా ఆర్ట్స్ ఆఫీస్' దగ్గర - ఎలాంటి హడావుడి లేదు
అఫీషియల్.. బన్నీ - కొరటాల సినిమా కన్ఫామ్
చిరు దివ్వెలతో అల్లు అర్జున్ కుటుంబం

పర్యావరణ దినోత్సవం నాడు ఓ ప్రతిజ్ఞ చేద్దాం
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా అల్లు అర్జున్ తన ఇంటి వద్ద మొక్క నాటి అందరూ నాటాలని పిలుపునిచ్చాడు. తాను మొక్క నాటి ఆ ఫొటోను షేర్ చేసి, అందరూ మొక్కలు నాటి తనలాగే చేయాలని పిలుపునిచ్చాడు. అంతేకాదు.. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరిన్ని మొక్కలు నాటాలని.. ఎకో ఫ్రెండ్లీ అలవాట్లు అలవరుచుకుందామని ప్రతిజ్ఞ చేద్దాం. మన భవిష్యత్తు తరాల కోసం మన భూమిని పచ్చదనానికి చిరునామాగా మార్చుదాం. ప్రతి ఒక్కరూ ఈ చర్యను తీసుకోవాలని కోరుతున్నాను. మొక్కలు నాటి షేర్ చేయండి.. వాటిల్లో కొన్నింటిని నేను రీషేర్ చేస్తాను. భూమిని రక్షించుకునేందుకు మనందరం కలిసి పని చేద్దాం' అని బన్నీ…

ఈస్ట్ గోదావరి అడవుల్లో "పుష్ప "
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణం గా నిలిచిపోయిన "పుష్ప మూవీ షూటింగ్ ముందుగా కేరళ అడవుల్లో చిత్రీకరణకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది . కరోనా కారణంగా హైదరాబాద్ దగ్గరలోని వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరపాలనుకొన్న ప్లాన్ మార్చి ఈస్ట్ గోదావరి రంప చోడవరం , మారేడు మిల్లి అడవులలో చిత్రీకరణ జరపడానికి చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.
మై క్యూటీ హ్యాపీ బర్త్ డే
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. ఇక టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ అండ్ క్యూట్ కపుల్స్ లో బన్నీ-స్నేహా రెడ్డి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధంలేని స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా.. ఫ్యామిలీ మాత్రం ఎప్పుడు ప్రాధాన్యం ఇస్తూనే వుంటారు. భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి సరదాగా గడుపుతుంటారు.
ఆదిలాబాద్ లో బన్నీ - ఫ్యామిలీ టూర్ మాత్రమే
అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక అందరూ చిన్న చిన్నగా షూటింగ్ లు మొదలు పెడుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన పుష్ప సినిమా చిత్రబృందం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.
బన్నీ 'ఐకాన్' రావడం పక్కా - వేణు శ్రీరామ్
బన్నీ ఐకాన్ సినిమా.. ఈ సినిమా ప్రకటించిన దగ్గరనుండి వార్తల్లోనే ఎక్కువ నిలిచింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం లో బన్నీ హీరోగా ఐకాన్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2019 లోనే ఈ సినిమాను ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ముందుకు వెళ్లలేకపోయింది. దానికి తోడు బన్నీ త్రివిక్రమ్ తో సినిమా మొదలుపెట్టేసరికీ అప్పట్లో ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ బన్నీ పుట్టినరోజున చిత్రయూనిట్ తరపున విషెస్ చెప్పి సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు.

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "దేశముదురు " మూవీ
యూనివర్సల్ మీడియా బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "దేశముదురు " మూవీ 2007 సంవత్సరం జనవరి 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బాలీవుడ్ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక ఈ మూవీ తో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యారు. "దేశముదురు " మూవీ లో హీరోయిన్ రంభ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. యాక్షన్ సీన్స్ , సాంగ్స్ , అలీ కామెడీ ట్రాక్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచాయి.
'గీతా ఆర్ట్స్ ఆఫీస్' దగ్గర - ఎలాంటి హడావుడి లేదు
లాక్ డౌన్ కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావుడి అనేది లేకుండా పోయింది. ఎప్పుడు ఏదో ఒక సినిమా ఓపెనింగ్ అంటూనో.. ఆడియో రిలీజ్ అంటూనే.. సినిమా రిలీజ్.. ప్రమోషన్స్ ఇలా నిత్యం హడావుడి.. బిజీ బిజీ గా ఉంటుంది. కానీ కరోనా వల్ల పరిస్థితి మారిపోయింది. సెలబ్రిటీస్ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో చాలా రోజులుగా ఇంట్లోనే ఉన్న అల్లు అర్జున్ తాజాగా తమ గీతా ఆర్ట్స్ సంస్థ ఆఫీస్ కు వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని బన్నీ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
అఫీషియల్.. బన్నీ - కొరటాల సినిమా కన్ఫామ్
బన్నీ-కొరటాల కాంబినేషన్ లో సినిమా.. ఈ కాంబినేషన్ పై ఇప్పటినుండి కాదు గత కొద్దిరోజులుగా వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సినిమా ఫిక్స్ అయిందని... త్వరలో అప్ డేట్ కూడా ఇస్తారన్న వార్తలు వినిపించాయి. ఇక ఈ కాంబినేషన్ కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. అయితే ఇప్పుడు అనుమానాలన్నిటికి బ్రేక్ వేసి అధికారిక ప్రకటన ఇచ్చేసారు. బన్నీ-కొరటాల కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.
చిరు దివ్వెలతో అల్లు అర్జున్ కుటుంబం
ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. మనిషి మనుగడకే ముప్పు ఏర్పడింది. కరోనా కట్టడి కై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రణాళికలతో ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు కూడా ప్రభుత్వాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమ వంతు సాయం అందించి కృషి చేయవల్సిన అవసరం ఉంది.