
ట్యాగ్ · 10 కథనాలు


చార్మినార్ దగ్గర '7 డేస్ 6 నైట్స్' ప్రమోషన్స్..!

'7డేస్ 6 నైట్స్' మూడో ట్రైలర్ రిలీజ్

'7 డేస్ 6 నైట్స్' ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

సంక్రాంతి బరిలో ఎం.ఎస్ రాజు '7 డేస్ 6 నైట్స్'

7డేస్ 6 నైట్స్.. షూటింగ్ కంప్లీట్

'7 డేస్ 6 నైట్స్' కీలక షెడ్యూల్ కంప్లీట్

'7 డేస్ 6 నైట్స్' షూటింగ్ ప్రారంభం

7 డేస్ 6 నైట్స్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ కాబట్టి యూత్ కు కనెక్ట్ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈసినిమా నచ్చుతుందని చెప్పలేము.

చార్మినార్ దగ్గర '7 డేస్ 6 నైట్స్' ప్రమోషన్స్..!
ఇప్పుడున్న రోజుల్లో సినిమాను ఎంత వెరైటీగా ప్రమోషన్ చేస్తే సినిమాకు అంత బజ్ క్రియేట్ అవుతుంది. అందుకే మేకర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ తో వస్తున్నారు. సినిమాపై హైప్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక 7 డేస్ 6 నైట్స్ సినిమా కూడా ఇప్పుడు అదే రూట్ లో వెళుతుంది. ఈసినిమా ఈ నెల 24న రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే మూడు ట్రైలర్ లను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లు కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక తాజాాగా చిత్రబృందం ప్రమోషన్స్ లో భాగంగా చార్మినార్ ను సందర్శించింది. 7 డేస్ 6 నైట్స్ టీమ్ ఆ ప్రదేశం చుట్టూ తిరిగారు. ఈ సందర్భంగా అశ్విన్…

'7డేస్ 6 నైట్స్' మూడో ట్రైలర్ రిలీజ్
`డర్టీ హరి` లాంటి థ్రిల్లర్ కమ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు ఎం.ఎస్ రాజు. ఈసినిమా యూత్ కు బాగా కనెక్ట్ అవ్వడంతోనే అలాంటి విజయం అందుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఈసినిమా కూడా యూత్ ను టార్గెట్ చేసి తీసినట్టే ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి ట్రైలర్లను అర్థమవుతుంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకూ రెండు ట్రైలర్ లు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మూడో ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఫన్ అండ్ ఎనర్జిటిక్` ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ చెప్పినట్టే ఈ మూడో ట్రైలర్ కూడా చాలా ఫన్ గా ఉంది.

'7 డేస్ 6 నైట్స్' ట్రైలర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన ఎం.ఎస్. రాజు ఇటీవల దర్శకుడిగా మారి ‘డర్టీ హరి’ చిత్రం తెరకెక్కించిన సంగతి తెలిసిందే . ఈ సినిమా అందించిన విజయంతో ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. '7 డేస్ 6 నైట్స్' టైటిల్ తో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది . నిజానికి ఈసినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించగా అప్పుడు పరిస్థితులు బాలేకపోవడంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నారు. ఇక ఇదిలా ఉండగా మరోపక్క చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలోభాగంగానే ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా…

సంక్రాంతి బరిలో ఎం.ఎస్ రాజు '7 డేస్ 6 నైట్స్'
ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎం.ఎస్ రాజు కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. 'డర్టీ హరి'తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఆ సినిమాతో సక్సెస్ కొట్టాడు ఎం.ఎస్ రాజు. ఇక ఆసినిమా ఇచ్చిన సక్సెస్ తో ఎం.ఎస్ రాజు '7 డేస్ 6 నైట్స్' లాంటి యూత్ ఎంటర్టైనర్ తో వచ్చేస్తున్నాడు. ఈసినిమాను కరోనా ప్రభావం తగ్గిన తరువాతే స్టార్ట్ చేశారు. అయినా కూడా ఎం.ఎస్ రాజు అన్ని జాగ్రత్తలు తీసుకొని చాలా ఫాస్ట్ గానే షూట్ ను కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుంది.

7డేస్ 6 నైట్స్.. షూటింగ్ కంప్లీట్
నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఎమ్.ఎస్ రాజు ఇప్పుడు డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇప్పటికే డర్టీ హరి సినిమాతో హిట్ అందుకున్న ఎమ్ ఎస్ రాజు ఇప్పుడు మరో యూత్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ఇక ఈ సినిమాను కరోనా సెకండ్ వేవ్ తరువాతే సెట్స్ పైకి తీసుకెళ్లాడు ఎమ్ ఎస్ రాజు. అయినా కూడా చాలా ఫాస్ట్ గా ఈసినిమాను కంప్లీట్ చేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకోంది. ఇక ఈవిషయాన్ని అధికారికంగా తెలియచేశారు మేకర్స్. కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.

'7 డేస్ 6 నైట్స్' కీలక షెడ్యూల్ కంప్లీట్
'డర్టీ హరి'తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఆ సినిమాతో సక్సెస్ కొట్టాడు ఎం.ఎస్ రాజు. ఈసినిమా తరువాత ఎం.ఎస్ రాజు '7 డేస్ 6 నైట్స్' లాంటి యూత్ ఎంటర్టైనర్ తో రానున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి కూడా విదితమే. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. గత కొద్దిరోజులుగా ఈసినిమా షూటింగ్ గోవాలో జరుపుకుంటుంది. అయితే భారీ వర్షాలు కురుస్తూ, కరోనా నియమాల కఠినంగా అమలవుతున్న గోవా లో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ 100 మంది టీంతో ఈ షెడ్యూల్ ను పూర్తి చేసినట్టు చిత్రయూనిట్ తెలుపుతుంది.

'7 డేస్ 6 నైట్స్' ఫస్ట్ లుక్ రిలీజ్
‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను టాలీవుడ్ కు అందించిన నిర్మాత ఎం.ఎస్ రాజు. ఆతరువాత కొంత కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఎం.ఎస్ రాజు మళ్లీ ‘డర్టీ హరి’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్నే దక్కించుకున్నారు. ఇప్పుడు 7 డేస్ 6 నైట్స్ అంటూ మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈసినిమా హైద్రాబాద్ లో ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసింది. హైద్రాబాద్ తరువాత గోవా, మంగళూరు, అండమాన్ నికోబార్ దీవుల్లో షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకున్నట్టు ఇప్పటికే తెలిపారు. ఇక ఇదిలా ఉండగా నేడు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయనిట్. ఇక…

'7 డేస్ 6 నైట్స్' ఫస్ట్ లుక్ కు టైమ్ ఫిక్స్
డర్టీ హరీ అనే రొమాంటిక్ థ్రిల్లర్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఎం.ఎస్ రాజు ఇప్పుడు మరో డిఫరెంట్ యూత్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో 7 డేస్… 6 నైట్స్ అనే సినిమా వస్తుంది. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఈనేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది.

'7 డేస్ 6 నైట్స్' షూటింగ్ ప్రారంభం
ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఎం.ఎస్ రాజు ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే డర్టీ హరీ అనే రొమాంటిక్ థ్రిల్లర్ ను తెరకెక్కించాడు. ఆసినిమా మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఇప్పుడు మరో డిఫరెంట్ యూత్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో 7 డేస్… 6 నైట్స్ అనే సినిమా వస్తుంది. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేదు.