
ట్యాగ్ · 30 కథనాలు · పేజీ 2


రివ్యూ : 35 చిన్న కథ కాదు
ఓవరాల్ గా 35 చిన్న కథ కాదు అంటూ వచ్చిన ఈసినిమా అందరు చూసే కథ తో మెప్పించింది అని చెప్పొచ్చు.కథ ,నటీనటులు,డైరెక్షన్,మాటలు సినిమాలో హైలైట్ అయ్యాయి.ఫ్యామిలీతోపాటు చూసే ఓ మంచి సినిమా ఈ 35 చిన్న కథ కాదు.

ది గోట్.. తెలుగు రివ్యూ
హీరోలు ఎప్పుడూ మంచివారిగా కనిపించడం సాధారణ విషయమే. అప్పుడప్పుడూ వారిలో విలనిజం చూస్తే కిక్ ఉంటుంది. అందుకు 'ది గోట్' బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. మొత్తానికి 'ది గోట్' విజయ్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ అందరినీ అలరించేలా ఉంది. ప్రీ ఇంటర్వెల్ ఫైట్, విజయ్ విలనిజం హైలైట్స్ అని చెప్పొచ్చు.

సరిపోదా శనివారం తెలుగు రివ్యూ
మొత్తానికి మంచి అంచనాల మధ్య వచ్చిన సరిపోదా శనివారం అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు. నాని, ఎస్‌జే సూర్య నటన, స్క్రీన్ ప్లే, సెకండాఫ్ సినిమాలో హైలైట్ అయ్యాయి. ఓవరాల్‌గా అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.

మారుతీ నగర్ సుబ్రమణ్యం.. తెలుగు రివ్యూ
అలాగే టెక్నికల్ పరంగా ఈ సినిమా ఉన్నతంగా వుంది. కళ్యాణ్ నాయక్ పాటలు ఆకట్టుకున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన 'మేడమ్ సార్ మేడమ్ అంతే' ట్యూన్, చిత్రీకరణ సూపర్బ్. అలాగే నేపథ్య సంగీతం సైతం కామెడీ సన్నివేశాలకు తగ్గట్టుగా వుంది. ఎంఎన్ బాల్ రెడ్డి కెమెరా వర్క్ చాలా బావుంది. ఎడిటర్ బొంతల నాగేశ్వరరావు పనితనం కామెడీకి హెల్ప్ అయ్యింది. నిర్మాణ విలువలు బావున్నాయి. తబితా సుకుమార్ సమర్పణ వల్ల సినిమాకు మంచి ప్రచారం దక్కింది. మొత్తానికి మారుతీ నగర్ సుబ్రమణ్యం మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.

ఆయ్.. తెలుగు రివ్యూ
మొత్తానికి ఆయ్ సినిమా పల్లెటూర్లలో పుట్టి పెరిగిన వారికి బాగా కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి తమ చిన్ననాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తుంది. పల్లెటూరి యువత చేసే చిలిపి పనులు ఒకవైపు నవ్విస్తుంటే.. మరోవైపు కులాల అంతరాలు వారిని, వారి ప్రేమను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా ఆలోచింపజేసేలా ఉంది. కంప్లీట్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. ఒక మంచి సినిమాను చూసిన అనుభూతిని కలగజేస్తుంది.

తంగలాన్.. తెలుగు రివ్యూ
కాగా మొత్తానికి తంగలాన్ సినిమా రెగ్యులర్ సినిమాల్లా కాకుండా వైవిధ్యం కోరుకునే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. బ్రిటిష్ కలోనియం నాటి పరిస్థితులు, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, అక్కడి గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం కళ్ళకు కట్టినట్టు చూపించింది. ప్రతి సన్నివేశం రా అండ్ రస్టిక్ గా ఉండి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. ధనిక, పేద వర్గాల మధ్య సహజంగా ఉండే తారతమ్యాలు, అధికార బలం సామాన్యుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో హృద్యంగా ఆవిష్కరించింది. ఒక మంచి సినిమాను చూసిన అనుభూతిని కలగజేస్తుంది తంగలాన్.

మిస్టర్ బచ్చన్ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే రవితేజ సినిమా కాబట్టి చాలా మందికి సినిమా చూడాలన్న ఇట్రెస్ట్ ఉంటుంది. రవితేజ అభిమానులకు అయితే ఎలాగైనా నచ్చేస్తుంది. ఇక మిగిలిన వర్గాల వారు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పొచ్చు.

డబుల్ ఇస్మార్ట్ రివ్యూ
ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ డబుల్ ఇస్మార్ట్ టైం పాస్ చేయిస్తుంది.రామ్ నటన,డ్యాన్స్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి.ఇస్మార్ట్ శంకర్ నచ్చిన వారికి డబుల్ ఇస్మార్ట్ నచ్చుతుంది. మిగితావారు కూడా ఓసారి చూసేయొచ్చు.

కమిటీ కుర్రోళ్ళు.. తెలుగు రివ్యూ
మొత్తానికి కమిటీ కుర్రాళ్లు సినిమా పల్లెటూర్లలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఎంతటివారికైనా తమ చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా ఉంది. ప్యూర్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. అలాగే విలేజ్ యువత ఒకవైపు చిలిపి పనులతో నవ్విస్తూనే మరోవైపు కులాల కుంపట్లు జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా ఆలోచింపజేసేలా ఉంది. ఒక మంచి సినిమాను చూసిన అనుభూతిని కలగజేస్తుంది ఈ చిత్రం.

మురారి రీ రిలీజ్.. థియేటర్ల వద్ద మహేష్ ఫ్యాన్స్ కోలాహలం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శుక్రవారం జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన ‘మురారి’ చిత్రం మళ్ళీ విడుదలైంది. 4k టెక్నాలజీతో సరికొత్త హంగులతో ముస్తాబై నేడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా గ్రాండ్ రీ రిలీజ్ అయింది.