
ట్యాగ్ · 9 కథనాలు


'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీజర్ రిలీజ్

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' వాయిదా పడ్డ టీజర్

"ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" మూవీ అప్ డేట్

సుధీర్ బాబు-కృతి శెట్టి సినిమా ప్రారంభం

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే సమ్మోహనం తరువాత ఇంద్రగంటి-సుధీర్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మరో డీసెంట్ సినిమా అని చెప్పొచ్చు. ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా బాగానే ఆకట్టుకుంటుంది. అందరూ ఒకసారి ఈసినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' రిలీజ్ డేట్ ఫిక్స్..!
చిన్న క్యారెక్టర్ల ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో ఫైనెస్ట్ హీరోగా పేరుతెచ్చుకున్న నటుడు సుధీర్ బాబు. మొదట కాస్త ఒకే ధోరణి సినిమాలు చేసినా సమ్మోహనం నుండి తన రూటును మార్చాడు. ఆ తరువాత వి, ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి వినూత్న కథలను ఎంచుకుంటున్నాడు. ఇక ఇప్పుడు మరో ప్రేమకథతో రాబోతున్నాడు సుధీర్. సెన్సిటివ్ డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే లవ్ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక ఈసినిమా స్టార్ట్ అవ్వడానికి ఎప్పుడో స్టార్ట్ అయింది కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన…

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' రిలీజ్ డేట్ అప్ డేట్..!
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు కూడా సినిమా జయాపజయాలతో పనిలేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా వస్తుంది. ఇప్పటికే సుధీర్ బాబుతో కలిసి సమ్మోహనం, వి సినిమాలను తెరకెక్కించారు ఇంద్రగంటి. ఆ రెండు సినిమాలు మంచి హిట్ అవ్వడంతో ఈసినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటుంది. ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా నుండి తాజాగా రిలీజ్ అప్ డేట్ ఇచ్చారు…

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీజర్ రిలీజ్
టాలీవుడ్ లో ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇక అందులో టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ది డిఫరెంట్ స్టైల్. అందమైన ప్రేమకథలను తెరపై అంతే అందంగా చూపించడంతో ఇంద్రగంటిది డిఫరెంట్ స్టైల్. అష్టాచమ్మా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ఇంద్రగంటి ఎన్నో ప్రేమకథలను చూపించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా వస్తుంది. ఇప్పటికే సుధీర్ బాబుతో కలిసి సమ్మోహనం, వి సినిమాలను తెరకెక్కించారు ఇంద్రగంటి. ఆ రెండు సినిమాలు మంచి హిట్ అవ్వడంతో ఈసినిమాపై కూడా అంచనాలు పెరిగాయి.

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఆ సినిమాతో వీరిద్దరూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాతో వస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా .. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' వాయిదా పడ్డ టీజర్
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్, ఫస్ట్‌లుక్ చిత్రంపై క్యూరియాసిటీని పెంచేసింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్‌ను నేడు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వల్ల టీజర్‌ను విడుదల చేయలేకపోయింది. ఇక ఈ విషయాన్ని తెలియచేస్తూ చిత్రయూనిట్ అధికారికంగా తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వేదికగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సాంకేతిక కారణాల…

"ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" మూవీ అప్ డేట్
ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, సుధీర్ బాబు కాంబినేషన్ లో రూపొందిన " సమ్మోహనం" మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కుతుంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" మూవీ తెరకెక్కుతుంది. కృతిశెట్టి కథానాయిక కాగా అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణి నటరాజన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

"ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి " సెట్స్ లో కృతిశెట్టి
బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కృతి శెట్టి ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. కృతి శెట్టి కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

సుధీర్ బాబు-కృతి శెట్టి సినిమా ప్రారంభం
‘సమ్మోహనం’, ‘వి’ సినిమాల తర్వాత హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇటీవలే ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు. ఇక ఇదిలా ఉండగా నేడు ఈసినిమా షూటింగ్ లో సుధీర్ బాబు కూడా జాయిన్ అవుతున్నట్టు తెలుపుతున్నాడు. ఈసందర్భంగా సుధీర్ బాబు తన ట్విట్టర్ లో ఈసినిమా షూటింగ్ లో పాల్గొంటున్నా.. మరోసారి ఇంద్రగంటి గారితో సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.